Prema Entha Madhuram Serial Today Episode: ఎపిసోడ్ ప్రారంభంలో మీరే రాధ గారిని కిడ్నాప్ చేసి ఉంటారు ఏం చేశారో నిజం చెప్పండి అని నిలదీస్తాడు ఆర్య.


ఛాయాదేవి: మేం కూడా మీతో పాటు ఇక్కడే ఉన్నాం కదా మేమేం చేస్తాము అంటుంది.


ఆర్య : తెలివిగా మాట్లాడుతున్నాను అనుకోకండి, మీ ఫోన్స్ ఓపెన్ చేయండి అని గట్టిగా అడుగుతాడు.


భయంగా ఇద్దరు ఫోన్స్ చూపిస్తారు అక్కడ అనుమానించ దగ్గవిగా ఏమీ కనిపించకపోవడంతో సేఫ్ గేమ్ ఆడుతున్నాను అనుకుంటున్నారా అంటాడు ఆర్య.


ఇంతలో ఆర్యకి కిడ్నాపర్ దగ్గర్నుంచి ఫోన్ వస్తుంది. రాధని సేఫ్ గా ఇంటికి పంపించు అంటాడు ఆర్య.


అయితే ఆ కిడ్నాప్ చేసింది హరీష్. అతను మాట్లాడుతూ కిడ్నాప్ చేసింది టైం పాస్ కోసం కాదు ఏదో ఒక పర్పస్ కోసం అంటాడు. నీ పెళ్లి జరగకూడదు అందుకే కిడ్నాప్ చేశాను మర్యాదగా మండపం ఖాళీ చేసి వెళ్లిపోండి మళ్లీ కాసేపట్లో లైన్ లోకి వస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు హరీష్.


ఆ తర్వాత యాదగిరితో జరిగిందంతా చెప్తాడు ఆర్య కళ్యాణ మండపం సీసీటీవీ ఫుటేజ్ తీసుకురమ్మంటాడు. అందులో కిడ్నాపర్, ఛాయాదేవి సైగలు చేసుకోవటం గమనిస్తాడు ఆర్య.


తర్వాత వాళ్ళిద్దర్నీ వేరే రూమ్ కి తీసుకువెళ్లి మర్యాదగా రాధ గారిని కళ్యాణమండపంలో దింపమని వాడికి చెప్పండి అంటాడు. 


ఛాయా, మాన్సీ ఇద్దరు మాకేమీ తెలియదు అని చెప్తారు. అదే సమయంలో యాదగిరి ఆర్య కి గన్ ఇస్తాడు.


గన్ చూసిన ఛాయదేవి మాన్సీ ఇద్దరు కంగారు పడిపోతారు. చంపేస్తారా ఏంటి అని భయంగా అడుగుతారు.


యాదగిరి: అవును మీరు స్మోక్ బాబు వేసినట్టే కాసేపట్లో కళ్యాణ మండపంలో సిలిండర్ల పేలుతాయి మేమందరం సేఫ్ గానే ఉంటాము కానీ శ్రీమతి మాన్సీ దేవి గారు, శ్రీమతి ఛాయాదేవి గారు మాత్రం పరలోకానికి ప్రయాణం అవుతారు అంటాడు.


ఆర్య : అర్థమైంది కదా మీకు 15 నిమిషాలు టైం ఇస్తున్నాను అప్పటికి రాధ గారు ఇక్కడ ఉండాలి అని మాన్సీ వాళ్లకి చెప్పి యాదగిరి తో పద యాదగిరి రాధగారు వస్తారు అని చెప్పి యాదగిరిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆర్య.


తర్వాత భయపడుతూ మాన్సీ హరీష్ కి ఫోన్ చేసి అనుని కళ్యాణ్ మండపం దగ్గర దింపమని చెప్తుంది.


హరీష్: కుదరదు, నా పెళ్లి జరగలేదు వాడి పెళ్లి కూడా జరగకూడదు అంటాడు.


మాన్సీ : ఇక్కడ మా ప్రాణాలు పోయేలాగా ఉన్నాయి ముందు ఆమెని కళ్యాణ మండపం దగ్గర దించు అనటంతో అనుని కల్యాణ మండపం దగ్గర దించుతారు హరీష్ గ్యాంగ్.


తర్వాత అను, ఆర్యల పెళ్లి జరిగిపోతుంది.


ఇదంతా చూస్తున్న దివ్య ఏడుస్తూ ఇంక నేను బ్రతకను, చచ్చిపోతాను అంటూ మండపం నుంచి పరుగులు తీస్తుంది.


సుగుణ: తన వెనుక మీరు వెళ్ళండి తనని ఆపండి అని జ్యోతి వాళ్లతో చెప్తుంది.


ఆర్య: నువ్వు కూడా వెళ్ళమ్మా జ్యోతి అసలే మొండిది అంటాడు.


సుగుణ: లేదు బాబు మీకు అరుంధతి నక్షత్రం అది చూపించాలి అంటుంది.


అవన్ని మేము చూసుకుంటాము అసలే మోసపోయిన బాధలో ఉంది, ఏం చేసుకుంటుందో ఏమో మీరు కూడా వెళ్ళండి అని సుగుణతో చెప్తారు సుబ్బు దంపతులు.


ఆర్య : పదమ్మ నేను కూడా నీతో వస్తాను దివ్య సంగతి మనకు తెలిసిందే కదా అని పీఠల మీద నుంచి లేచి వెళ్ళిపోతాడు ఆర్య.


కళ్యాణ మండపం నుంచి అందరూ వెళ్లిపోయిన తర్వాత మాన్సీ, ఛాయాదేవి ఇద్దరు సుబ్బు దంపతుల దగ్గరికి వచ్చి మీ అల్లుడు వేరొకరిని పెళ్లి చేసుకుంటూ ఉంటే ఎంత ఆనందంగా ఆశీర్వదిస్తున్నారు అంటుంది మాన్సీ.


పద్దు: అంతా మనమంచికే అనుకునే వాళ్ళం మేము, అందుకే ఏది జరిగిన మా మంచి కోసమే అనుకుంటాము అయినా మీరేంటి ఇలా వచ్చారు అని అడుగుతుంది.


సుబ్బు: ఆర్య సార్ ప్రశాంతంగా ఉండడం వీళ్ళకి ఇష్టం ఉండదు కదా అందుకే పనిగట్టుకుని వెనకాతలే తిరుగుతూ ఉంటారు, పదా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్పి భార్యని మనవలని తీసుకుని బయటికి వచ్చేస్తాడు.


ఛాయాదేవి: నీ భర్త శ్రీరామచంద్రుడు అది ఇది అని పొంగిపోయావు ఇప్పుడు తను రాధ మెడలో తాళి కట్టాడు. ఇప్పుడు చెప్పు వాడు శ్రీరామచంద్రుడా లేకుంటే అందరిలాగా అవసరాల కోసం పెళ్లి చేసుకుని మామూలు మగాడా అంటూ నిలదీస్తుంది.


మరోవైపు బయటకు వచ్చిన సుబ్బు 12 అయిపోతుంది మనం కూడా బయలుదేరుదాము అంటాడు.


పద్దు: పన్నెండు అయిందా అని కంగారు పడుతుంది.


సుబ్బు: అవును ఏమి ఎందుకలా కంగారు పడుతున్నావ్ అని అడుగుతాడు.


పద్దు: అష్టమి ఘడియలు వచ్చేస్తున్నాయి అంటుంది.


అప్పుడే పీటల మీద కూర్చున్న అను ముఖంలో మార్పులు కనిపిస్తాయి. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.