ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నా.. ‘Valentine's Day’ వీక్ వచ్చేసింది. Rose Dayతో మొదలయ్యే ఈ వేడుక.. ‘వాలెంటైన్స్ డే’తో ముగుస్తుంది. అయితే, ఈ రోజ్ డే రోజు కేవలం ప్రేమికులే జరుపుకోవాలనే రూల్ లేదు. తాము ఎంతో ఇష్టపడే స్నేహితులతో కూడా జరుపుకోవచ్చు. అయితే, కేవలం స్నేహంతోనే మీ బంధాన్ని బలంగా ఉంచుకోడానికి ప్రయత్నిస్తున్నట్లే.. రెడ్, ఆరెంజ్, వైట్ రోజాలు మాత్రం వద్దు. ఎందుకంటే.. రోజా పూలలోని రంగులు మనసులోని భావాలను చెబుతాయి. తమకు నచ్చిన వ్యక్తి ఎదురుగా ఉన్నప్పుడు గుండె దడ పెరిగి.. మాట బయటకు రాదు. సిగ్గు, బిడియం.. ధైర్యాన్ని డామినేట్ చేస్తాయి. అలాంటి సమయంలో ఒక్క రోజా పువ్వు మాత్రమే మీ మనసులో భావాన్ని ఎదుటి వ్యక్తికి తెలియజేయగలదు. కాబట్టి.. ఏ రంగు గులాబీ వెనుక ఏ అర్థం ఉందనేది ముందుగా తెలుసుకోవాలి. 


వాలెంటైన్స్ డేలో ఈ రోజు చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా తమకు నచ్చిన వ్యక్తికి ప్రేమను వ్యక్తం చేసే రోజు. ఈ రోజు మీకు గ్రీన్ సిగ్నల్ లభిస్తేనే.. ఈ వారంలో మరిన్ని ప్రత్యేకమైన రోజులను ఎంజాయ్ చేయడం కుదురుతుంది. వాస్తవానికి ‘రోజ్ డే’ అనేది ప్రపోజ్ డే మాత్రం కాదు. ఇది మీ మనసులో మాటను నిశబ్దంగా ఆమె లేదా అతడికి పరోక్షంగా చెప్పే రోజు. అయితే, ఈ రోజు ప్రపోజ్ చేయకూడదనే రూల్ కూడా ఏమీ లేదు. అందమైన రోజా పూలను ఆమెకు అందిస్తూ.. ప్రేమను వ్యక్తం చేయొచ్చు. ఆమె అంగీకరిస్తే.. ఆ తర్వాతి రోజులన్నీ మీకు పండగే. ఇంతకీ ఎవరికీ ఏ రంగు రోజా పూలు ఇవ్వాలి?
 
ఈ వాలెంటైన్స్ డేలో ఎక్కువగా ఎరుపు, పింక్, పసుపు, తెలుపు, నారింజ రంగు గులాబీలే కనిపిస్తాయి. మీ మనసులో భావం, అవతిలి వ్యక్తితో మీరు ఎలా ఉండాలని అనుకుంటున్నారనే అంశంతోనే ఈ గులాబీలను ఎంచుకోవాలి. 


పసుపు రంగు గులాబీ (Yellow Rose): పసుపు రంగు గులాబీ స్నేహానికి చిహ్నం. అతడు లేదా ఆమెపై మీకు స్నేహ భావం మాత్రమే ఉందని తెలియజేసేందుకు ఈ రంగు గులాబీని ఇవ్వొచ్చు. 


ఆరెంజ్ రంగు గులాబీ (Orange Rose): ఆరెంజ్ రంగు గులాబీలు ఉత్సాహం, అభిరుచిని సూచిస్తాయి. ‘వాలెంటైన్స్ డే’ ఎరుపు లేదా పింక్ రంగు గులాబీలు అందుబాటులో లేనప్పుడు ప్రత్యామ్నాయంగా మాత్రమే దీన్ని తీసుకుంది. ఎందుకంటే.. ఆరెంజ్ గులాబీలు రొమాంటిక్ ఫీలింగ్‌ను వ్యక్తం చేస్తాయి. రిలేషన్‌షిప్‌కు సిద్ధమేనా అని అడిగేందుకు ఎక్కువగా వీటిని ఉపయోగిస్తారు. 


లేత ఎరుపు లేదా గులాబీ రంగు (Pink Rose): ప్రేమికుల రోజున ‘ధన్యవాదాలు’ తెలియజేసేందుకు ఇవి సరైన గులాబీలు. పింక్ రోజాలు ప్రశంసలు, దయ, పరిపూర్ణ ఆనందం, ప్రశంసలు, కృతజ్ఞత, సౌమ్యతను చూపుతాయి. 


ఎర్ర రంగు గులాబీ (Red Rose): ఎరుపు రంగు గులాబీలు ప్రేమ, శృంగారానికి ప్రతీక. ‘వాలెంటైన్స్ డే’ రోజు మీ ప్రియురాలికి ప్రపోజ్ చేయడానికి, లేదా విష్ చేయడానికి ఇదే సరైన గులాబీ. ఇది ఆనందం, కృతజ్ఞత, దయను సూచిస్తుంది. 


తెల్ల రంగు గులాబీ (White Rose): తెల్ల రంగు గులాబీ స్వచ్ఛత, అమాయకత్వాన్ని సూచిస్తుంది. మీకు నచ్చిన వ్యక్తిని లేదా లవర్‌కు పెళ్లి ప్రపోజ్ చేయడానికి మాత్రమే దీన్ని ఉపయోగించాలి.