హెచ్ఎండీ గ్లోబల్ మనదేశంలో వినూత్నమైన ఫీచర్ ఫోన్‌ను లాంచ్ చేసింది. నోకియా 5710 ఎక్స్‌ప్రెస్ ఆడియో పేరుతో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ఈ ఫోన్‌లో ట్రూవైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ను నోకియా ఇన్‌బిల్ట్‌గా అందించనుంది. ఫీచర్ ఫోన్‌ను నోకియా అద్భుతంగా డిజైన్ చేసింది. కేవలం డిజైన్‌తోనే ఈ ఫోన్ వినియోగదారులను ఆకర్షించనుంది. ఈ ఫోన్ కొనుగోలు చేస్తే ఉచితంగా ఇయర్‌బడ్స్ కూడా లభించనున్నాయన్న మాట.
నోకియా 5710 ఎక్స్‌ప్రెస్ ఆడియో ధర
ఈ ఫోన్ ధరను మనదేశంలో రూ.4,999గా నిర్ణయించారు. సెప్టెంబర్ 19వ తేదీ నుంచి దీని సేల్ ప్రారంభం కానుంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో కూడా ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. వైట్/రెడ్, బ్లాక్/రెడ్ కలర్ కాంబినేషన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
నోకియా 5710 ఎక్స్‌ప్రెస్ ఆడియో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
నోకియా 5710 ఎక్స్‌ప్రెస్ ఆడియో స్మార్ట్ ఫోన్‌లో 2.4 అంగుళాల క్యూవీజీఏ డిస్‌ప్లేను అందించారు. యూనిసోక్ టీ107 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 128 ఎంబీ స్టోరేజ్ స్పేస్ ఇందులో ఉంది. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 32 జీబీ వరకు పెంచుకోవచ్చు.
దీని బ్యాటరీ సామర్థ్యం 1450 ఎంఏహెచ్‌గా ఉంది. వీజీఏ కెమెరా కూడా ఈ ఫోన్‌లో ఉంది. డ్యూయల్ సిమ్‌లను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఫోన్ వెనకవైపు టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్‌ను హైడ్ చేసుకోవచ్చు. ఈ డిజైన్ ఈ మొబైల్‌కు పెద్ద ప్లస్ పాయింట్.
నోకియా టీ10 ట్యాబ్లెట్‌ను కంపెనీ ఇటీవలే యూరోప్‌లో లాంచ్ చేసింది. ఈ ట్యాబ్లెట్‌లో వైఫై, వైఫై + 4జీ ఎల్టీఈ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. 159 డాలర్ల (సుమారు రూ.12,150) నుంచి దీని ధర ప్రారంభం కానుంది. కేవలం ఓషన్ బ్లూ కలర్ ఆప్షన్‌లో మాత్రమే ఇది లాంచ్ అయింది.
ఇందులో 8 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లేను నోకియా అందించింది. దీని స్క్రీన్ రిజల్యూషన్ 800 x 1280 పిక్సెల్స్‌గానూ, యాస్పెక్ట్ రేషియో 16:10గానూ ఉంది. యూనిసోక్ టీ616 ప్రాసెసర్‌పై ఈ ట్యాబ్లెట్ పనిచేయనుంది. 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ నోకియా టీ10లో ఉన్నాయి. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకోవచ్చు.
ట్యాబ్లెట్ వెనకవైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. దీంతోపాటు ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంది. ముందువైపు ఉన్న 2 మెగాపిక్సెల్ సెల్పీ కెమెరాల ద్వారా వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు. ఫేస్ అన్‌లాక్ టెక్నాలజీని కూడా ఇది సపోర్ట్ చేయనుంది.
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ట్యాబ్లెట్ పనిచేయనుంది. రెండు సంవత్సరాల పాటు ఆపరేటింగ్ సిస్టం అప్‌గ్రేడ్స్, మూడు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ అందించనున్నారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5250 ఎంఏహెచ్ కాగా, 10W చార్జర్‌ను బాక్స్‌తో అందించనున్నారు.
బ్లూటూత్ 5.0, 3.5 ఎంఎం ఆడియోజాక్, వైఫై, యూఎస్‌బీ టైప్-సీ పోర్టువంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీని మందం 0.9 సెంటీమీటర్లు కాగా, బరువు 375 గ్రాములుగా ఉంది. ఓజో ప్లేబ్యాక్ ఉన్న స్టీరియో స్పీకర్లు కూడా ఇందులో ఉన్నాయి.