Japan Flesh Eating Bacteria : ప్రపంచ వ్యాప్తంగా ప్రజల జీవితాలను స్తంభింపజేసి.. కోట్లమంది ప్రాణాలను బలిగొంది కరోనా. ఇప్పుడు అలాంటి పరిస్థితే వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అప్పుడు చైనా నుంచి ఈ వైరస్ వస్తే ఇప్పుడు జపాన్​ నుంచి ముప్పు వచ్చే ప్రమాదం ఉందని చెప్తున్నారు. జపాన్​లో తాజాగా అరుదైన, ప్రమాదకరమైన బ్యాక్టీరియా సంక్రమణ వ్యాప్తి ఉద్భవించింది. ఆ వైరస్ ఏంటి? దానిని ఎలా అరికట్టాలి అనే దాని కోసం శాస్త్రవేత్తలు తలలు పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో వైరస్​ను కట్టడి చేయడానికి కొవిడ్ సమయంలో పాటించిన రూల్స్​ని జపాన్​లో జారీ చేశారు. ఇంతకీ ఆ వైరస్ ఎలా వచ్చింది? నిజంగానే ఇది ప్రమాదకరమైనదా? దీని లక్షణాలు ఏంటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


ప్రాణాంతకమైన ఇన్​ఫెక్షన్ ఇది..


ప్రస్తుతం వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ ఇన్ఫెక్షన్​ను అర్థం చేసుకోవడానికి వైద్యులు, ఆరోగ్య నిపుణులు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. ఈ వైరస్​కు డెడ్లీ ఫ్లెష్ ఈటింగ్ బ్యాక్టీరియా అనే మిస్టరీ ఇన్ఫెక్షన్ జపాన్​లో వ్యాప్తి చెందుతుంది. ప్రతి సంవత్సరం సగటును 100 నుంచి 200 కేసులు నమోదు కాగా.. గత సంవత్సరం 941 కేసులు నమోదైనట్లు నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ పేర్కొంది. ఇది ప్రాణాంతకమైన ఇన్​ఫెక్షన్​ అని.. అది ఎందుకు పెరుగుతుందోననే దానిపై అక్కడి ప్రభుత్వం ఆందోళన చెందుతుంది. 


అప్పట్లో తక్కువగానే ఉన్నా..


స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ స్ట్రెప్​ ఎ బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇది స్ట్రెప్ థ్రోట్​తో సంబంధం కలిగి ఉంటుందని నివేదించారు. 1992నుంచి ప్రతి సంవత్సరం కొన్ని కేసులు నమోదయ్యేవని.. కానీ తాజాగా వీటి సంఖ్య పెరుగుతుందని గుర్తించారు. ఈ వైరస్ అన్ని వయసుల వారిపై ఎఫెక్ట్ చూపిస్తుందని తెలిపారు. స్ట్రెప్​ ఏ ఉన్న చాలా మందికి లక్షణాలు ఉండవట. లేదంటే గొంతు నొప్పి ఉండొచ్చని తెలిపారు. కానీ ఇది SSTSగా అభివృద్ధి చెంది.. మల్టీపుల్ ఆర్గాన్స్​ను నాశనం చేస్తుందని తెలిపారు. కొందరిలో ఇది మరణానికి కూడా కారణమవుతుందని తెలిపారు. 


వైరస్ వ్యాప్తి ఇలా ఉంటుంది..


గొంతులో లేదా చర్మంపై కనిపించే ఒక రకమైన తేలికపాటి ఇబ్బంది నుంచి.. ప్రాణాంతకమైన అనారోగ్యానికి ఈ వైరస్​ కారణమవుతుందని జపాన్ ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. ముద్దు పెట్టుకోవడం, చేతుల ద్వారా, దగ్గరి పరిచయం ఉన్న వ్యక్తి నుంచి మరో వ్యక్తికి ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. కాబట్టి మీ చేతులను ఎల్లప్పుడూ శుభ్రంగా కడుక్కోవాలి. దగ్గు లేదా జలుబు ఉన్నప్పుడు చేతులను రెగ్యూలర్​గా వాష్ చేయాలి. గొంతు నొప్పి, జ్వరం, చర్మ వ్యాధులను యాంటీబయాటిక్స్​తో కంట్రోల్ చేయవచ్చు కానీ.. ఈ బ్యాక్టీరియా ఊపిరితిత్తులు, రక్తం, కండరాల్లో ప్రవేశిస్తే.. చికిత్స కష్టం అవుతుంది. పైగా ఈ వైరస్ మీ రోగనిరోధకశక్తిని బాగా ప్రభావితం చేస్తుంది. 


వైరస్ ప్రభావం వారిపై ఎక్కువ


వ్యాధి ఉన్నవారితో సన్నిహిత సంబంధం ఉన్నా.. 65 ఏళ్లు పైబడిన వారికి ఈ వైరస్ త్వరగా వ్యాప్తి చెందే అవకాశముంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు, గుండె జబ్బులు, క్యాన్సర్, చికెన్ పాక్స్, హెచ్​ఐవీ సమస్యలున్నవారిపై ఈ వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి ఈ వైరస్​ పట్ల అందరూ అవగాహన కలిగి జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. 


Also Read : అబార్షన్ చేయించుకోవడమంటే మానవ హక్కులను ఉల్లంఘించడమే.. గర్భస్థ శిశువులను చంపే హక్కు ఎవరికీ లేదు