రాత్రి పూట పాలు తాగితే మంచిదని, బాగా నిద్రపడుతుందని ఇంట్లోని పెద్దలు చెబుతుంటారు. ఇప్పుడు ఎన్నో అధ్యయనాలు కూడా అది నిజమనే చెబుతున్నాయి. పరిశోధకులు కూడా ఒప్పుకుంటున్నారు. దీన్ని శాస్త్రీయంగా కూడా నిర్ధారించారు. కాబట్టి నిద్రసరిగా పట్టని వారు, నిద్రలేమి సమస్యతో బాధపడేవారు పడుకోబోయే ముందు గ్లాసుడు గోరువెచ్చని పాలు తాగమని సిఫారసు చేస్తున్నారు ఆరోగ్యనిపుణులు.
పాలల్లో కెసైన్ ట్రిప్టిక్ హైడ్రోలైజేట్ అని పిలిచే పెప్ట్టైడ్లు ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గించి నిద్రను పెంచుతాయి. అమెరికన్ కెమికల్ సొసైటీ వారి జర్నల్ లో కూడా ఫుడ్ కెమిస్ట్రీలో పనిచేస్తున్న పరిశోధకులు కూడా ఈ పెప్టైడ్ ల ఉనికిని గుర్తించారు. నిద్రపట్టని వారికి అమెరికాలో బెంజోడియాజిపైన్స్, జోల్ఫిడెమ్ వంటి మందులను సూచిస్తున్నారు. కానీ వీటిని తరచూ వాడడం వల్ల చాలా సమస్యలు వస్తాయి. ఆల్కహాల్ లాగే ఆ మందులకు కూడా ప్రజలను తమకు బానిసలుగా మార్చకుంటాయి. అందుకే వాటిని ఎక్కువ కాలం వాడడం మంచిది కాదు. ఇలాంటివారికి రాత్రిపూట గోరువెచ్చని పాలు తాగమని సిఫారసు చేస్తున్నారు వైద్యులు.
శాస్త్రవేత్తలు పాలలో ఎన్నో సహజ పెప్టైడ్ లు, చిన్న ప్రోటీన్ ముక్కలను కనుగొన్నారు. కెసైన్ అనే ప్రోటీన్లు ట్రిప్సిన్ అనే జీర్ణ ఎంజైమ్ తో కలిసి నిద్రను పెంచే పెప్టైడ్ ల మిశ్రమాన్ని ఉత్పత్తి చేస్తుంది. దీని వల్లే గోరువెచ్చని పాలు తాగాక నిద్ర బాగా వస్తుంది. అంతెందుకు చాలా మంది పిల్లలకు రాత్రి పూట పాలు తాగే అలవాటు ఉంటుంది. వాళ్లు ఎంత గాఢంగా నిద్రపోతారో పరిశీలించండి.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Also read: అయ్యో... భారతీయుల ఎత్తు తగ్గిపోతోందట
Also read: పిల్లలు తక్కువేం కాదు, వైరస్‌ను వాళ్లూ వ్యాప్తి చేయగలరు
Also read: మీ నడకే మీకు చెప్పేస్తుంది... ఈ మహమ్మారి గురించి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి