చలికాలంలో వెచ్చని సూప్ తాగుతుంటే ఆ మజానే వేరు. ఇప్పటివరకు మీరు టోమాటో సూప్, స్వీట్ కార్న్ సూప్, మిక్స్ వెజ్ సూప్ వంటివి రుచి చూసి ఉంటారు. ఎప్పుడైనా వెల్లుల్లి సూప్ తిన్నారా? ఈ టేస్టీ సూప్ కేవలం రుచి కోసమే కాదు, ఆరోగ్యం కోసం కూడా. చలికాలంలో వారానికోసారి తాగినా మంచి ఆరోగ్య ఫలితాలు ఉంటాయి. ప్రతి రెండు రోజులకోసారి తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
కావాల్సిన పదార్థాలు
వెల్లుల్లి రెబ్బలు - ఎనిమిది
బంగాళాదుంప - ఒకటి
ఉల్లిపాయ - ఒకటి
జీలకర్ర - అర టీస్పూను
రెడ్ మిర్చి ఫ్లేక్స్ - ఒక టీస్పూను
ఆలివ్ ఆయిల్ - రెండు టేబుల్ స్పూన్లు
ఫ్రెష్ క్రీమ్ - అరకప్పు
ఒరెగానో - ఒక టీస్పూను
ఉప్పు - తగినంత
నీళ్లు - సరిపడినన్ని
తయారీ ఇలా...
స్టవ్ పై కళాయి పెట్టి ఆలివ్ ఆయిల్ వేడి చేయాలి. అందులో జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ తరుగును వేసి ఒక నిమిషం పాటూ వేయించాలి. వెల్లుల్లి రెబ్బలను సన్నగా తురుముకుని అవి కూడా ఫ్రై చేయాలి. ఇప్పుడు చిన్నగా కోసుకున్న బంగాళాదుంప ముక్కలను వేసి వేయించాలి. రెండు కప్పుల నీళ్లు పోసి, ఉప్పు వేసి కళాయిపై మూత పెట్టి 15 నుంచి 20 నిమిషాల పాటూ ఉడికించాలి. బంగాళాదుంపలు మెత్తగా ఉడికాక తాజా క్రీమ్ ను వేసి కలపాలి. రెండు నిమిషాల పాటూ ఉడికించి స్టవ్ కట్టేయాలి. బ్లెండర్ తో ఓసారి బాగా గిలక్కొట్టాలి. ఇప్పుడు మీకు సూప్ ఎంత జారుడుగా కావాలో అన్నీ నీళ్లను కలుపుకోవాలి. పైన రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఒరెగానో తో గార్నిష్ చేసి తింటే టేస్టు చాలా బావుంటుంది.
బరువు తగ్గుతారు...
బరువు తగ్గాలనుకునేవారికి వెల్లుల్లి ఎంతో మేలు చేస్తుంది. జీర్ణాశయంలోని ఎంజైములను ఉత్తేజపరుస్తుంది వెల్లుల్లి. కాబట్టి ఆహారం బాగా జీర్ణమవుతుంది. ఆహారంలో ఉండే కొవ్వును శరీం నుంచి బయటకు పంపిస్తుంది. అంటే శరీరంలో కొవ్వును పేరుకుపోనివ్వదు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి శరీరంలో చే ఫ్రీరాడికల్స్ తో పోరాడతాయి. ఇందులో విటమిన్ సి, విటమిన్ బి6లు రోగనిరోధక శక్తిని పెంచి, సీజన్ వ్యాధులను తట్టుకునే శక్తిని ఇస్తాయి.
Also read: కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం వీరికే ఎక్కువ... ఈ లక్షణాలు కనిపిస్తే తేలికగా తీసుకోవద్దు
Also read: ఫ్యామిలీని, ఫ్రెండ్స్‌ను ఇలా తెలుగులో విష్ చేయండి, మీ కోసం అందమైన కోట్స్ ఇవిగో...