Swapna Dutt Comments on Prabhas Bahirava Role పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నట్టిస్తున్న 'కల్కి 2898 ఏడీ' మూవీపై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్ అయినా క్షణాల్లో ట్రెండింగ్‌లోకి వస్తుంది. మొన్న రిలీజ్ అయిన ప్రభాస్ లుక్‌తో మూవీపై మరింత బజ్ క్రియేట్ అయ్యింది. ఇందులో ప్రభాస్‌ది భైరవ పాత్ర అని మూవీ టీం ప్రకటిస్తూ ప్రభాస్ కొత్త లుక్ రిలీజ్ చేశారు. దీంతో మూవీపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఫ్యాన్స అంతా మే 29 కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ భార్య, ఈ మూవీ నిర్మాత స్వప్న దత్ 'కల్కి 2898 ఏడీ'(kalki 2898 AD) మూవీపై లీక్ ఇచ్చి మరింత హైప్ క్రియేట్ చేశారు.
రీసెంట్‌గా నోవాటెల్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో శుక్రవారం జరిగిన ‘సౌత్ ఇండియా ఫిలిం ఫెస్టివల్’ ఈవెంట్‌కి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వప్న దత్ మాట్లాడుతూ కల్కి మూవీపై క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. "కల్కిలో ప్రభాస్ పోషిస్తున్న భైరవ పాత్ర చాలా కాలం పాటు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతుంది. ఈ సినిమా సినీ చరిత్రలోనే ట్రెండ్‌సెట్టర్‌గా నిలుస్తుంది" అంటూ అదిరిపోయే లీక్ ఇచ్చారు. ప్రస్తతం స్వప్న దత్ కామెంట్స్‌కి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఆమె కామెంట్స్‌తో మరోసారి 'కల్కి 2898 ఏడీ' ట్రెండింగ్‌లో నిలిచింది. కాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
సైన్స్ ఫిక్సన్ మూవీగా వస్తున్న ఈ మూవీని వైజయంతి మూవీస్ బ్యానర్లో సీనియర్ నిర్మాత అశ్విన్ దత్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మే 9న రిలీజ్‌కు రెడీ అవుతుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న కల్కి నుంచి తరచూ ఏదోక హింట్, లీక్ ఇస్తూ సినిమా అంచనాలు పెంచేస్తున్నారు మేకర్స్. ఇప్పుడు తాజాగా ఏకంగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ భార్య, నిర్మాత స్వప్న దత్ మూవీపై చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా నిలిచాయి. గతంలో నిర్మాత అశ్వినీ దత్ ఓ ఇటర్య్వూలో మాట్లాడుతూ.. ఈ మూవీ మహాభారతంతో కథ మొదలై క్రీస్తుశకం 2898తో ముగుస్తుందని, కల్కి కథ మొత్తం ఆరు వేల ఏళ్ల కాలం వ్యవధి చూట్టూ తిరుగుతుందన్నారు. గతం, భవిష్యత్తును ఏకకాలం ముడిపడుతూ సాగే కథ ఇది అన్నారు.
Also Read: ప్రపంచంలో ఇంతకంటే గొప్ప అనుభూతి లేదు - 'హనుమాన్' డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఎమోషనల్
ఏప్రిల్ 9న 'కల్కి 2898 ఏడీ' ట్రైలర్?
'కల్కి' సినిమా మహాభారతంలో స్టార్ట్ అయ్యి 2898వ సంవత్సరంలో ముగుస్తుందని, ఈ కథ 6000 సంవత్సరాల మధ్య జరుగుతుందని డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇటీవల ఓ ఈవెంట్ లో చెబుతూ సినిమాపై అంచనాలను పెంచేశాడు. ఈ సినిమా ట్రైలర్ ఏప్రిల్ 9న విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈ రూమర్లతోనే ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. ట్రైలర్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మే 9వ తేదీన సినిమా విడుదల కాగా, ఈ రూమర్స్ నిజమైతే నెల ముందు ట్రైలర్ విడుదల కానుంది.