శృంగారం ఒక కళ అంటే మీరు నమ్ముతారా? ఎందుకంటే.. కొంతమంది శృంగారాన్ని పూర్తిగా ఆస్వాదించలేరు. ఫలితంగా కాసేపటికే చేతులెత్తేస్తారు. ఎక్కువ సేపు చేసేందుకు అవకాశం ఉన్నా.. ఆసక్తి చూపరు. మరికొందరు తెగ గాబరా పడిపోతారు. కొంతమంది ఎక్కువ సేపు చేయాలనే ఆశ ఉన్నా.. తగిన కిటుకులు తెలియక గందరగోళానికి గురవ్వుతారు. అత్యుత్సాహంతో మరికొందరు వేగంగా చేసేస్తూ త్వరగా ఔటైపోతారు. అందుకే దీన్ని ఒక కళగా చెప్పుకోవచ్చు. ఈ కళ గురించి తెలిసినవాళ్లు సెక్స్ జీవితాన్ని చాలా ఎంజాయ్ చేస్తారు. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా వారి సెక్స్ డ్రైవ్ భలే సాఫీగా సాగిపోతుంది. మరి మీకు కూడా అలా పవర్ కావాలా? అయితే, ముందుగా సెక్స్ డ్రైవ్‌కు సంబంధించిన ఈ ఆసక్తికర విషయాలు గురించి తెలుసుకోండి. 


సెక్స్ సగటు సమయం ఎంత?: 2005 సంవత్సరంలో ఐదు దేశాల్లో నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. సగటున 5 నుంచి 6 నిమిషాల వరకు సెక్స్ చేస్తున్నట్లు తేలింది. అయితే, చాలామంది పోర్న్ సినిమాల్లో సీన్లు చూసి.. అంత సేపు ఆగకుండా చేయాలని అనుకుంటారు. కానీ, అవి వీడియోలు మాత్రమే. అందులో చూపించినట్లు.. గంటలు కొద్ది చేయడం అంత సాధ్యం కాదు. పైగా వారు వయాగ్రా వంటివి తీసుకుని ఆ వీడియోల్లో నటిస్తారు. వాటిని చూసి చాలామంది అదే నిజమేమో అనుకుంటారు. వాటి వల్ల బుర్రలో తప్పుడు ఆలోచనలు మెదలుతాయి. వారు చేస్తున్నంత సేపు చేయలేకపోతున్నామే అనే బాధ వెంటాడుతుంది. ఓర్లాండ్ హెల్త్ మెడికల్ గ్రూప్‌ యూరాలజీ పీయూఆర్‌కు చెందిన జమిన్ బ్రహ్మభట్ ఈ విషయాన్నే స్పష్టం చేశారు. చాలా వరకు జంటలు.. పార్న్ వీడియోల్లో ఉన్నది నిజమని భ్రమించి దూరమవుతున్నాయని తెలిపారు. తమ పార్టనర్ ప్రేమతో సెక్స్ చేయడంలేదని మహిళలు, తాను ఆ వీడియోల్లో చూపించినంత సేపు చేయలేకపోతున్నా అని పురుషులు మానసిక ఆందోళనకు గురవ్వుతున్నట్లు పేర్కొన్నారు. సెక్స్ ఇంత సమయమే చేయాలనే రూల్ ఏమీ లేదని, ఇద్దరు ఎంత వరకు ఎంజాయ్ చేస్తారో అంతవరకు చేయొచ్చని.. సమయాన్ని లెక్క వేసుకోకూడదని స్పష్టం చేశారు. అయితే, కొందరు త్వరగా ఔట్ అయిపోవడానికి.. వేరే కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. 


త్వరగా ఎందుకు పూర్తవుతుంది?: ఒక నిమిషం కంటే తక్కువ సమయంలో స్కలనం జరిగితే.. మీరు అకాల స్కలనం లేదా శీఘ్ర స్కలనంతో బాధపడుతున్నట్లు అర్థం. దీనికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. సెక్స్‌కు ముందు మీరు హస్త ప్రయోగం చేసినట్లయితే.. మళ్లీ అంగ స్తంభన కష్టం కావచ్చు. అయితే, మీరు చాలా సేపటి క్రితం హస్త ప్రయోగం చేసుకుని భావప్రాప్తి పొందినట్లయితే.. అంగం స్తంభించి ఎక్కువ సేపు సెక్స్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. మీరు సెక్సును పనిగా చేస్తున్నట్లుగా ఫీలవ్వకుండా.. ఆ కదలికలను ఎంజాయ్ చేయాలి. అప్పుడే మీరు ఎక్కువ సేపు ఆ పనిచేయగలరు.


