పకోడీలు, బజ్జీలు చేసుకున్నాక ఆ నూనె మిగులుతుంది. ఆ నూనెను మళ్లీ ఉపయోగించి కూరలు వండుతారు. ఇక బయటైతే ఈరోజు పకోడీలు వేసి బాగా కాగిన నూనెనే,రేపు మళ్లీ పకోడీలు వేసేందుకే ఉపయోగిస్తారు.ఇలా చేయడం చాలా ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన సమస్యలు వస్తాయి. ఒకసారి అధిక ఉష్ణోగ్రత వద్ద కాగిన నూనె చాలా మార్పులకు లోనవుతుంది. దానిని మళ్లీ వండి తినడం వల్ల శరీరంలో క్యాన్సర్ కణాలు ఉత్పత్తి అవుతాయి. గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. 


ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా జారీ చేసిన భద్రతా మార్గదర్శకాల ప్రకారం, నూనెను ఒకసారి వేడి చేశాక మళ్లీ వేడి చేయడం మానేయాలి. ఇలా నూనెను మళ్లీ మళ్లీ అధిక ఉష్ణోగ్రతలకు గురి చేయడం వల్ల ట్రాన్స్ ఫ్యాట్స్ ఏర్పడతాయి. ఇవి గుండెకు చాలా ప్రమాదకరమైనవి. ఈ నూనె వాయురహితంగా మారడంతో పాటూ క్లోస్ట్రియం బోటులినమ్ ఉత్పత్తి అవుతుంది. దీని వల్ల ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుంది. వాడిన వంట నూనెతో మళ్లీ వంటలు వండడం వల్ల వచ్చే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఇవే. 


ఇన్‌ఫ్లమేషన్: వాడిన వంటనూనెను తిరిగి తినడం వల్ల ఫ్రీ రాడికల్స్ పెరుగుతాయి. ఇది ఇన్ ఫ్లమ్మేషన్ కు కారణం అవుతుంది. ఇలా జరగడం వల్ల గుండె జబ్బులు, మధుమేహం వంటి వ్యాధులు వచ్చే అవకాశం పెరుగుతుంది. ఈ ఇన్ ఫ్లమ్మేషన్ రోగనిరోధక శక్తిని కూడా తగ్గిస్తుంది. శరీరంలో పలు ఇన్ఫెక్షన్లకు కారణం అవుతుంది. 


క్యాన్సర్ కారకం: ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, క్యాన్సర్ కారకాలలో వండిన నూనెను మళ్లీ మళ్లీ వండడం కూడా ఒకటి. నూనెను మళ్లీ వేడి చేయడం వల్ల క్యాన్సర్ కణాలు ఏర్పరచే విషపూరితమైన అడ్లైహైడ్లు ఉత్పత్తి అవుతాయి. ఈ నూనెతో వండిన వంటలు తినడం వల్ల శరీరంలో క్యాన్సర్ కణాలు పుట్టవచ్చు.  


బాక్టీరియా: ఒకసారి నూనెను వేడి చేశాక, దాన్ని నిల్వ చేయడం వల్ల ఆ నూనెలోని సూక్ష్మమైన ఆహార కణాలపై బ్యాక్టిరియా పెరుగుతుంది. ఇది ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్లకు కారణం అవుతాయి. మళ్లీ ఈ నూనెను ఉపయోగించినప్పుడు ఫ్రీరాడికల్స్ శరీరంలో చేరుతాయి. ఇవి కణాలను దెబ్బతీస్తాయి. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. 


కలుషితం: అధిక ఉష్ణోగ్రతల వల్ల వేడెక్కిన నూనెతో వండడం వల్ల ఒక్కోసారి ఆహారం కలుషితం అవుతుంది. ఆ విషయం మనకు తెలియదు. అలాగే తినేస్తాం. ఏదైనా అనారోగ్యం వచ్చినా కూడా అది నూనె వల్ల అని గ్రహించే అవగాహన కూడా ప్రజల్లో లేదు.


అసిడిటీ, అజీర్తి: నూనెను మళ్లీ ఉపయోగించడం వల్ల ఆమ్లత్వం, గుండెల్లో మంట, జీర్ణక్రియ సమస్యలు వంటి ప్రమాదాలు పెరుగుతాయి. 


కొలెస్ట్రాల్: నూనెను తిరిగి ఉపయోగించినప్పుడు ట్యాన్స్ ఫ్యాటీ ఆమ్లాలు పెరుగుతాయి. అవి ట్రాన్స్ ఫ్యాట్ లుగా మారి అనారోగ్యానికి గురిచేస్తాయి. ఈ ట్రాన్స్ ఫ్యాట్లు గుండె సంబంధిత సమస్యలకు కారణం అవుతాయి. 


Also read: 43 ఏళ్లలో ఏకంగా 53 పెళ్లిళ్లు చేసుకున్నాడు, ఎందుకంటే సిల్లీ కారణాలు చెబుతున్నాడు


Also read: ఈ మొక్కల ఆకులను రోజుకు రెండు నమిలితే చాలు, డయాబెటిస్ పెరగదు




























గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.