ఎక్కువ మందికి రాత్రి పడుకునేటప్పుడు లైట్లు ఆపేసి నిద్రపోయే అలవాటు ఉంటుంది. కొందరు మాత్రం ఎంతో కొంత వెలుగు ఉంటేనే నిద్రపోతారు. వెలుగు లేకుంటే భయపడిపోతూ ఉంటారు. అయితే పరిశోధనల ప్రకారం రాత్రి నిద్ర పోయేటప్పుడు  కాంతి ఉండాలా వద్దా అనే విషయం తెలుసుకుందాం.


ఆరోగ్య నిపుణులు చెబుతున్న అభిప్రాయం ప్రకారం శరీరానికి తగినంత విశ్రాంతి, మెదడుకు ప్రశాంతత దొరకాలంటే చీకటి వాతావరణంలోనే నిద్రపోవాలి. రాత్రిపూట కాంతికి గురి కావడం వల్ల శరీరంలోని సహజంగా పనిచేసే సిర్కాడియన్ రిథమ్ పనితీరులో మార్పు రావచ్చు. లైట్లు వేసుకొని నిద్ర పోవడం వల్ల ఫ్రాగ్మెంటేడ్ నిద్ర వస్తుంది. అంటే ఈ నిద్ర సరైనది కాదు. నిద్ర నాణ్యత తగ్గుతుంది. చివరికి డిమ్‌గా ఉండే లైట్లు కూడా నిద్ర నాణ్యతను ప్రభావితం చేస్తాయి. నిద్ర తక్కువగా పడుతుంది. ప్రశాంతంగా అనిపించదు. కాబట్టి పూర్తి చీకటిలో పడుకుంటేనే ప్రశాంతమైన, గాఢమైన నిద్ర పడుతుందని చెబుతున్నారు నిపుణులు.


రాత్రిపూట శరీరం కాంతికి గురి కావడం వల్ల నిద్రలేమి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మీ మెదడు కూడా నిద్ర సమయాన్ని సరిగా అంచనా వేయలేదు. నిద్రలేమి లక్షణాలు తీవ్రంగా మారిపోతాయి. లైట్లు వేసుకొని నిద్రపోవడం వంటివి డిప్రెషన్, మానసిక ఆందోళన వంటి రుగ్మతలకు కారణం కావచ్చు. ఇలాంటి నిద్రా విధానాలు మెదడులోని న్యూరో ట్రాన్స్మిటర్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి. భావోద్వాగాల నియంత్రణను ప్రభావితం చేస్తాయి.


ఆరోగ్య నిపుణులు చెబుతున్న దాన్ని బట్టి రాత్రి నిద్రపోయే ముందు కచ్చితంగా అన్ని లైట్లు ఆపేసి చీకటిలోనే నిద్రపోవాలి. లైట్లు వేసుకొని నిద్రపోవడం వల్ల మొత్తం ఆరోగ్యం పైన ప్రతికూల ప్రభావం పడుతుంది. రాత్రిపూట గదిలో లైట్లు వేస్తారు, అంటే అది కృత్రిమ కాంతి. ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా వచ్చే కాంతి. ఇది శరీరంలోనే సహజంగా నిద్ర మేల్కొనే చక్రాన్ని గజిబిజిగా మార్చేస్తుంది. ఆ చక్రాన్ని సిర్కాడియ్ రిథమ్ అంటారు. ఇది మెలటోనిన్ అనే హర్మాను విడుదల ద్వారా నియంత్రణలో ఉంటుంది. అయితే ఈ హార్మోనులో రాత్రిపూట కాంతి ఉంటే  సమతుల్యత దెబ్బతింటుంది. దీని వల్ల ఊబకాయం, మధుమేహం, గుండె సంబంధ వ్యాధులకు, క్యాన్సర్లకు కారణం కావచ్చు. కాబట్టి వీలైనంత వరకు రాత్రిపూట పూర్తిగా లైట్లు ఆపేసి నిద్రపోవడం చాలా ముఖ్యం. బెడ్‌రూమ్‌ను చీకటిగా ఉంచడం, బ్లాక్‌అవుట్ కర్టెన్‌లు లేదా ఐ మాస్క్‌ని ఉపయోగించడం వంటివి చేయాలి.  


Also read: ప్రపంచంలోనే ప్రమాదకరమైన చెట్లు ఇవి, వీటి కింద నిలుచున్నా ప్రాణాపాయమే



Also read: దంతాలు పరిశుభ్రంగా లేకపోతే మీ మెదడు పరిమాణం తగ్గిపోతుంది, జాగ్రత్త




















































































































































































































































































































































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.