World's First Lung cancer Vaccine: క్యాన్సర్ ఈ పేరు వినగానే వెన్నులో వణుకు వస్తుంది. ఏదో తెలియని భయం. క్యాన్సర్ అని తెలియగానే మానసికంగా కుంగిపోతారు. కారణం.. దానికి ఎలాంటి ట్రీట్మెంట్ లేదు. పూర్తిగా నయం చేసే మందు లేదు. క్యాన్సర్ అనేది అనేక రకాలు. గర్భాశయ క్యాన్సర్, నోటి క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్. ఇక క్యాన్సర్ వచ్చి లాస్ట్ స్టేజ్ వరకు గుర్తించకపోతే.. రోగులు చనిపోతారు. అయితే, ఇప్పుడు దీనికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ బయటికి వచ్చింది. త్వరలోనే ఈ మహమ్మారిని అరికట్టేందుకు, సోకకుండా ఉండేందుకు వ్యాక్సిన్ తీసుకురానున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పరిశోధనల్లో లంగ్ క్యాన్సర్‌ను నివారించే వ్యాక్సిన్ తయారీకి ప్రయత్నాలు మొదలుపెట్టారు.
1.7 మిలియన్ యూరోలు..
లంగ్ వ్యాక్స్.. (LungVax) పేరుతో ఈ వ్యాక్సిన్ ని తీసుకొస్తున్నారు సైంటిస్టులు. దీనికిగాను.. 1.7 మిలియన్ యూరోలు (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.16 కోట్లు) గ్రాంట్ చేశారు. క్యాన్సర్ రిసెర్చ్ యూకే, సీఆర్ఐఎస్ క్యాన్సర్ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ ఫండ్స్ ఇవ్వనున్నారు. ఆక్స్‌ఫర్డ్ / ఆస్ట్రాజెనెకా కోవిడ్ - 19 వ్యాక్సిన్ టెక్నాలజీతో దీన్ని రూపొందించనున్నారు. దీంతో ఇప్పుడు లంగ్ క్యాన్సర్ ని నివారించవచ్చని చెప్తున్నారు వైద్యులు.
క్యాన్సర్ కణాలను కనిపెడుతుంది..
క్యాన్సర్ అనేది మన ఒంట్లోనే ఉంటుందని, సాధారణ కణాలేవో? క్యాన్సర్ కణాలేవో తెలుసుకునే శక్తి ఇమ్యూనిటీ సిస్టమ్‌కు లేదని లంగ్ వ్యాక్స్ ప్రాజెక్ట్ లీడ్ ప్రొఫెసర్ టిమ్ ఇలియాట్ మీడియాకు తెలిపారు. క్యాన్సర్ కణాలను ఇమ్యూనిటీ సిస్టమ్ తెలుసుకోవడం అనేది రిసెర్చ్ లో పెద్ద టాస్క్ అని, ఆ విషయంలో సక్సెస్ అవ్వగలిగితే.. ఏటా కొన్ని వేల మందిని కాపాడుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు ఆయన. వచ్చే రెండేళ్లలో దాదాపు మూడు వేల డోస్ లు తయారు చేయనున్నట్లు చెప్పారు. యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ ఫార్డ్, ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్ స్టిట్యూట్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ సంయుక్తంగా వీటిని తయారు చేస్తాయని చెప్పారు. ల్యాబ్ టెస్ట్ లు పూర్తైన తర్వాత ఇమ్యూనిటీ సిస్టమ్ మీద రెస్పాండ్ అయితే.. ఆ తర్వాత క్లీనికల్ ట్రైల్ స్టార్ట్ చేస్తామని చెప్పారు టిమ్ ఇలియాట్.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: 'ఆడు జీవితం' గురించి షాకింగ్ విషయాలు - 31 కేజీలు తగ్గిన హీరో!