మీరు తినే ఆహారం నుంచి చూసే సినిమా వరకు..: మీరు సెక్స్‌కు ముందు అతిగా డిన్నర్ చేయొద్దు. త్వరగా అలసిపోతారు. అలాగే మీరు రాత్రి వేళ్లలో చూసే సినిమా ఆహ్లాదకరంగా ఉండాలి. ముఖ్యంగా రొమాంటిక్ చిత్రాలు చూడాలి. అలాగని పోర్న్ సినిమాలు అస్సలు చూడొద్దు. మీ మనస్సులో రొమాంటిక్ ఫీల్స్ ఉన్నప్పుడే సెక్స్‌ను ఎంజాయ్ చేయగలుగుతారు. అయితే.. సెక్స్ అనేది మీ ఒక్కరి ఆట మాత్రమే కాదు.. మీ పార్టనర్ కూడా మీకు సహకరించాలి. కాబట్టి.. ఆమెతో మరింత ప్రేమగా కబుర్లు చెప్పండి. అప్పుడు మీరు ఆ ఆటలో ఇద్దరూ గెలుస్తారు. 


మరీ సున్నితంగా ఉంటే..: మీ అంగం మరీ సున్నితంగా ఉన్నట్లయితే.. సెక్స్ సమయంలో జరిగే రాపిడి వల్ల తీవ్ర ఉద్వేగానికి గురై త్వరగా స్కలిస్తారు. అలాంటి తిమ్మిరి లేదా సున్నితత్వాన్ని తగ్గించేందుకు లిడోకాయిన్, ప్రిలోకైన వంటి పదార్థాలు ఉంటాయి. ఇవి ఎక్కువగా క్రీములు లేదా స్ప్రేలుగా వస్తాయి. వైద్యుడి సూచనలతో మాత్రమే వీటిని వాడలి. లేకపోతే.. మొదటికే మోసం వస్తుంది. అయితే, సెక్స్ చేసే ముందు వాటిని కడిగేయాలి. లేకపోతే వాటి ప్రభావం మీ పార్టనర్‌పై ఉండవచ్చు. సెక్స్ థెరపిస్ట్‌ను కలవడం వల్ల మరింత ప్రయోజనం లభిస్తుంది.  


ఫోర్ ప్లే..  స్టాప్ అండ్ స్క్వీజ్: సెక్స్ ఎక్కువ సేపు ఎంజాయ్ చేయాలంటే.. తెలియాల్సిన ముఖ్యమైన కిటుకు.. స్టాప్ అండ్ ప్రొసీడ్. చాలామంది.. చాలా వేగంగా చేస్తున్నాం.. అరిపిస్తున్నాం అనుకుంటారు. కానీ, దాని వల్ల అలసటే తప్ప మరేదీ ఉండదు. పైగా మీ పార్టనర్‌ ఆ క్రీడ మరింత సేపు సాగాలని కోరుకుంటుంది. కాబట్టి.. స్లో అండ్ స్టడీ.. విన్ ది రేస్ అన్నట్లుగా.. ‘స్టాప్ అండ్ స్క్వీజ్’ విధానంలో కాస్త నెమ్మదిగా.. కాస్త వేగంగా చేయడం ద్వారా అంగాన్ని ఎక్కువ సేపు గట్టిగా ఉంచవచ్చు. మీరు స్కలనం చేయబోతున్నారని భావించే వరకు సెక్స్ చేయాలి. స్కలనం అవుతుందనగా.. అంగాన్ని బయటకు తీసి.. మళ్లీ లోపల పెట్టి కొనసాగించాలి. హస్త ప్రయోగం అలవాటు ఉన్నవారికి ఈ టెక్నిక్ బాగా తెలుస్తుంది. మధ్య మధ్యలో మీ పార్టనర్ అధరాలను జుర్రుకోవడం ద్వారా కూడా అంగాన్ని గట్టిపడేలా చేయొచ్చు. అలాగే సెక్స్‌ అంటే అంతా కేవలం అంగ ప్రవేశమే అనుకుంటారు. ఫోర్ ప్లే కూడా మీరు ఎక్కువ సేపు సెక్స్ చేయడానికి సహకరిస్తుంది. 


