'Om Bheem Bush' Movie First Day Collection: టాలెంటెడ్‌ హీరో శ్రీ విష్ణు సినిమాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తనదైన నటనతో ఇండస్ట్రలో స్పెషల్‌ ఇమేజ్‌ క్రియేట్‌ చేసుకున్నాడు. రోటిన్‌కు భిన్నంగా స్క్రిప్ట్స్‌ ఎంపిక చేసుకుంటూ ఫ్యాన్స్‌, ఆడియన్స్‌ని అలరిస్తు వస్తున్నాడు. గ్యాప్‌ ఎక్కువైన ఓ సరికొత్త కథతో ప్రేక్షకులను ముందుకు వచ్చి హిట్‌ కొడుతున్నాడు. గతేడాది 'బ్రోచేవారెవరురా' మూవీతో హిట్‌ కొట్టిన శ్రీవిష్ణు అదే జోష్‌తో ఈసారి ఓం భీమ్ బుష్' అంటూ సరికొత్త కాన్సెప్ట్‌తో వచ్చాడు. 'హుషారు', 'రౌడీ బాయ్స్' ఫేమ్ శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం తెరెక్కిన ఈ చిత్రాన్ని వి సెల్యులాయిడ్ సంస్థతో కలిసి సురేష్ బలుసు నిర్మించారు.


శ్రీవిష్ణుతో పాటు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ మరో ప్రధాన పాత్రలు పోషించారు. వీరి కాంబినేషన్‌ లో గతంలో వచ్చిన 'బ్రోచేవారెవరురా' మంచి కామెడీ ఎంటర్‌టైనర్‌గా హిట్‌ అందుకుంది. మరోసారి ఈ ముగ్గురు కాంబినేషన్‌లో వచ్చిన ఓం భీమ్‌ బుష్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలా ఎన్నో అంచనాల మధ్య నిన్న మార్చి 22న ఈ చిత్రం థియేటర్లో విడుదలై పాజిటివ్‌ రివ్యూస్‌తో అందుకుంది. విడుదలైన అన్ని ఏరియాల్లో ఈ చిత్రం డీసెంట్‌ టాక్‌ తెచ్చుకుంది. దాంతో ఫస్ట్‌డే వసూళ్లు కూడా అదే రేంజ్‌లో వచ్చినట్టు సమాచారం. మేకర్స్, టీం ఊహించిన దానికంటే ఎక్కువగానే ఓం భీమ్‌ బుష్‌ కలెక్షన్స్‌ వచ్చినట్టు ట్రేడ్‌ వర్గాల నుంచి సమాచారం. 


శ్రీవిష్ణు మూవీ ఎంత వసూళ్లు చేసిందంటే


Om Bheem Bush First Day Collection: నిన్న విడుదలైన ఓం భీమ్‌ బుష్‌ మూవీ ఊహించిన దానికిట్టే ఎక్కువే వసూళ్లు చేసిందట. విడుదలకు ముందే సెన్సార్ బోర్డు సభ్యులను మెప్పించిన ఈ చిత్రం విడుదలైన ఫస్ట్ షో నుంచే ఈ మూవీ హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. దానికి తగ్గట్టుగానే ఊహించిన రేంజ్‌లో కలెక్షన్స్‌ వచ్చాయట. మూవీకి వచ్చిన టాక్‌, రెస్పాన్స్‌ ప్రకారం ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.25 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ చేసినట్టు సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇక ప్రపంచవ్యాప్తం ఈ సినిమా రూ. 1.50 కోట్లు షేర్‌.. అలాగే రూ. 3 నుంచి రూ. 3.50 కోట్లు వరకూ గ్రాస్‌ వసూళ్లు  చేసి మేకర్స్‌ని సర్‌ప్రైజ్‌ చేసిందని సమాచారం. అయితే దీనిపై క్లారిటీ రావాలంటే మూవీ టీం నుంచి అధికారిక ప్రకటన రావాల్సింది. 


Also Read: అదిరిపోయే లీక్‌ - 'కల్కి'లో ప్రభాస్‌ 'భైరవ' పాత్రపై నిర్మాత స్వప్న దత్‌ ఆసక్తికర కామెంట్స్‌


కథ విషయానికి వస్తే


ఇక నిన్న విడుదలైన ఈ మూవీ ఫుల్‌ అవుట్‌ అండ్‌ అవుట్‌ కామెడీతో సాగిందట. సెన్సార్‌ సర్టిఫికేట్‌ కోసం వెళ్లిన ఈ చిత్ర చూసి బోర్డు సభ్యులు విపరీతంగా నవ్వేట్టు చేసిందని తెలిసింది. అలాంటి ఈ మూవీ థియేటర్లో ఆడియన్స్‌ చివరి వరకు నవ్విస్తూనే ఉందట. థియేటర్లో ఈ సినిమా చూసిన ఆడియన్స్‌ అంతా శ్రీహర్ష కొనుగంటి ఇచ్చిన క్యాప్షన్ సరిగ్గా సెట్‌ అయ్యిందంటున్నారు. నో లాజిక్స్, ఓన్లీ మేజిక్... 'ఓం భీమ్ బుష్' అని చెప్పినట్టుగానే ఈ ముగ్గరు స్క్రీన్‌పై మేజిక్‌ చేశారంటున్నారు. కథతో సంబంధం లేకుండా కామెడీతో నవ్వించారు. ఫస్టాఫ్‌లో కాలేజీ ఎపిసోడ్, మెయిన్ లీడ్స్ ముగ్గురి మధ్య సన్నివేశాలు, ఊరిలోకి ఎంటరైన తర్వాత ముగ్గురూ చేసే హంగామా నవ్విస్తాయి. ఇంటర్వెల్ తర్వాత ఘోస్ట్ ఎపిసోడ్ హిలేరియస్‌గా వర్కవుట్ అయ్యిందని రివ్యూస్‌ వచ్చాయి. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ అండ్‌ సంపంగి దెయ్యం మధ్య సన్నివేశాలు... సంపంగి దెయ్యం గురించి శ్రీవిష్ణు అసలు నిజం తెలుసుకునే సన్నివేశం ప్రతి ఒక్కరిని నవ్విస్తుంది.