ఫిబ్రవరి నెల వస్తుందంటే చాలు.. ప్రేమికులకు, ప్రేమించుకునేవాళ్లకు, ప్రేమను చెప్పాలనుకునేవారికీ పెద్ద పండుగే అనే చెప్పుకోవాలి. ఈ ఫిబ్రవరిలో వాలెంటైన్స్ వీక్ చాలా స్పెషల్. ఈ రోజు (ఫిబ్రవరి 8) ప్రపోజల్ డే. అంటే మనసులో ఉన్న ప్రేమను ఇష్టమైన వారికీ  వ్యక్తపరిచే రోజు ఇది. నిజానికి, "ఐ లవ్ యూ" ఎప్పుడైనా చెప్పవచ్చు. అయితే ఈ రోజు చెబితే, వారు మన ప్రేమను అంగీకరిస్తారా? లేక నిరాకరిస్తారా అనేది తెలిసిపోతుంది.


చాలా మంది ఈ ఫిబ్రవరి నెల కోసం వెయిట్ చేస్తుంటారు. అలాగే తమ ప్రేమను వ్యక్తం చేసేవారి సంఖ్య కొంచెం ఎక్కువే ఉంటుంది. కొత్తగా తమ ప్రేమను వ్యక్తం చేయాలనుకునే వాళ్లకి భయంగా ఉంటుంది. కొందరైతే చెప్పాక, వారి ప్రేమను ఒప్పుకోరేమోనని.. చెప్పకుండానే ఆగిపోతారు. అలాంటి వారికి ఇంతకు మించిన మంచి సమయం దొరకదు. మీరు ఎవరికైనా ప్రపోజ్ చేయాలని చూస్తున్నట్లయితే, ఈ రోజున మీ ప్రేమను బయటపెట్టడానికి ప్రయత్నించండి. మీకు ఇష్టమైన వారికి ఎలా ప్రపోజ్ చేయాలో ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో చూసేయండి. 


అందమైన ప్రదేశాన్ని ఎంచుకోండి 


రోజంతా ఓకే ప్రదేశంలో ఉంటే బోరింగ్ గా ఉంటుంది. ప్రపోజ్ చేసేటప్పుడు మీ పరిసరాలపైన కూడా  శ్రద్ధ పెట్టడం కూడా చాలా అవసరం. మీరు ఎంచుకునే ప్లేస్ ఆకర్షించే విధంగా ఉండాలి. అంటే  ఏదైనా రొమాంటిక్‌ ప్లేస్ కానీ ప్రశాంతంగా ఉండే  ప్లేస్‌కు కానీ  మీ లవర్ ను  తీసుకోని వెళ్లండి. లేదంటే, మీరు ప్రపోజ్ చేయాలనుకునే వారికీ ఏ ప్లేస్ లు ఇష్టమో తెలుసుకుని అక్కడికి తీసుకెళ్లండి.  మీరు చాలా సినిమాల్లో చూసే ఉంటారు. సినిమాలో  హీరోలు, హీరోయిన్లకు ఇష్టమైన ప్లేస్ కి తీసుకెళ్లి లవ్ ప్రపోజ్ చేస్తారు. ప్రపోజ్‌ చేసే సమయంలో చుట్టూ రొమాంటిక్‌ గా ఉంటే ఇంకా  బెటర్‌ ఫీలింగ్ వస్తుంది. మీరు ప్రపోజ్ చేసాక  మీ లవర్ మీ ప్రేమను  అంగీకరిస్తే, అది జీవితాంతం గుర్తిండిపోయే ఒక  అందమైన జ్ఞాపకం అవుతుంది.


పువ్వుతో పడేయండి


చాలా మంది ప్రేమికులు, వారి లవర్స్ కి  పువ్వులు ఇచ్చి లవ్ లో ఈజీగా పడేస్తారు. మీరు కూడా మూడు రకాల పువ్వులను ఇచ్చి మీ లవర్ కి  ప్రపోజ్ చేయండి. గులాబీ పూలలోనే అనేక రకాలు పువ్వులు ఉన్నాయి. వాటిలో  ఒక మూడు ఎంచుకోండి. ముందుగా రెడ్ రోజ్ ఇచ్చి మీ ప్రేమను వ్యక్తపరచండి. ఆ తర్వాత వైట్ రోజ్ ఇచ్చి కూల్ చేయండి. ఇక ముచ్చటగా ఎల్లో  రోజ్ ఇచ్చి మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారో ఫ్రెండ్లీగా మనసులో ఉన్నది మొత్తం చెప్పేయండి. 


డిన్నర్


నైట్ టైం డిన్నర్ కి ప్లాన్ చేయండి. మీ ప్రియమైన వారిని  మంచి రెస్టారెంట్‌లో డిన్నర్‌కి తీసుకెళ్లి, అక్కడ  ప్రపోజ్ చేయడానికి ప్లాన్ చేయండి.  ఆహారాన్ని ఆస్వాదిస్తూ.. వారితో సరదాగా కొంత సమయం గడపండి. వాటిలో క్యాండిల్‌లైట్ డిన్నర్ అయితే చాలా రొమాంటిక్ గా ఉంటుంది. 


Also Read : HPV వ్యాక్సిన్ కేవలం అమ్మాయిలకే కాదు.. అబ్బాయిల్లో ఆ క్యాన్సర్ రాకుండా దీనిని తీసుకోవాలట