ఒకే ఒక్క ఉద్యోగం కోసం నూట యాభైమంది రెజ్యూమ్‌లు పంపారు. అందులో ఎంత మంది రెజ్యూమ్‌లను చూస్తారో కూడా చెప్పలేం. అందులో తనది ఉంటుందో లేదో కూడా అనుమానమే. అందుకే ఆ యువకుడు కొత్తగా  ఆలోచించాడు. అతని ఆలోచనే సంస్థ మేనేజర్ల దృష్టిని ఆకర్షించింది. చివరికి ఎవరి రెజ్యూమ్ కూడా చూడకుండా, ఎవరికీ ఇంటర్య్వూలు పెట్టకుండా ఆ యువకుడినే ఎంపిక చేశారు. 


ఇంతకీ ఏం చేశాడు?
ఆ యువకుడి పేరు జోనాధన్ స్విఫ్ట్. వయసు 24 ఏళ్లు. నివసించేది బ్రిటన్లో. అతని ప్రింటింగ్ స్పెషలిస్ట్ అనే ఉద్యోగానికి అప్లయ్ చేశాడు. ఒకే ఒక పోస్టు ఖాళీ ఉందని, దాదాపు 150 మంది అప్లయ్ చేశారని తెలిసింది. వెంటనే అతని బుర్రలో మెరుపులాంటి ఆలోచన వచ్చింది. వెంటనే తన ఫోటో, స్కిల్స్, ఏ ఉద్యోగానికి అప్లయ్ చేశాడో చెబుతూ ఫ్లయర్స్ ప్రింట్ చేయించాడు. వాటిని ఆ సంస్థ పార్కింట్ ప్రదేశంలో ఉన్న కార్లన్నింటి మీద పెట్టాడు. వాటిని ఆ సంస్థ మేనేజర్లు, హెచ్ ఆర్ అధికారులు చూశారు. చూసిన వారిలో ఆ ఉద్యోగానికి ఎంపిక చేసే అధికారి కూడా ఉన్నాడు. అతను సీసీటీవీలో స్విఫ్ట్ చేసిన పనిని కూడా చూశాడు. వెంటనే అతనికి ఫోన్ చేసి పిలిచి మరీ ఉద్యోగం ఇచ్చారు. 


‘నేను ఆఫీస్ కిటికీలోంచి బయటకు చూసినప్పుడు కార్ల విండ్ స్క్రీన్ లపై ఫ్లైయర్లు కనిపించాయి. అవి ఎవరు పెట్టారో సీసీటీవీ ఫుటేజ్లో చూశాను. వాస్తవానికి ఆ పని నాకు చాలా వెరైటీగా అనిపించింది. వెంటనే అతడిని పిలిచి ఇంటర్య్వూ నిర్వహించాను. ఉద్యోగానికి సరైన వ్యక్తి అనిపించడంతో ఎంపికచేశాను’ అని చెప్పుకొచ్చాడు ఒక మేనేజర్. 






Also read: ఆల్కహాల్ తాగే ముందు వీటిని తినండి... తాగే మోతాదుతో పాటూ, హానికర ప్రభావాలు తగ్గుతాయి


Also read: కదలకుండా గంటలుగంటలు టీవీ చూసే వారికి హెచ్చరిక... ఆ సైలెంట్ కిల్లర్ చంపేయచ్చు