Guppedantha Manasu February 8th Episode:  (గుప్పెడంతమనసు ఫిబ్రవరి 8 ఎపిసోడ్)


రిషిని చంపింది శైలేంద్రనే అని అనుపమ అంటే.. కాదు భద్ర అయి ఉండొచ్చంటాడు ముకుల్. భ‌ద్ర‌ను వ‌సుధార పోలీసుల‌కు ప‌ట్టించిన రోజు...నిన్ను, రిషిని వ‌ద‌ల‌ను అంటూ వార్నింగ్‌ ఇచ్చిన విషయం అనుప‌మ‌కు చెబుతాడు. భ‌ద్ర‌ను ప‌ట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాం, తను దొరికేత అప్పుడు రిషి మర్డర్ పై ఫుల్ క్లారిటీ వస్తుందంటాడు. వసుధారని జాగ్రత్తగా చూసుకోమని అనుపమకు చెబుతాడు ముకుల్..


దేవయాని-శైలేంద్ర
రిషి చచ్చిపోయాడు...ఇక నా కల నెరవేరే రోజొచ్చింది అంటుంది దేవయాని. ఇప్పుడు ఆ ఎండీ సీట్ మ‌న‌దేన‌ని శైలేంద్ర కూడా హ్యాపీగా ఫీల‌వుతాడు. నువ్వు క‌ల గ‌న్న‌ట్లే నీ కొడుకు ఎండీ అవుతాడ‌ు.
దేవయాని: ఎండీ ప‌ద‌వి కోసం ఎన్ని ఎత్తులు వేశాం, ఎటాక్స్ చేశాం..మన ఆశ తీర కానీ మ‌న ఆశ తీర‌లేద‌ు. నా ప్రాణం పోయినా ఎండీ సీట్ నీ కొడుక‌ుకు ద‌క్క‌నివ్వ‌ను. ఆ సీట్ ఎప్ప‌టికి నా కొడుకుదేన‌ని జ‌గ‌తి పంతం ప‌ట్టింది. చివ‌ర‌కు ఆ ఎండీ సీట్ కోస‌మే ప్రాణాల‌ు తీసుకుంది.
శైలేంద్ర: వ‌సుధార కూడా నా ప్రాణం పోయినా కూడా ఎండీ సీట్ నీకు ద‌క్క‌నివ్వ‌ను. ఈ సీట్ ఎప్ప‌టికీ రిషిదేన‌ని త‌న‌తో ఛాలెంజ్ చేసింద‌ని, చివ‌ర‌కు రిషినే లేకుండా పోయాడ‌ు. బాబాయ్ కూడా పంతానికి పోయి నాపై చేయిచేసుకున్నాడ‌ని, న‌న్ను రెచ్చ‌గొట్టినందుకు అంద‌రూ ఫ‌లితం అనుభ‌విస్తున్నార‌ు
దేవయాని: రిషి మీద దిగులుతో మీ నాన్న మంచాన ప‌డ్డార‌ు తన గురించే నా కంగారంతా 
శైలేంద్ర: ఈ టైమ్ లో డాడ్ కి రెస్ట్ అవసరం..ఆయన మనమధ్య ఉంటే మనం చేసే పనులకు అడ్డు రావొచ్చు..డాడ్ కోలుకుని వచ్చేలోగా నేను ఎండీ సీట్ లో కూర్చోవాలి
దేవయాని: వ‌సుధార అడ్డును ఎలా తొల‌గిస్తావ‌ు
శైలేంద్ర: ఇప్పుడు నాకు మంచిరోజులు వ‌చ్చాయి. ఇది శైలేంద్ర టైమ్‌. వ‌సుధార‌ను ఏం చేయాలో, ఎలా దెబ్బ‌కొట్టాలో నాకు బాగా తెలుసు. రిషి బ‌తికే ఉన్నాడ‌ని పిచ్చిదానిలా ప్ర‌వ‌ర్తిస్తోంది. అంత‌కుమించి న‌న్ను ఏం చేయ‌లేద‌ు 
దేవయాని: నువ్వు ఎండీ సీట్‌లో కూర్చునే రోజు కోసం ఎక్కువ రోజులు ఎదురుచూడ‌లేను. ఏం చేసినా తొంద‌ర‌గా వ‌సుధార అడ్డు తొల‌గించ‌ు 


Also Read: దేవయాని, శైలేంద్రకి ఇచ్చిపడేసిన వసు - కొత్తవ్యక్తి వసుకి ఎందుకు హెల్ప్ చేసినట్టు!


