లి చంపేస్తుంది. ఉదయం 9 గంటలకి కూడా మంచు దట్టంగా పట్టి చాలిగాలులు వణికిస్తున్నాయి. ఈ సమయంలో గొంతు నొప్పి, దగ్గు, జ్వరం, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్లు సర్వసాధారణంగా ఎటాక్ అవుతాయి. వాటి నుంచి బయట పడేందుకు పోషకాలు నిండిన ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రోగాల బారిన పడకుండా ఉండేందుకు రోగనిరోధక శక్తిని పెంచుకోవడం చాలా ముఖ్యం. అందుకే దానిమ్మ రసం తీసుకోవడం చాలా మంచిదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఇది తీసుకోవడం వల్ల శరీరం లోపల వేడిగా కూడా ఉంటుంది.


విటమిన్-C అద్భుతమైన మూలం దానిమ్మ పండు. విటమిన్ B, K, ఐరన్, ఫైబర్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉనాయి. శక్తివంతమైన గుణాలు కలిగిన దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. రక్తపోటుని తగ్గించడంలోనూ సహాయపడుతుంది. దానిమ్మ, కలబంద, బీట్ రూట్ కలిపి జ్యూస్ గా తీసుకోవడం వల్ల చలికాలంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.


దానిమ్మ జ్యూస్ తయారీ విధానం


రెండు లేదా మూడు దానిమ్మ కాయలు తీసుకుని గింజలు వేరుచేసుకోవాలి. దానిలో తరిగిన బీట్ రూట్ ముక్కలు వేసి మిక్సీలో బాగా గ్రైండ్ చేయాలి. తర్వాత అలోవెరా జెల్ జోడించుకోవాలి. అలోవెరా జెల్ జ్యూస్ లో వేసే ముందు దాన్ని శుభ్రం చేసుకోవాలి. తాగే ముందు కొద్దిగా నల్ల మిరియాల పొడి వేసుకుని తీసుకుంటే చాలా మంచిది.


దానిమ్మ రసం వల్ల ప్రయోజనాలు


దానిమ్మ రసం తరచూ తీసుకోవడం వల్ల పురుషుల్లో వీర్య కణాల ఉత్పత్తి పెరుగుతుంది. దీని వల్ల ఎర్ర రక్తకణాలు వృద్ధి చెందుతాయి. మహిళలకి రుతుక్రమం సరిగా ఉండేలా చేస్తుంది. ఈ జ్యూస్ తాగడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. అధిక రక్తపోటు ఉన్న వారు రోజూ దానిమ్మ రసం తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇది ధమనుల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా చేస్తుంది. అయితే ఇందులో చక్కెర జోడించుకోవడం మంచిది కాదు. గ్రీన్ టీ కంటే దానిమ్మ జ్యూస్ లోనే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.


తొక్క వల్ల లాభాలు


దానిమ్మ గింజలు తీసుకుని తొక్క మాత్రం చెత్తబుట్టలో వేసేస్తారు. కానీ నిజానికి గింజల్లో కంటే దానిమ్మ తొక్కలోనే అధిక ప్రయోజనాలు ఉన్నాయి. కీళ్లనొప్పులతో బాధపడే వాళ్ళు ఆ తొక్కల్ని నీటిలో వేసుకుని బాగా మరిగించి ఆ నీటిని తాగితే నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ నీళ్ళు తాగడం వల్ల మధుమేహులకి మేలు చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. చలికాలంలో కీళ్ల నొప్పులు ఎక్కువగా ఉంటాయి. అటువంటి వారికి ఇది గొప్ప ఔషధంగా పని చేస్తుంది. తొక్కలు పొడి చేసి పెట్టుకుని వివిధ రకాలుగా ఉపయోగించుకోవచ్చు. పసుపు దంతాలని తెల్లగా మార్చేందుకు సహకరిస్తుంది. ఈ పొడిని ఉప్పు, పుదీనా కలిపి పళ్ళు తోముకుంటే దంతాలు తెల్లగా మారిపోతాయి.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also read: చక్కెరతో జర భద్రం - ఈ భయానక వ్యాధి ప్రాణాలు తీయొచ్చు, ఈ లక్షణాలుంటే జాగ్రత్త!