Krishna Janmashtami Prasadam Recipes : కృష్ణాష్టమి స్పెషల్ రవ్వ పాయసం.. కన్నయ్యకు ఇష్టమై అటుకుల పాయసం.. ఈజీ, టేస్టీ రెసిపీలు ఇవే

Tasty Prasadam for kanniah : కృష్ణాష్టమి రోజు.. కృష్ణుడికి ప్రసాదంగా రెండు రకాల పాయసం చేసి నైవేద్యంగా పెట్టొచ్చు. పైగా తక్కువ సమయంలో ఈ రెసిపీలు తయారు చేయొచ్చు. 

Continues below advertisement

Ravva Payasam and Atukula Payasam Recipes : కృష్ణ జన్మాష్టమి (Sri Krishna Janmashtami 2024) సందర్భంగా ఉదయాన్నే పూజ చేసేప్పుడు పాయసాలను ప్రసాదంగా చేసి పెట్టొచ్చు. ఈ సమయంలో టేస్టీగా, సింపుల్​గా చేసుకోగలిగే రవ్వ పాయసం, అటుకుల పాయసం చేసుకోవచ్చు. వీటిని చేసేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. కావాల్సిన పదార్థాలు ఏమిటి? టేస్టీగా ఎలా తయారు చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 

Continues below advertisement

రవ్వ పాయసం కోసం కావాల్సిన పదార్థాలు

రవ్వ - ముప్పావు కప్పు

నెయ్యి - 1 టేబుల్ స్పూన్

పాలు - రెండు కప్పులు

పంచదార - ముప్పావు కప్పు

యాలకుల పొడి - చిటికెడు

కుంకుమ పువ్వు - చిటికెడు

పాలు - పావు కప్పు

జీడిపప్పు - పది

బాదం పప్పు - పది 

తయారీ విధానం 

ముందుగా స్టౌవ్ వెలిగించి గిన్నె ఉంచాలి. దానిలో నెయ్యి వేయాలి. అనంతరం రవ్వ వేసుకుని వేయించుకోవాలి. రవ్వ పొడిగా మారి.. మంచి అరోమా వచ్చేవరకు వేయించుకోవాలి. ఇప్పుడు దానిలో అరకప్పు పాలు వేసుకోవాలి. పాలల్లో రవ్వను ఉడకనివ్వాలి. అది కాస్త ఉడికి చిక్కగా మారిన తర్వాత దానిలో మిగిలిన ఒకటిన్నర కప్పు పాలు వేసి ఉడికించాలి. ఉడికే సమయంలో పావు కప్పు పాలు తీసుకుని యాలకుల పొడి, కుంకుమ పొడి వేసి నానబెట్టాలి. 

పాలు, రవ్వ మిశ్రమం ఉడికి.. పాలు కాస్త తగ్గిన తర్వాత దానిలో పంచదార వేయాలి. అది కరిగిన తర్వాత దానిలో కుంకుమ పువ్వు మిశ్రమం వేసి కలపాలి. రవ్వ ఉడికి చిక్కగా మారుతుంది. ఇది చిక్కగా మారే సమయంలో మిక్సీ జార్​లో నానబెట్టిన జీడిపప్పు, బాదం వేసి మిక్సీ చేయాలి. వీటిలో కాస్త పాలు వేసి పేస్ట్​గా చేసుకుని.. ఉడుకుతున్న రవ్వ మిశ్రమంలో వేయాలి. ఈ రెండు మిక్స్​ అయ్యి మంచి క్రీమ్​గా మారుతుంది. అంతే టేస్టీ టేస్టీ రవ్వ పాయసం రెడీ. దీనిని కృష్ణుడికి నైవేద్యంగా పెట్టొచ్చు. 

అటుకుల పాయసం కోసం కావాల్సిన పదార్థాలు

అటుకులు - 1 కప్పు

పాలు - 3 కప్పులు

నీళ్లు - అరకప్పు

బెల్లం - ముప్పావు కప్పు

జీడిపప్పు - పది

కిస్​మిస్ - పది

తయారీ విధానం

ముందుగా స్టౌవ్ వెలిగించి పాలు మరిగించాలి. ఇదే సమయంలో అటుకలను కడిగి నీళ్లు లేకుండా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై మందపాటి కడాయి పెట్టండి. దానిలో నెయ్యి వేయాలి. అది కరిగిన దానిలో జీడిపప్పు, కిస్​మిస్​లు వేసి వేయించుకోవాలి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఉడికించిన అటుకులు వేసి వేయించుకోవాలి. 

అటుకులు కాస్త వేగిన తర్వాత దానిలో పాలు వేయాలి. అనంతరం నీళ్లు కూడా వేసి కలపాలి. పాలల్లో అటుకలను ఉడకనివ్వాలి. ఇప్పుడు మరో స్టౌవ్ వెలిగించి.. దానిలో గిన్నె పెట్టుకోవాలి. దానిలో బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు దానిలో నీళ్లు వేయాలి. అది కరిగిన తర్వాత అటుకుల మిశ్రమంలో వేసి ఉడికించుకోవాలి. అటుకులు ఉడికి మెత్తగా అయిన తర్వాత.. దానిలో యాలకుల పొడి వేయాలి. చివరిగా వేయించుకున్న జీడిపప్పు, కిస్​మిస్​లు వేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ అటుకుల పాయసం రెడీ. రవ్వ పాయసం, అటుకుల పాయసాన్ని కన్నయ్యకు నైవేద్యంగా పెట్టేయండి. లేదంటే వీటిని సెలబ్రేషన్స్ సమయంలో కూడా చేసుకుని హాయిగా తినొచ్చు. 

Also Read : కృష్ణాష్టమి స్పెషల్ డ్రై ఫ్రూట్స్ కొబ్బరి లడ్డూ.. పంచదార లేకుండా హెల్తీగా చేసేయండిలా

Continues below advertisement