Rice, Millets, and Sperm Count : ఒకప్పుడు అన్నం పరబ్రహ్మ స్వరూపం అనేవారు. ఇప్పుడు అమ్మో అన్నం తింటున్నారా మీకు ఎన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలుసా అంటున్నారు. అన్నం తింటే బరువు పెరుగుతారని, షుగర్ ఎక్కువ అవుతుందని చెప్పేవారు. ఇప్పుడు అన్నం తింటే స్పెర్మ్ కౌంట్ కూడా తగ్గిపోతుందని చెప్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో దీని గురించిన ఓ చర్చ నడుస్తుంది. దీనిలో నిజమెంతా? నిజంగానే రైస్ తింటే స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందా? మిల్లెట్స్​నే తినాలా? నిపుణులు ఇచ్చే సలహాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 

మధుమేహం వస్తుందా?

రైస్​లో గ్లైసమిక్ ఇండెక్స్ 70 నుంచి 90 ఉంటుంది. ఇది ఎక్కువే. కానీ మిల్లెట్స్​లో కూడా ఇది ఎక్కువగానే ఉంటుంది. కాకుంటే కాస్త తక్కువగా ఉంటుంది అంతే. తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.. అందరూ కేవలం రైస్​ని మాత్రమే తీసుకోరు. పప్పు, ఇతర కర్రీలతో కలిపి తీసుకుంటాము. రైస్​ని ప్రోటీన్​ సోర్స్​లతో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి చాలామంచిది. అలా తీసుకున్నప్పుడు గ్లైసమిక్ ఇండెక్స్ తగ్గుతుందని చెప్తున్నారు నిపుణులు. 

మిల్లెట్స్​కి రైస్​కి ఉండే తేడా ఇదే.. 

100గ్రాముల వైట్​ రైస్​లో 350 కేలరీలు ఉంటే.. 7 గ్రాముల ప్రోటీన్, 78 గ్రాముల కార్బ్స్ ఉంటాయి. ఫైబర్ 0.6 గ్రాములు ఉంటుంది. బ్రౌన్​ రైస్​లో 360 కేలరీలు ఉంటాయి. వీటిలో ప్రోటీన్ 7.5 గ్రాములు, కార్బ్స్ 76 గ్రాములు, ఫైబర్ 3.5 గ్రాములు ఉంటాయి. మోడరేట్ గ్లైసమిక్ ఇండెక్స్ 50 నుంచి 60 ఉంటుంది. కొర్రల్లో 355 గ్రాముల కేలరీలు, 12 గ్రాముల ప్రోటీన్, 70 గ్రాముల కార్బ్స్, 8 గ్రాముల ఫైబర్.. 50 నుంచి 55 గ్లైసమిక్ ఇండెక్స్ ఉంటుంది. సజ్జల్లో 360 కేలరీలు, 11 గ్రాముల ప్రోటీన్, 67 గ్రాముల కార్బ్స్, 8.5 గ్రాముల ఫైబర్ ఉంటుంది. గ్లైసమిక్ ఇండెక్స్ 50 నుంచి 55 ఉంటుంది. 

రాగుల్లో 336 కేలరీలు 7 గ్రాముల ప్రోటీన్, 72 గ్రాముల కార్బ్స్, 11 గ్రాముల ఫైబర్, గ్లైసమిక్ ఇండెక్స్ 40 నుంచి 45 ఉంటుంది. కేలరీల పరంగా మిల్లెట్స్​కి రైస్​కి పెద్ద తేడా ఉండదు. అయితే మిల్లెట్స్ వల్ల కలిగే లాభాలు ఏమైనా ఉన్నాయంటే.. వాటిలో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. గ్లెసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుందంతే. ప్రోటీన్, ఫైబర్, మినరల్స్​ని రైస్​తో కలిపి బ్యాలెన్స్డ్​గా తింటూ కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని చెప్తున్నారు. అలాగే మిల్లెట్స్ కంటే రైస్ త్వరగా జీర్ణమవుతుంది. వర్క్ అవుట్ చేసిన తర్వాత రైస్​ని తీసుకుంటే మంచిది. 

స్పెర్మ్ కౌంట్​పై ప్రభావం

రైస్ స్పెర్మ్ కౌంట్​ని తగ్గిస్తుందనేదానికి ఎలాంటి ఆధారాలు లేవు. పలు పరిశోధనలు కూడా రైస్ తీసుకోవడం వల్ల స్పెర్మ్ కౌంట్, స్పెర్మ్ క్వాలిటీ పెరుగుతుందనే తెలిపాయి. స్పెర్మ్​ కౌంట్​ తగ్గడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. జెనిటిక్స్, వయసు, స్మోకింగ్, డ్రింకింగ్ వంటి అలవాట్లు నెగిటివ్ ప్రభావం చూపిస్తాయి. సరైన వ్యాయామం చేయకపోవడం, మెడికల్ కండీషన్స్ వల్ల ఇబ్బందులు ఉంటాయి. 

Also Read : DNA డైట్​ గురించి తెలుసా? డయాబెటిస్​ ప్రమాదాన్ని తగ్గిస్తుందంటోన్న కొత్త అధ్యయనం

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.