రిషి సంతాపసభ
వ‌సుధార డ‌ల్‌గా కాలేజీలో అడుగుపెడుతుంది. రిషి చ‌నిపోయాడ‌నే వార్త‌ను జీర్ణించుకోలేక‌పోతున్నామ‌ని అంద‌రూ అంటారు. రిషి అంటేనే డీబీఎస్‌టీ కాలేజీ, డీబీఎస్‌టీ కాలేజీ అంటే రిషి...అలాంటి రిషి సార్ మ‌న మ‌ధ్య లేడంటే బాధ క‌లుగుతుంద‌ని అంటారు. రిషి చ‌నిపోయాడ‌ని ఎవ‌రు చెప్పారు, తను  క్షేమంగా ఉన్నారంటుంది
శైలేంద్ర: నువ్వు ఒప్పుకుంటే రిషి సంతాప స‌భ‌ను ఏర్పాట‌చేసే ప్ర‌య‌త్నాల్లో లెక్చ‌ర‌ర్స్ ఉన్నార‌ు
వసుధార: నువ్వు ఏర్పాటుచేసుకో సంతాప స‌భ . వీడికి చేయండి సంతాప స‌భ‌. వీడి ఫొటో తెచ్చి దండ వేసి మౌనం పాటించండి. రిషికి ఏం కాలేదు. క్షేమంగానే ఉన్నారు, ఎవ‌రో గిట్ట‌ని వాళ్లు రిషి చ‌నిపోయారని పుకార్లు సృష్టించార‌ు త్వ‌ర‌లోనే  తిరిగి వ‌స్తారని చెబుతుంది
శైలేంద్ర: రిషి చ‌నిపోయాడ‌నే బాధ‌లో వ‌సుధార మెంట‌ల్‌గా డిస్ట్ర‌బ్ అయ్యింది
వసుధార: కోపంతో శైలేంద్రని కొట్టేందుకు చేయెత్తుతుంది..లెక్చ‌ర‌ర్స్ ఆమెను ఆపి క్యాబిన్‌కు పంపిస్తారు.


Also Read: వసుని లాక్కెళుతున్న రాజీవ్ ను ఆపిన వ్యక్తి ఎవరు - రిషి వచ్చేశాడా!


