ఎవరైనా మీ ప్రేమను ఒప్పుకోవాలంటే మీరు ప్రపోజ్ చేసే విధానం మీదే చాలా వరకు ఆధారపడి ఉంటుందట... ఈ విషయాన్ని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు తేల్చి చెప్పాయి. మీరు ఎంత అందంగా, ఎంత ప్రభావవంతంగా, ఎదుటి వారిని మంత్రముగ్ధులను చేసేలా ప్రపోజ్ చేస్తారో మీరు అంతగా సానుకూల ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే మంచి ప్రపోజ్ ఐడియాలు, కోట్స్ వంటివి సిద్ధం చేసుకోండి.
వాలెంటైన్స్ వీక్‌లో రెండో రోజు ప్రపోజ్ డే. ప్రపోజ్ చేయడానికి నియమాలంటూ ఏమీ లేవు. మీరు ఎలా అయిన ప్రపోజ్ చేయచ్చు, ఎదుటివారు ఇంప్రెస్ అయితే చాలు. మీ ప్రేమను బంధంగా మార్చుకునేందుకు అవతలి వ్యక్తి అనుమతిని పొందే రోజు ప్రపోజ్ డే. అవతలి నుంచి ‘ఎస్’ అనే పదం వస్తే మీ ప్రేమ బంధానికి మొదటి అడుగు పడినట్టే.
కొన్ని ప్రపోజ్ ఐడియాలు...
1. మీకు పెంపుడు కుక్క ఉంటే దాన్ని మీ ప్రేమ పావురంలా ఉపయోగించుకోవచ్చు. దాన్ని చక్కగా గ్రూమ్ చేసి మంచి టక్సెడో వేసి, మెడ వద్ద చిన్న బో కట్టాలి. మీ ప్రేమ ప్రపోజల్‌కు సంబంధించి గ్రీటింగ్స్, చాక్లెట్స్, పువ్వుల్లాంటివి ఒక బాక్సులో పెట్టాలి. ఆ బాక్సు హ్యాంగర్‌ను కుక్క నోటితో పట్టుకునేలా సెట్ చేయాలి. దాన్ని మీ ప్రేయసి వద్దకు పంపించాలి. పక్క పక్క ఇళ్లల్లో ఉన్న వారికి ఈ ఐడియా పనిచేస్తుంది.
2. మీ టెర్రస్ పై మంచి క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేయండి. ఆ ప్రదేశాన్ని అందంగా మార్చేయండి. ఆమె నడిచి వచ్చే దారిని పూలతో కప్పేయండి. ఆ పూల పక్కన లైట్ల సెట్టింగులు కూడా అమర్చండి. మీ ఏర్పాటుకు ఆమె మనసు ఉప్పొంగిపోవడం ఖాయం.
3. మీరు ప్రేమించే వ్యక్తికి న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉంటే దాన్ని వాడేసుకోవచ్చు. మీ పేరు, ఆమె ఐడెంటిటీ బయట పడకుండా, మీ ఇద్దరి మధ్య జరిగిన అందమైన సంఘటనను పేర్కొంటూ యాడ్ లా ఇవ్వాలి. ఆ ఘటన మీ ఇద్దరికి మాత్రమే తెలిసినదై ఉండాలి. చివర్లో మీ మనసులోని మాటను కూడా ప్రకటనలో చేర్చాలి. ఫోటోల్లాంటివి, అమ్మాయి పేరులాంటివి ఇస్తే మాత్రం మీకే డేంజర్.
4. ఇప్పుడు సర్‌ప్రైజ్ ప్లానర్లు అధికంగానే ఉన్నారు. వారికి చెప్పి ఆమె గదిని ఎర్ర గులాబీలతో, ఎర్ర బెలూన్లతో నింపేయండి. మీ ప్రేమను చెప్పే కేకునో, గ్రీటింగ్ కార్డునో కూడా గదిలో పెట్టమని చెప్పండి. ఆమె తలుపు తీయగానే ఆశ్చర్యపడేలా ఉండాలి అరేంజ్మెంట్స్.
Also Read: ఏ రంగు గులాబీ ఏం సూచిస్తుంది? వైట్ రోజ్‌తో ప్రపోజ్ చేయొచ్చా?
Also Read: ‘వాలెంటైన్స్ డే’ వీక్ వచ్చేసింది, ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత, ఈ ‘డే’స్ మిస్ కావద్దు