DNA diet May Lower Type 2 Diabetes Risk : టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడంలో DNA డైట్ మంచిఫలితాలు ఇస్తుందని తాజా అధ్యయనం తెలిపింది. అయితే ఈ డీఎన్ఏ డైట్ గురించిన పూర్తి వివరాలు ఏంటి? ఇది టైప్ 2 డయాబెటిస్‌ని ఎలా సమర్థవంతంగా ఎదుర్కొంటుంది.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
DNA డైట్
DNA డైట్ అంటే ఓ వ్యక్తి DNA ప్రొఫైల్‌కు అనుగుణంగా డైట్‌ని రూపొందించడం. ఇలా డిజైన్ చేసిన డైట్ రక్తంలో చక్కెర స్థాయిలు నిర్వహించడంలో, టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నవారిలో.. ఆ ప్రమాదాన్ని తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుందని కొత్త పరిశోధనలు చెప్తున్నాయి.
పరిశోధన వివరాలు
యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ఇంపీరియల్ కాలేజ్ లండన్, DnaNudge నడ్జ్ కలిసి ఈ అధ్యయనం చేసింది. దానికి సంబంధించిన ఫలితాలు సైంటిఫిక్ రిపోర్ట్స్ ట్రస్టెడ్ సోర్స్‌లో ప్రచురించింది. ఈ పరిశోధనలో భాగంగా రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్న 148 మంది వ్యక్తులను ఎంచుకున్నారు. కొంతకాలంగా వారు తింటున్న ఫుడ్స్ గురించి తెలుసుకున్నారు. అనంతరం వారి DNAకి అనుకూలమైన ఆహారాన్ని అందించారు.
పరిశోధన ఫలితాలు
పరిశోధకులు 6,12, 26 వారాల వ్యవధిలో.. పరిశోధనలో పాల్గొన్నవారి గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ స్థాయిలను అంచనా వేశారు. మొదటి ఆరు వారాల్లో పెద్ద తేడా లేకపోయినా.. 26 వారాల సమయంలో రక్తంలో చక్కెర స్థాయిలలో గణనీయమైన మెరుగుదల కనిపించినట్లు తెలిపారు. రక్తంలో సగటు చక్కెర స్థాయిలను సూచించే గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్లను కొలిచి.. ప్రాథమిక అంచనాలు చేశారు.
ఈ డైట్ ద్వారా రక్తంలోని గ్లూకోజ్ నియంత్రణలో గణనీయమైన మార్పులు చూసినట్లు ప్రచురించారు. ఈ పరిశోధనలో పాల్గొన్న వారి రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయడానికి, టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలను తగ్గించడానికి DNA డైట్ ఉపయోగపడిందని తేల్చారు. ఈ పరిశోధన జన్యు డేటా ఆధారంగా ఆరోగ్య సమస్యలను కంట్రోల్ చేయవచ్చని నిరూపించింది.
డయాబెటిస్ - ప్రీ డయాబెటిస్
డయాబెటిస్ అనేది శరీరం రక్తంలో గ్లూకోజ్‌ను నిర్వహణను ప్రభావితం చేసే దీర్ఘకాలిక వ్యాధి. టైప్ 2 డయాబెటిస్తో శరీరం ఇన్సులిన్‌ను సమర్థవంతంగా ఉపయోగించనివ్వకుండా చేస్తుంది. ప్రీ డయాబెటిస్ సమయంలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు సాధారణ పరిధికి మించి పెరుగుతాయి. ఈ సమయంలో డీఎన్ఏ డైట్ ఫాలో అవ్వడం వల్ల టైప్ 2 డయాబెటిస్‌ను రివర్స్ చేసుకోవచ్చు. లేదా రాకుండా పూర్తిగా కంట్రోల్ చేసుకోవచ్చు. జీవశైలిలో మార్పులు ప్రీ డయాబెటిస్ నుంచి, టైప్ 2 డయాబెస్ పురోగతిని పొందవచ్చు.
పండ్లు, కూరగాయలు, హెల్తీ ఫ్యాట్స్, తృణధాన్యాలను వారి డైట్లో చేర్చారు. అంతేకాకుండా లైఫ్స్టైల్లో మార్పులు వల్ల కూడా ఈ డయాబెటిస్‌ని దూరం చేసుకోవచ్చని తెలిపారు. ఈ డీఎన్ఏ ఆధారంగా తీసుకునే డైట్ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు పొందినా.. దీనిపై మరిన్ని పరిశోధనలు జరిగితే మంచి ఫలితాలు ఉంటాయని చెప్తున్నారు.
Also Read : మధుమేహం ఈ మధ్యే వచ్చిందా? అయితే ఈ డైట్ ప్లాన్‌ని ఫాలో అవుతూ.. లైఫ్ స్టైల్లో ఈ మార్పులు చేసేయండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.