XEC symptoms : కరోనా వెళ్లినా వివిధ వేరియంట్ల రూపంలో వస్తూనే ఉంది. అయితే ఇవేమి అంతగా ప్రభావం చూపించలేదు కానీ.. ఇప్పుడు వస్తున్న XEC వేరియంట్ (Corona New Variant) పట్ల అప్రమత్తంగా ఉండాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే ఈ వైరస్ యూరప్ అంతటా వేగంగా వ్యాపిస్తోంది. త్వరలోనే ఇది ప్రపంచమంతా కరోనా విధంగా మారే అవకాశాలు ఉన్నాయంటూ హెచ్చరిస్తున్నారు నిపుణులు. అసలు ఈ వేరియంట్ లక్షణాలు ఏంటి? టీకాలు దీనిని ఎదుర్కోగలవా? రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


కరోనా వేరియంట్​గా వచ్చిన XEC వేగంగా వ్యాపిస్తోంది. జర్మనీలో మొదటి కేసును గుర్తించగా.. ఇప్పుడు యూరప్ కంట్రీస్​లో ఇది విజృంభిస్తోంది. యూకే, యూఎస్, చైనా వంటి దేశాలతో సహా 27 దేశాల్లో ఇది ఇప్పటికే వ్యాపించింది. ఇండియాలో ఇప్పటికీ ఎలాంటి కేసు నమోదు కానప్పటికీ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయంటున్నారు నిపణులు. 


XEC వేరియంట్ 


ఓమిక్రాన్​ సబ్​ వేరియంట్స్​ నుంచి XEC వేరియంట్ వచ్చినట్లు నివేదికలు చెప్తున్నాయి. అయితే ఈ వేరియంట్​కి కూడా కొన్ని సబ్​వేరింయట్స్ ఉండొచ్చని చెప్తున్నారు. వీటిని డెన్మార్క్, జర్మనీ, యూకే, నెదర్లాండ్స్​లో కొత్త వేరియంట్ బాగా వృద్ధి చెందుతున్నట్లు నివేదిక పేర్కొంది. అయితే ఇది కొన్ని నెలల్లో తీవ్ర స్థాయికి చేరుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. అంతేకాకుండా శీతాకాలంలో ఈ వేరియంట్ బాగా వ్యాపించవచ్చని చెప్తున్నారు. అయితే టీకాలు కేసుల తీవ్రతను తగ్గించడంలో హెల్ప్ చేస్తాయని చెప్తున్నారు. 


మునపటి వేరియంట్స్ కంటే డేంజర్


ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిపై ఎలాంటి పబ్లిక్ ప్రొఫైల్ చేయనప్పటికీ.. Scripps Covid-19 ఎపిడెమియాలజీ ట్రాకర్ Outbreak.info వేరియంట్‌ తీవ్రతను చెప్తోంది. మరికొన్ని రోజుల్లో ఇది అంటువ్యాధిగా విజృంభించే అవకాశాలు పెరుగుతాయని వెల్లడించింది. ఎందుకంటే ఇది స్పైక్ ప్రోటీన్​పై అనేక వేరియంట్స్​ను కలిగి ఉంటుంది. ఇటీవల వచ్చిన ఎన్నో వేరియంట్స్ కంటే.. XEC మరింత ప్రభావాన్ని చూపించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. 


లక్షణాలు ఇవే


XEC అనేది కరోనాకు కొత్త వేరియంట్ కాబట్టి దీనిలో కొత్త లక్షణాలు ఏవి నివేదించలేదు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం.. జ్వరం, చలి, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, గొంతు నొప్పి వంటి లక్షణాలే ఉంటాయని తెలిపింది. అలసట, జలుబు, కండరాల నొప్పులు, తలనొప్పి, వికారం, వాంతులు, అతిసారం వంటి లక్షణాలు కూడా ఉంటాయి. 



చికిత్స ఉందా?


టీకాలు కేసుల సంఖ్యను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. అయితే ఎక్కువ ప్రమాదమున్నవారు మాత్రం ముందస్తు జాగ్రత్తగా బోల్స్టర్ షాట్​ తీసుకోవాలంటున్నారు. అయితే ఈ వైరస్ బారిన పడిన చాలామంది వారాల్లోనే కోలుకుంటున్నారని చెప్తున్నారు. కానీ కొందరిలో దీర్ఘకాలిక లక్షణాలు ఉంటాయని చెప్తున్నారు. అయితే చలికాలంలో దీని వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందరూ కొవిడ్ రూల్స్ పాటిస్తే మంచిదని సూచిస్తున్నారు. 


Also Read : కొవిడ్​ పరిస్థితి మళ్లీ రానుందా? జపాన్​లో జెట్​ స్పీడ్​లో విస్తరిస్తున్న కొత్త వైరస్.. ఇండియాకు వస్తే?