Winter Special Amla Soup : వింటర్​లో హెల్త్ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. జలుబు, ఫ్లూ, ఫీవర్ వంటి సమస్యలతో దీర్ఘకాలిక సమస్యలను దూరం చేసే సూప్ రెసిపీ ఇక్కడ ఉంది. దీనిని తయారు చేయడం బాగా తేలిక. పైగా వింటర్​లో ఎక్కువగా దొరికే ఉసిరితోనే దీనిని తయారు చేసుకోవచ్చు. మరి ఈ టేస్టీ, హెల్తీ సూప్ రెసిపీ ఏంటి? కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఏంటో.. ఈ సూప్ రెగ్యూలర్​గా తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

కావాల్సిన పదార్థాలు

ఉసిరికాయ ముక్కలు - 1 కప్పు

నీళ్లు - 2 కప్పులు

నెయ్యి - 1 టేబుల్ స్పూన్

ఉల్లిపాయ - 1 చిన్నది

వెల్లుల్లి రెబ్బలు - 2

జీలకర్ర - 1 టీస్పూన్

ధనియాల పొడి - 1 టీస్పూన్

ఉప్పు - రుచికి తగినంత

తయారీ విధానం

ముందుగా స్టౌవ్ వెలిగించి.. గిన్నె పెట్టాలి. దానిలో నీళ్లు వేసి కాగనివ్వాలి. ఇప్పుడు ఉసిరి ముక్కలను కడిగి.. కాగుతున్న నీటిలో వేయాలి. వాటిని పూర్తిగా ఉడకనివ్వాలి. ఉసిరి ముక్క మెత్తగా అయ్యేవరకు ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి కడాయి పెట్టాలి. దానిలో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అందుబాటులో లేకుంటే నూనె కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దానిలో సన్నగా తరిగిన ఉల్లిముక్కలు, దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకోవాలి. 

అనంతరం జీలకర్ర, ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. వాటి నుంచి మంచి వాసన వచ్చిన తర్వాత.. ముందుగా ఉడికించి పెట్టుకున్న ఉసిరి ముక్కలు వేసుకోవాలి. వాటిని ఓ సారి కలిపి.. ఉసిరి ముక్కలుగా వేయగా మిగిలిన నీటిని దీనిలో వేసేయాలి. బాగా కలిపి స్టౌవ్ ఆపేయాలి. ఇప్పుడు దానిని సూప్​లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న సూప్​ని మీరు వేడి లేదా చల్లగా కూడా తీసుకోవచ్చు. 

ఉసిరి సూప్ తాగితే కలిగే ప్రయోజనాలివే (Benefits of Amla Soup)

చలికాలంలో ఉసిరి సూప్ తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది. దీనిలోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సాహిస్తుంది. ఉసిరిలోని యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు పెరుగుదలను ప్రమోట్ చేసి.. చుండ్రును తగ్గిస్తాయి. ఫ్రీరాడిలక్స్​ని కాపాడుతాయి. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు ముడతలను దూరం చేస్తాయి. చలికాలంలో వచ్చే జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి. దీనిలోని ఫైబర్ మలబద్ధకాన్ని కూడా దూరం చేస్తుంది. 

ఉసిరిలోని యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు ఆర్థ్రైటిస్, కీళ్లనొప్పులను దూరం చేస్తుంది. అలాగే స్కిన్ హెల్తీగా ఉండడంలో హెల్ప్ చేస్తుంది. పింపుల్స్ సమస్యను దూరం చేసి.. స్కిన్​ను బ్రైట్​గా చేస్తుంది. కంటి ఆరోగ్యానికి కూడా ఉసిరి చాలా మంచిది. ఇది దృష్టిని మెరుగుపరుస్తుంది. ముంఖ్యంగా ఉసిరిలోని ఫైబర్, పొటాషియం కొలెస్ట్రాల్​ని తగ్గించి.. గుండె ఆరోగ్యానికి సహాయం చేస్తుంది. బీపీని కూడా కంట్రోల్​లో ఉంచుతుంది. 

ఇలా కూడా చేసుకోవచ్చు.. 

మీరు సూప్​లో మీరు అల్లం, పసుపు, మిరియాల పొడిని కూడా వేసుకోవచ్చు. ఇవి పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. కానీ వేసుకుంటే రుచి మరింత పెరుగుతుంది. హెల్త్ బెనిఫిట్స్ కూడా పెరుగుతాయి. లేదంటే తేనె, నిమ్మరసం కూడా ఫ్లేవర్ కోసం వేసుకోవచ్చు. చలికాలంలో రెగ్యూలర్​గా తీసుకుంటే నోటికి రుచిగానూ.. హెల్తీగా ఉండడంలోనూ హెల్ప్ చేస్తుంది. 

ఆమ్లా సూప్​ని తీసుకునే ముందు కచ్చితంగా మీరు వైద్యుల సలహా తీసుకోవాలి. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు, కిడ్నీల్లో రాళ్లు ఉన్నవారు, అలెర్జీలు ఉన్నవారు వైద్యుల సూచనలతో దీనిని డైట్​లో చేర్చుకుంటే మంచిది. 

Also Read : ఇడ్లీ పిండితో టేస్టీ పునుగులు.. ఇలా చేస్తే కరకరలాడుతూ భలే రుచిగా ఉంటాయి