బ్లాక్ రైస్ ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుందని మీకు తెలుసా?  మన దగ్గర దీని వాడకం ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. చాలా పరిమిత దేశాల్లో మాత్రమే ఈ రకమైన నలుపు రంగు బియ్యాన్ని పండిస్తారు. దీని సాధారణంగా నిషిద్ధ బియ్యం అని అంటారు. ఎందుకంటే ఇంతక ముందు దీనిని పరిమిత పరిమాణంలో మాత్రమే ఉన్నత వర్గాల వారి కోసం సాగు చేసేవారు. కానీ ఇప్పుడు ఇది భారతదేశంలోని ఈశాన్య, దక్షిణ ప్రాంతాల్లో కూడా విస్తృతంగా పెరుగుతోంది. శాఖాహారులకి ఇది మంచి ఆహారం. దీని వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.


బ్లాక్ రైస్‌ను చైనీయులు ఎక్కువగా తింటారు. ఇందులో ఫైబ‌ర్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో న్యూట్రియెంట్లు, ఫైటో కెమిక‌ల్స్‌, విట‌మిన్ E, ప్రోటీన్లు, ఐర‌న్ స‌మృద్ధిగా ఉంటాయి. అందువ‌ల్ల ఈ రై‌స్‌‌లో అత్యంత పోష‌క విలువ‌లు ఉన్న రైస్‌గా చెప్ప‌వ‌చ్చు. మిగిలిన అన్ని రైస్‌ల క‌న్నా ఈ రైస్‌లో అద్భుత‌మైన ఔష‌ధ గుణాలు ఉంటాయి. 


డయాబెటిస్ ప్రమాదాన్ని నివారిస్తుంది: తెల్ల అన్నం తినడం వల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతాయని, బరువు కూడా పెరుగుతారని దాన్ని తీసుకోవడానికి కొద్దిగా ఆలోచిస్తారు. అందుకే మధుమేహులు తెల్ల అన్నానికి బదులుగా బ్రౌన్ రైస్ తింటారు. తెల్ల అన్నం తినడం వల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతాయని, బరువు కూడా వస్తారని దాన్ని తీసుకోవడానికి కొద్దిగా ఆలోచిస్తారు. అది తీసుకోవడం వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుందని డాక్టర్స్ కూడా సిఫార్సు చేస్తారు. అదే కాదు నల్ల అన్నం కూడా డయాబెటిస్ వాళ్ళకి మంచిదే. బ్లాక్ రైస్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. అందుకే డయాబెటిస్ ముప్పు నుండి బయటపడటానికి ఆహారంలో బ్లాక్ రైస్ చేర్చుకుంటే చాలా మంచిది.


గుండెకు మేలు: నల్ల బియ్యం గుండె ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించడంలో సహాయపడుతుంది. హృదయ సంబంధ వ్యాధుల నుంచి రక్షణగా నిలుస్తూ గుండెకి మేలు చేస్తుంది.


ఫైబర్ పుష్కలం: బ్లాక్ రైస్‌లో ఫైబర్ మెండుగా ఉంటుంది. ఇది పేగులను శుభ్రపరుస్తుంది. మలబద్ధకం, ఉబ్బరం, విరేచనాలను తగ్గించడంలో సహాయకారిగా ఉంటుంది. దీన్ని తీసుకున్న తర్వాత శరీరానికి సంతృప్త అనుభూతిని అందిస్తుంది. పొట్ట నిండుగా అనిపించడం వల్ల ఎక్కువ ఆహారం తీసుకోవడానికి ఇష్టపడరు. దాని వల్ల బరువు తగ్గడంలో సహాయపడుతుంది.


కాలేయాన్ని రక్షిస్తుంది: కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల లివర్ వ్యాధి వస్తుంది. బ్లాక్ రైస్ లోని యాంటీ ఆక్సిడెంట్లు కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి. అంతే కాకుండా కాలేయం పనితీరుని పునరుద్దరిస్తుంది.


కళ్ళకు మేలు: బ్లాక్ రైస్ లో విటమిన్ ఇ, కెరొటీనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అందహత్వానికి దారి తీసే కొన్ని కంటి సంబంధిత వ్యాధులని నయం చెయ్యడంలో సహాయపడుతుంది. వృద్ధులకి కూడా ఉపయోగపడుతుంది. బ్లాక్ రైస్ కళ్ళపై యూవీ రేడియషన్ ప్రభావాన్ని తగ్గిస్తుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: జుట్టు చివర్లు చిట్లిపోయి ఇబ్బంది పడుతున్నారా? ఇలా చేస్తే అద్భుత ఫలితం


Also Read: వేరుశెనగ అతిగా తింటే ఈ అనారోగ్య సమస్యలు తప్పవు