మహిళల్లో వయసు పెరుగుతున్న కొద్దీ కాల్షియం లోపం తలెత్తుతుంది. దీని వల్ల ఎముకలు బలహీనంగా మారుతాయి. కేవలం మహిళలకే కాదు కొంతమంది మగవారిలో కూడా ఈ సమస్య అధికంగానే ఉంటుంది. అలాంటి వారికి మటన్ బోన్ సూప్ ఎంతో మేలు చేస్తుంది. ఎముకలను పట్టిష్టంగా మారుస్తుంది. వారానికోసారి ఇలా మటన్ సూప్ తయారుచేసుకుని తాగితే చాలా మంచిది. దీన్ని తయారుచేయడానికి కాస్త సమయం పడుతుంది. కానీ ఆరోగ్యానికి ఇది అవసరం కాబట్టి, కచ్చితంగా ఈ సూప్ తాగాలి. నాన్ వెజ్ ప్రియులకు దీని రుచి కూడా నచ్చుతుంది.

కావాల్సిన పదార్థాలు మటన్ బోన్స్ - అరకిలో వెల్లుల్లి - పది రెబ్బలు అల్లం - ఒక చిన్న ముక్కపచ్చిమిర్చి - మూడు ధనియాలు - ఒక స్పూన్ దాల్చిన చెక్క-  చిన్న ముక్కలవంగాలు - మూడు మిరియాలు - ఒక స్పూన్ నీళ్లు - సరిపడినన్ని ఉప్పు - తగినంత పసుపు - పావు టీ స్పూన్ బిర్యానీ ఆకు - ఒకటి కొత్తిమీర - ఒక కట్ట నెయ్యి - ఒక స్పూన్ అల్లం తరుగు - ఒక టీ స్పూన్ వెల్లుల్లి తరుగు - రెండు స్పూన్లు శనగపిండి - రెండు స్పూన్లు కారం - అర స్పూను ఉల్లిపాయ - ఒకటి నూనె - మూడు స్పూన్లు నెయ్యి- ఒక స్పూను

Also read: పరీక్షల సమయంలో పిల్లల్లో ఏకాగ్రత పెరగాలంటే తినిపించాల్సినవి ఇవే

తయారీ ఇలా1. మటన్ ఎముకలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు, అల్లము ,పచ్చిమిర్చి వంటివి మిక్సీలో కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి.2.  మటన్ బోన్స్‌ను కుక్కర్లో వేసి, నీళ్లు పోసి మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి. మటన్ బోన్స్ ఉడికిన తర్వాత పైన తెల్లని తేటలాగా వస్తుంది. ఆ  తేటను తీసేయాలి. తర్వాత మళ్లీ కాసేపు ఉడికించాలి. 3. ఉడుకుతున్న మటన్ బోన్స్‌లో ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్ట్ ను వేయాలి. తర్వాత ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్.క మిరియాలు వంటివి పొడిలా చేసుకుని, వాటిని కూడా కలపాలి. 4. ఉల్లిపాయను నిలువుగా ముక్కలు చేసుకొని వాటిని కూడా ఆ మటన్ ముక్కల్లో కలపాలి. పసుపు, బిర్యానీ ఆకు వేసి గరిటతో బాగా కలిపి, మూడు గ్లాసుల నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్,టి మళ్ళీ ఆరు విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి. 5. ఆ తర్వాత మూత తీసి మళ్లీ నీళ్ళు పోసి ఒక అరగంట పాటు ఉడికించాలి. మరొక కళాయిలో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. 6. ఆ మిశ్రమం వేడెక్కాక అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు, నిలువుగా కోసిన పచ్చిమిర్చి వేయించాలి. ఆ తరువాత సెనగపిండి, కారం వేసి పచ్చివాసన పోయే వరకు చిన్న మంటపై వేయించి కలుపుతూ ఉండాలి. 7. ఆ కళాయిలో ముందుగా ఉడికించి పెట్టుకున్న సూపులో ఎముకలను పక్కనపెట్టి కేవలం సూప్ మాత్రమే వేసి కలుపుకోవాలి. తర్వాత బోన్స్ ను కూడా వేసేయాలి. 8. అలా ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించాక, పైన కొత్తిమీర చల్లుకోవాలి. 9. అంతే మటన్ బోన్ సూప్ రెడీ అయినట్టే. నిమ్మరసం పైన పిండుకొని ఈ సూపును తాగితే ఎంతో ఆరోగ్యం. 

Also read: సామలతో టేస్టీ అండ్ హెల్తీ పులావ్ - డయాబెటిక్ రోగులకు ప్రత్యేకం