క్యాబిన్‌లో అడుగుపెట్టిన వ‌సుధార జ‌రుగుతోన్న సంఘ‌ట‌న‌ల ప‌ట్ల అస‌హ‌నానికి లోన‌వుతుంది. కోపంతో త‌న క‌ళ్ల ముందు ఉన్న ఫైల్‌లోని పేప‌ర్స్ అన్ని చింపేస్తుంది. అవ‌న్నీ చాటు నుంచి శైలేంద్ర చూస్తాడు. నువ్వు మెంట‌ల్‌గా డిస్ట్ర‌బ్ అయ్యావ‌ని అర్థ‌మ‌వుతుంది వ‌సుధార‌.
శైలేంద్ర: నిన్ను ఎవ‌రైన సైకియాట్రిస్ట్ చూపిస్తే మంచిద‌ని సెటైర్ వేస్తాడు శైలేంద్ర‌. ఎండీ సీట్‌, కాలేజీని ప‌ట్టుకొని వేలాడి నువ్వు సాధించింది ఏం లేదు. కానీ చాలా పోగోట్టుకున్నావు. జ‌గ‌తి, రిషిని దూరం చేసుకున్నావు. ముందు ముందు ఎవ‌రిని దూరం చేసుకుంటావో ఏమో..ఎప్పుడు ఏ పొర‌పాటు చేయ‌ని నిన్ను ఎండీ సీట్‌లో కూర్చున్న త‌ర్వాత అంద‌రూ త‌ప్పుప‌డుతున్నార‌ు ఇవ‌న్నీ అవ‌స‌ర‌మా. ప‌ద‌వి అంటే ముళ్ల‌కిరీట‌మే అందుకే ఎండీ సీట్‌ను ఇచ్చి ఎక్క‌డికైనా వెళ్లి ప్ర‌శాంతంగా బ‌త‌క‌ు...ఎలాగూ రిషి చ‌నిపోయాడు క‌దా 
వసుధార: శైలేంద్ర మాట‌ల‌తో కోపం ప‌ట్ట‌లేక‌ లాగిపెట్టి కొడుతుంది...నువ్వు రెచ్చ‌గొడుతుంటే, మాట‌లు అంటుంటే క‌న్నీళ్లు పెట్టుకుంటూ సెలైంట్‌గా ఉంటాన‌ని అనుకుంటున్నావా..అది జ‌ర‌గ‌దు. నేను భ‌రించినంత వ‌ర‌కే భ‌రిస్తాను. ఆ త‌ర్వాత ఊరుకునేది లేదు. ఎంత‌కైనా తెగిస్తాను. ఏం చేస్తానో కూడా నాకు తెలియ‌ద‌ు. ఎండీ సీట్ కాదు క‌దా...కాలేజీ గేట్ కూడా నిన్ను దాట‌నివ్వ‌ను. మ‌ర్యాద‌గా నా క్యాబిన్‌లో నుంచి వెళ్లిపో లేదంటే మెడ‌ప‌ట్టి గెంటిస్తాన‌ు. వెళ్తావా లేదంటే సెక్యూరిటీని పిలిచి బ‌య‌ట‌కు గెంటించాలా 
 అవ‌మానం త‌ట్టుకోలేక క్యాబిన్ నుంచి కోపంగా బ‌య‌ట‌కు వెళ్లిపోతాడు శైలేంద్ర‌


Also Read: మరో 12 ఎపిసోడ్స్ తో గుప్పెడంత మనసు కి శుభం కార్డ్ - కార్తీకదీపం లానే చేస్తారా!


వ‌సుధార‌పై ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని నిర్ణ‌యించుకుంటాడు శైలేంద్ర... ఈ క్షణమే పగతీర్చుకోవడం మొదలెడతాను అనుకుంటాడు. ఇంతలో కాలేజీ అటెండర్ వచ్చి పలకరిస్తే ఫైర్ అవుతాడు. నన్ను కాలేజీ గేట్ దాటనివ్వవా...నిన్నే శాశ్వతంగా కాలేజీ నుంచి బయటకు పంపించేలా చేస్తాను చూడు అనుకుంటూ ఎవరికో కాల్ చేస్తాడు...


మహేంద్ర
రిషి దూర‌మైన బాధ‌ను మ‌హేంద్ర త‌ట్టుకోలేక‌ ఓ చోట చెట్టు క్రింద కూర్చుని రిషి ఆలోచనల్లో మునిగితేలుతాడు. రిషితో సంతోషంగా గడిపిన క్షణాలు గుర్తుచేసుకుని బాధపడతాడు. రిషి చ‌నిపోయిన నిజం...నిజం కాక‌పోతే బాగుండున‌ని క‌న్నీళ్లు పెట్టుకుంటాడు.
నీలాగే రిషి కూడా త‌న‌ను ఒంట‌రి వాడిని చేశాడ‌ని జ‌గ‌తిని గుర్తుచేసుకొని బాధ‌ప‌డ‌తాడు. మందుతాగి ఆ జ్ఞాప‌కాల నుంచి బ‌య‌ట‌ప‌డాల‌ని అనుకుంటాడు. కానీ అ బాటిల్‌ను అనుప‌మ లాక్కుంటుంది. 
గుప్పెడంత మ‌న‌సు ఇవాల్టి ఎపిసోడ్ ముగిసింది...


Also Read: పనిలో మీ సామర్థ్యాన్ని నిరూపించుకునే టైమ్ ఇది, ఫిబ్రవరి 08 రాశిఫలాలు