Tips to Avoid Phone Addiction in the Morning : నిద్రలేవడానికి అలారం పెట్టుకునే అలవాటు చాలా ఉంది. అది పెట్టుకోవడానికి కూడా ఇలా లేచి మన పనులు చేసుకుని.. ఆఫీస్​కి లేదా కాలేజ్​కి వెళ్లాలని ఉద్దేశంతోనే అలారం పెట్టుకుంటారు. నిజంగా ఆ అలారం పెట్టుకుని దానికి తగ్గట్లు లేచి పని చేసుకుంటే.. మీరు వెళ్లాలనుకునే ప్లేస్​కి కరెక్ట్​ టైమ్​కి వెళ్తారు. కానీ.. అలారం అలా మోగగానే.. ఇలా ఫోన్ పట్టుకుంటారు. దాంతో ముందు వేసిన ప్లాన్స్ అన్ని కట్. 

ఫోన్​లో సగం టైమ్ గడిపిన తర్వాత.. ఆదరాబాదరాగా పనులు చేసుకుని.. టైమ్​ కంటే ఆలస్యంగానో.. లేదా టైమ్​కో కంగారుగా చేరుకుంటారు. ఈ సమస్య చాలామందిలో ఉంది. ఉదయం లేవగానే.. ఫోన్​ పట్టుకుని కూర్చోకపోతే అసలు డే స్టార్ట్ అయినట్టే ఉండదు కొందరికి. ఇలా ఉదయం నిద్ర లేవగానే ఫోన్​లో ఉండిపోతే శారీరకంగా, మానసికంగా ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుందని మీకు తెలుసా? 

నష్టాలివే.. 

నిద్ర లేచిన వెంటనే మీరు ఫోన్ చూస్తే.. మీ ఎనర్జీ లెవెల్స్, ఫోకస్, ప్రొడెక్టివిటీ తగ్గిపోతుందని తాజా అధ్యయనం తేల్చి చెప్పింది. ఎందుకంటే పొద్దున్నే లేవగానే మన మెదడులో కార్టిసాల్ లెవెల్స్ అధిక మోతాదులో విడుదల అవుతాయి. అలాగే బ్రెయిన్ యాక్టివ్​ అవ్వడానికి కూడా టైమ్ పడుతుంది. కానీ మీరు పొద్దున్నే లేచి లేవగానే ఫోన్ చూస్తే.. బ్రెయిన్ యాక్టివ్ అవ్వడానికి టైమ్ దొరకదు. కార్టిసాల్ స్ట్రెస్​ని కూడా పెంచేస్తుంది. ఇది ఒబెసిటీ, అధికబరువుకు దారితీస్తుంది.

బ్రెయిన్ యాక్టివ్​ అవ్వకపోవడం వల్ల డే అంతా మీరు కొన్ని విషయాల్లో నష్టపోవాల్సి వస్తుంది. ఎందుకంటే దేనిపైనా సరిగ్గా ఫోకస్ చేయలేరు. ప్రొడెక్టివిటీ తగ్గిపోతుంది. మీరు చేయాలనుకున్న టాస్కులు కంప్లీట్ చేయలేరు. కళ్లు లాగుతుంటాయి. తలనొప్పి వస్తుంది. నీరసం, అలసట వస్తాయి. స్ట్రెస్ పెరగడం వల్ల నిద్ర సమస్యలు పెరగడంతో పాటు రోగనిరోధకశక్తి తగ్గుతుంది. గుండె సమస్యలు పెరుగుతాయి. డిప్రెషన్, యాంగ్జైటీ పెరుగుతుంది. పైగా ఫోన్​లో ఏ నెగిటివ్ వార్తను చూసినా.. ఆ రోజు అది మీ మూడ్​ని ఏదొకరకంగా డిస్టర్బ్ చేస్తూనే ఉంటుందని గుర్తించుకోవాలి.

నిద్రలేచిన వెంటనే చేయాల్సిన పనులు.. 

ఈ సమస్యలను దూరం చేసుకోవాలనుకుంటే ఉదయం నిద్ర లేచిన వెంటనే ఒక్క అరగంట ఫోన్​కి దూరంగా ఉండండి. తర్వాత పనులు ప్రారంభించి.. మీ గమ్యస్థానానికి చేరుకునేవరకు ఇబ్బంది ఉండదు. మైండ్ కూడా యాక్టివ్ అవుతుంది. మీకు ఉదయాన్నే సమయం ఎక్కువగా ఉందనుకున్నప్పుడు లేదా ఆఫ్, లీవ్ ఉన్న రోజుల్లో కూడా ఉదయాన్నే ఫోన్​ చూడకుండా.. ఇలా ట్రై చేయవచ్చు. 

నిద్రలేచిన వెంటనే మెడిటేషన్​ లేదా బాడీ స్ట్రెచ్ చేయండి. ఇది మిమ్మల్ని యాక్టివ్​గా చేసి.. శారీరకంగా, మానసికంగా హెల్తీగా ఉండడంలో హెల్ప్ చేస్తుంది. మీ శరీరాన్ని హైడ్రేట్ చేసేందుకు ఓ గ్లాస్ వాటర్ తాగండి. దీనివల్ల యాక్టివ్​ అవుతారు. మెటబాలీజం కూడా పెరుగుతుంది. నీళ్లు తాగుతూ ఫోన్ చూడాల్సిన అవసరం లేదు. సూర్యరశ్మిలో కాస్త సమయం స్పెండ్ చేయండి. ఇది మీ మూడ్​ని, సర్కియాడియన్ రిథమ్​ని మెరుగుపరుస్తుంది. మీ రోజులో ఏ పనులు చేయాలనుకుంటున్నారో వాటిని టాస్క్​లుగా రాసుకోవచ్చు లేదా ప్లాన్ చేసుకోవచ్చు. 

ఫోన్​ని చూడకుండా ఇలా ప్లాన్ చేసుకోండి.. 

పడుకునే ముందు ఫోన్​ని మీ బెడ్​కి దూరంగా పెట్టుకోండి. అలారం కోసం ఫోన్ ఉపయోగిస్తుంటే అలారం క్లాక్ కొనుక్కోండి. మీ ఉదయాన్నే ఓ బుక్​తో లేదా ఓ జర్నల్​తో ప్రారంభం చేసుకోండి. ఫోన్​ ఈ టైమ్​లో ఉపయోగించకూడదనే రూల్ పెట్టుకోవచ్చు. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. దీనివల్ల మీరు ఉదయాన్నే ఫోన్​తో మీ డేని డిస్టర్బ్ చేసుకోకుండా ఉంటారు. 

Also Read : ఐటీ ఉద్యోగుల్లో పెరుగుతున్న ఫ్యాటీ లివర్.. హైదరాబాద్​లో 84% మందికి ఉందట, కారణాలివే