మానసిక ఆందోళన వద్దు: లైంగిక సమస్య అనేది మానసిక ఆందోళనపై ఆధారపడి ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మీ లైంగిక పనితీరు గురించిన ఆందోళన, అకాల స్ఖలనంతో ఇవి ముడిపడి ఉన్నాయని నిపుణులు తెలుపుతున్నారు. మీపై మీకు నమ్మకం లేకపోవడం, ఒత్తిడికి గురికావడం లేదా అపరాధ భావన కూడా మిమ్మల్ని సెక్స్‌ను త్వరగా ముగించేలా చేస్తాయి. మెడలోని థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ అనే హార్మోన్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేసే హైపర్ థైరాయిడిజం వల్ల కూడా అకాల స్ఖలనం సంభవించవిస్తుంది. థైరాయిడ్ సమస్యలు సెక్స్ సామర్థ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయనేది పరిశోధకులు ఖచ్చితంగా అంచనా వేయలేదు. కానీ హైపోథైరాయిడిజం కోసం చికిత్స పొందిన తర్వాత పురుషుల్లో చాలామందికి శీఘ్రస్ఖలన సమస్య తగ్గిందని రిపోర్టులు తెలుపుతున్నాయి.


కండోమ్‌ వాడండి: శీఘ్ర స్ఖలనం అనేది హైపర్సెన్సిటివిటీ వల్ల కూడా కావచ్చు. కాబట్టి, కండోమ్‌ని ఉపయోగించడం ద్వారా సెక్స్‌ను ఎక్కువ సేపు చేయొచ్చు.  కండోమ్ పురుషాంగం చుట్టూ ఒక అవరోధాన్ని ఏర్పరుస్తుంది. ఫలితంగా సున్నితత్వం తగ్గి త్వరగా స్కలనం కాకుండా సహకరిస్తుంది. 


Also Read: మూడ్ రావాలంటే మల్లెపూలే అక్కర్లేదు.. ఇవి కూడా మత్తెక్కిస్తాయ్!


ఏదారి లేకపోతే.. వయాగ్రానే గతి: పైన చెప్పిన అన్ని ప్రయత్నాలు విఫలమైతే.. వయాగ్ర ఒక్కటే మార్గం. వైద్యుల సూచనలతో మాత్రమే వాటిని తీసుకోవాలి. కానీ, అతిగా తీసుకుంటే.. అదే గతి అవుతుంది. సహజంగా స్తంభించాల్సిన అంగం.. వయాగ్రాకు అలవాటు పడితే ప్రమాదమే. అయితే, వయాగ్రా.. శీఘ్ర స్కలనంతో బాధపడుతున్న చాలామందికి ఉపయోగపడుతోందట. 2007లో జరిగిన అధ్యయనం ప్రకారం.. వయాగ్రా శీఘ్రస్ఖలనం ఉన్న పురుషులకు ఎక్కువ కాలం సహాయపడుతోందని, స్టాప్-స్క్వీజ్ టెక్నిక్ కంటే బాగా పనిచేస్తుందని తెలిపింది. ఈ అధ్యయనంలో పాల్గొన్నవారిలో 87 శాతం మంది వయాగ్రాను,   45 శాతం మంది వ్యక్తులు స్టాప్ అండ్ స్క్వీజ్‌ టెక్నిక్‌తో ఎక్కువ సేపు సెక్స్‌లో పాల్గొంటున్నట్లు తేలింది. సెక్స్‌లో ఎక్కువ సేపు పాల్గొనేందుకు కొన్ని ఆహారాలు కూడా మీకు ఉపయోగపడతాయి. అవేంటో తర్వాతి చిట్కాల్లో చూద్దాం.


Also Read: సెక్స్ పై ఇంట్రస్ట్ తగ్గే వయసేది? ఆ థాట్స్ ఎప్పటి వరకు ఉంటాయి? 
Also Read: చింపాంజీలకు మనుషుల వీర్యం.. రష్యా శాస్త్రవేత్త ప్రయోగం ఫలించిందా? 
Also Read: ఆహారం తినకపోతే అంత ప్రమాదమా? మన శరీరం మనల్నే తినేస్తుందా?
Also Read: డేటింగ్, వన్ నైట్ స్టాండ్‌కు మధ్య తేడా ఏమిటీ? ఏది సేఫ్?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి