రోస్టెడ్ చికెన్... ఈ వంటకంలో కోడిని ముక్కలు కోయకుండా పూర్తిగా అలాగే వండేయాలి. కొత్త ఏడాది ప్రారంభమైన మొదటిరోజు సందర్భంగా ఓసారి మీరు ప్రయత్నించండి. రుచి అదిరిపోతుంది. పాశ్చాత్య దేశస్థులు అధికంగా ఈ రోస్టెడ్ చికెన్ తింటుంటారు. దాని కొంచెం మసాలాలు దట్టించి వండుకుంటే మనకి కూడా నచ్చుతుంది. దీన్ని మైక్రోవేవ్ ఓవెన్లో వండుకోవచ్చు, లేదంటే పెద్ద కళాయిలో కూడా వేయించుకోవచ్చు. ఒక్కసారి వండుకుంటే, మళ్లీ మళ్లీ మీరే వండుకుని తినేలా ఉంటుంది.
కావాల్సిన పదార్థాలు
చికెన్ - కిలో కోడి
నిమ్మరసం - ఒక టీస్పూన్లు
మిరియాల పొడి - అర స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
గరం మసాలా - టీస్పూను
పసుపు - పావు స్పూను
ఉల్లిపాయ - ఒకటి
అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు స్పూన్లు
కారం - రెండు స్పూన్లు
ఆలివ్ నూనె - రెండు స్పూన్లు
కొత్తిమీర - ఒక కట్ట
పుదీనా - ఒక కట్ట
తయారీ ఇలా
1. ముందగా కిలో బరువున్న కోడిని పూర్తిగా క్లీన్ చేయించి తీసుకోవాలి. పొట్టలో పరిశుభ్రంగా ఉండేలా క్లీన్ చేయించుకోవాలి.
2. కోడిని తడి లేకుండా తుడుచుకుని పక్కన పెట్టుకోవాలి.
3. ఒక గిన్నెలో నిమ్మరసం, మిరియాల పొడి, ఉప్పు, గరం మసాలా, పసుపు, కారం వేసి బాగా కలుపుకోవాలి.
4. కోడి శరీరంపై ఫోర్క్ తో గుచ్చాలి. లేదా కత్తితో గాట్లు పెట్టాలి.
5. ఇప్పుడు మసాలా మిశ్రమాన్ని కోడి శరీరానికి బాగా పట్టేలా బయట, లోపల పట్టించి మారినేట్ చేసుకోవాలి. ఒక అరగంట పాటూ పక్కన పెట్టేయాలి.
6. స్టవ్ మీద కళాయి పెట్టి ఆలివ్ ఆయిల్ వేసి ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు బాగా వేయించాలి.
7. అందులో కాస్త కారం, పసుపు, గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలపాలి.
8. కొత్తిమీర,పుదీనాలను సన్నగా తరుక్కోవాలి.
9. ఇప్పుడు కోడి పొట్టలో ఉల్లిపాయల మిశ్రమాన్ని, కొత్తిమీర, పుదీనా తరుగును స్టఫ్ చేయాలి.
10. ఓవెన్‌ను 200 డిగ్రీల సెల్సియస్‌కి ప్రీహీట్ చేసి ఉంచాలి.
11. అందులో బేకింగ్ ట్రేకు నూనె రాసి కోడిని పెట్టాలి.
12. 45 నిమిషాలు ఓవెన్లో ఉంచితే చికెన్ రోస్ట్ బాగా అవుతుంది.
13. ఓవెన్ లేకపోతే పెద్ద కళాయిలో అర లీటరు నూనె వేసి అందులో వేయించ వచ్చు.
14. అన్ని వైపులా బాగా రోస్ట్ అయ్యేలా తిప్పుతూ ఉండాలి.
15. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని సాస్‌లో డిప్ చేసుకుని తినాలి.
Also read: చలికాలంలో ఇంట్లో కచ్చితంగా ఉండాల్సి నీలగిరి తైలం, ఆ మందుల్లో వాడేది ఇదే