Roster Dating Meaning : ఫాంటసీలు, అమ్మాయిలు డెడ్లీ కాంబినేషన్ అనే చెప్పొచ్చు. ఓ స్టడీ ప్రకారం అబ్బాయిల కంటే అమ్మాయిలే ఫాంటసీ వరల్డ్‌లో ఎక్కువగా ఉంటారని తేలింది. ముఖ్యంగా ఫిక్షనల్ స్టోరీలు చూసి.. లేదా ఫిక్షనల్ క్యారెక్టర్ చూసి.. వాటిపై మనసు పారేసుకుంటారు. వాటివల్ల వారి ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్స్ట్రీమ్గానే ఉంటాయి. వాటన్నింటినీ తీసుకెళ్లి తమ బాయ్ ఫ్రెండ్ మీద చూపించేస్తూ ఉంటారు. అతను ఆ అంచనాలను రీచ్ కాకపోతే అదో లొల్లి. అయితే ఇలాంటి ఇబ్బందులు లేకుండా.. వారి ఫాంటసీలు కూడా తీర్చుకునేలా అమ్మాయిలు ఓ కొత్త డేటింగ్ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు.
రోస్టర్ డేటింగ్..
Gen Zలోని సింగిల్ అమ్మాయిలు ఫాలో అవుతున్న ట్రెండ్లలో రోస్టర్ డేటింగ్ ఒకటి. ఈ రోస్టర్ డేటింగ్ అర్థమేమిటంటే.. తమ రొమాంటిక్ డిజైర్లను ఒక అమ్మాయి లేదా అబ్బాయి.. ఒకే సమయంలో ఎక్కువమందితో విడతలవారీగా తీర్చుకోవడమే రోస్టర్ డేటింగ్. ఈ డేటింగ్లో అమ్మాయి అయినా.. అబ్బాయి అయినా ఒకే సమయంలో విడతలవారీగా వేర్వేరు వ్యక్తులతో తమ రొమాంటిక్ డిజైర్స్ని తీర్చుకోవడమే రోస్టర్ డేటింగ్.
అమ్మాయిలే ఎక్కువట..
ఈ రోస్టర్ డేటింగ్ ట్రెండ్‌ని ఎక్కువ మంది ఒంటరి మహిళలు ఫాలో అవుతున్నారట. వారిలోని రొమాంటిక్ డిజైర్స్ని వేర్వేరు వ్యక్తులతో తీర్చుకుంటారనే టాక్ సోషల్ మీడియాలో ఎక్కువగా నడుస్తోంది. విభిన్న వ్యక్తులను వయసుతో సంబంధం లేకుండా మీట్ అవ్వడం.. వారితో రొమాంటిక్ రిలేషన్‌ని పెంపొందించుకోవడం చేస్తున్నారట. తమ పరిధిని చాలా కాన్ఫిడెన్స్‌గా, ఓపెన్‌గా చెప్తూ ఈ డేటింగ్ ఫాలో అవుతున్నారట.
తమ ఒపీనియన్స్‌ని, డిజైర్స్ని ఓపెన్‌గా చెప్తూ.. సీరియస్ రిలేషన్ లేదు అంటూనే ఈ డేటింగ్ ట్రెండ్‌ని ఫాలో అవుతున్నారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయమేమిటంటే.. దీనిని మగవారికంటే ఆడవారే ఎక్కువగా ఫాలో అవుతున్నారట. తమ ఛాయిస్ విషయాల్లో కాంప్రిమైజ్ కాకుండా.. తమకు నచ్చిన వాటిని.. నచ్చిన వారినుంచి ఓపెన్‌గా తీసుకుంటున్నారు. సీరియస్ రిలేషన్లో లేకుండా తమ డిజైర్ తీర్చుకుంటూ.. వ్యక్తిగత అభివృద్ధివైపు అడుగులు వేస్తున్నారు.
ఈ డేటింగ్ ట్రెండ్ ఫన్‌తో పాటు.. పర్సనల్ గ్రోత్‌కి మంచిదని నేటితరం భావిస్తున్నారు. ఈ రోస్టర్ డేటింగ్‌ని మహిళలు ఫాలో అవ్వడానికి ఇది కూడా ఓ రీజనే. దీనివల్ల ఒకే వ్యక్తితో త్వరగా అటాచ్ అవ్వకుండా.. లేదా ఎమోషనల్‌గా దగ్గరకాకుండా ఉండేందుకు హెల్ప్ చేస్తుంది. ఎక్కువ కనెక్షన్స్ వల్ల తమ ఇండిపెండెన్స్‌కి ఎలాంటి ఇబ్బంది కలిగించదని భావిస్తున్నారు. అందుకే ఈ ట్రెండ్ వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు.
ఈ రోస్టర్ డేటింగ్ పర్సనల్ లైఫ్‌పై ప్రేమ ఇంపాక్ట్ లేకుండా చేయడంలో హెల్ప్ చేస్తుంది. అలాగే కొత్త అనుభవాలను పొందడంలో, ఎక్స్ప్లోర్ చేయడంలో, ఫన్ ఇవ్వడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. అంటే వయసుతో సంబంధం లేకుండా పెద్ద, చిన్న, సేమ్ ఏజ్ అయినా.. వారితో ఒకే సమయంలో డేటింగ్ చేసి.. రొమాంటిక్‌గా ఎక్స్ప్లోర్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. సొంత ఆనందాలకు ప్రాధన్యతనిచ్చుకునేవారికి ఇది పర్ఫెక్ట్ డేటింగ్ ట్రెండ్ అనే చెప్పొచ్చు.
Also Read : పర్సనల్ లైఫ్‌ని వర్క్ లైఫ్‌ని బ్యాలెన్స్ చేయలేకపోతున్నారా? ఇలా ట్రై చేయండి..