శ్రావణ పౌర్ణమిగా పిలుచుకునే రక్షా బంధన్ సోదరసోదరీమణుల ప్రేమకు,అనురాగానికి తీపి గురుతు. ఆరోజున ప్రియమైన అన్నతమ్ముళ్లకు  అక్కాచెల్లెళ్లు ప్రేమగా రాఖీ కడతారు. హారతి ఇచ్చి స్వీటు తినిపిస్తారు. అంతకన్నా ముందు ఇప్పుడు వాట్సాప్‌లో మెసేజ్‌లు పంపండం ఆనవాయితీగా మారింది. వాట్సాప్ స్టేటస్‌ పెట్టుకోవడం కూడా ఫ్యాషన్‌గా మారింది. అందమైన మన తెలుగు భాషలోనే శుభాకాంక్షలు పంపితే పండుగ మరింత సుందరంగా మారుతుంది. 


రాఖీ కట్టాల్సిన సమయం...
శ్రావణ పౌర్ణమి రోజునే రక్షా బంధనం పండుగ నిర్వహించుకుంటారు. ఆగస్టు 11న పౌర్ణమి ఉదయం 10.39 నిమిషాలకు వస్తోంది. మరుసటిరోజు ఉదయం అంటే ఆగస్టు 12వ తేదీ ఉదయం ఏడుగంటల వరకు ఉంటుంది. అయితే హిందూమత ఆచారం ప్రకారం పండుగలు సాయంత్రం, రాత్రి నిర్వహించుకోరు. అందుకే శుక్రవారం ఉదయం నిర్వహించుకోమని చెబుతున్నారు జ్యోతిష్య నిపుణులు. 


1. అన్నయ్యను మించిన ధైర్యం
అక్కాచెల్లెళ్లను మించిన స్నేహితులు ఎవరూ ఉండరు. 
హ్యాపీ రక్షా బంధన్


2. అలకలు, పోట్లాటలు
బుజ్జిగింపులు, ఊరడింపులు
ఇలా ఎన్నాళ్లమయినా అన్నాచెలెళ్ల బంధం చెరిగిపోదు.
రాఖీ పండుగ శుభాకాంక్షలు


3. అన్నా చెలెళ్ల అనురాగబంధం
అక్కా తమ్ముళ్ల ఆప్యాయ బంధం
అదే రక్షా బంధనం
రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు


4. నీకెంత వయసొచ్చినా
నా కంటికి చంటిపాపవే
కొండంత ప్రేమను పంచే బంగారు చెల్లివే
రాఖీ పండుగ శుభాకాంక్షలు


5. అమ్మలా అనురాగం పంచావు
నాన్నలా లాలించావు
అన్నయ్య నువ్వే నా ధైర్యం, రక్ష
రాఖీ పండుగ శుభాకాంక్షలు


6. అమ్మ తరువాతే అక్కే
నాన్న తరువాతే అన్నే
అపురూపమైన అన్న చెల్లెళ్ల అనుబంధం
ఆప్యాయతకు రూపం
రక్ష బంధన్ శుభాకాంక్షలు


7. ఒకే కడుపున పుట్టకపోయినా
నాకెంతో ప్రేమను పంచిన 
అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు 
రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు


8. నా జీవితంలోని ప్రతి మలుపులో 
అండగా నిలబడిన అన్నయ్యకు 
చిరునవ్వుతో ఆదరించే తమ్ముడికి
రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు


9. సరదా గొడవలు
అప్పుడప్పుడు అలకలు
చివరలో బుజ్జగింపులు
మరచిపోలేను చిన్ననాటి రోజులు
రాఖీ పండుగ శుభాకాంక్షలు


10. My brother may not always be at my side 
but he is always in my heart
Happy raksha bandhan


11. Having a sister is like having a best friend you can't get rid of. 
You know whatever you do, 
they'll still be there.
Happy raksha bandhan


12. My little sister
I don't know how
Life will take a turn
But I promise you
The place you hold in my heart
No one ever will replace.
!!Happy Raksha Bandhan sis!!


13. our happiness is my world my baby sister!! 
Happy Raksha Bandhan!


14. I feel proud to have a sister like you. 
Be the same strong-minded girl always!! 
Happy Raksha Bandhan!


Also read: కరోనాలాగే లాంగ్యా వైరస్ కూడా ప్రపంచాన్ని వణికిస్తుందా? లక్షణాలు ఎలా ఉంటాయంటే


Also read: ‘పిచ్చెక్కించే తేనే’ దీన్ని తాగితే మామూలుగా ఉండదు, మద్యాన్ని మించిన కిక్కు, అతిగా తాగితే మరణమే