ఇంటర్నెట్ ఉంది కదా అని పదే పదే పోర్న్ వీడియోలు చూస్తూ బుర్ర పాడు చేసుకోకండి. అందులో ఉన్న పురుషుల్లా ఎక్కువ సేపు శృంగారం చేయలేకపోతున్నామని భావించకండి. అదంతా పెద్ద ట్రాష్. వాళ్లంతా వయాగ్రాలు వేసుకుని, సర్జరీలు చేయించుకుని ఆ పనులు చేస్తారు. అలాగే వారు నివసించే  ప్రాంతాల్లోని భౌగోళిక పరిస్థితులు, కెమేరా టెక్నిక్స్ వల్ల ఆ ‘సైజు’లు అలా కనిపిస్తాయి. ఆ పనికి సైజుతో పనిలేదని ఇప్పటికే వైద్య నిపుణులు స్పష్టం చేశారు. శీఘ్రస్కలన సమస్య లేకపోతే చాలు. తప్పకుండా ఆ పనిలో ఛాంపియన్స్ అవుతారు. 


ప్రతి పురుషుడికి పడక గదిలో కింగ్‌లా ఉండాలని అనిపిస్తుంది. భార్య లేదా బెడ్ పార్టనర్ మెప్పు పొందాలని ఉంటుంది. ఆ పనిలో డకౌట్ కాకూడదని కోరుకుంటారు. కనీసం కాసేపైనా క్రీజ్‌లో ఉండాలని అనుకుంటారు. అయితే, చాలామంది ఎక్కువ సేపు శృంగారం చేయలేకపోతున్నామా అనే సందేహంలో ఉంటారు. అదే మనసులో పెట్టుకుని త్వరగా ఔటైపోతారు. అయితే, ఒక భారతీయ పురుషుడు సరాసరి ఎంత సేపు శృంగారం చేయగలడో తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. 


కొంతమంది పురుషులకు చాలాసేపటి వరకు స్కలనం కాదు. కొందరికి.. వెంటనే స్కలనమైపోతుంది. ఇలాంటివారిని లెక్కలోకి తీసుకోకుండా ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి ఎంత సేపు శృంగారం చేయగలడనేది లెక్క వేసుకుంటే.. ఒక్కో దేశంలో ఒక్కో టైమ్ వచ్చింది. అమెరికాలో పురుషులు సగటున 13 నిమిషాలు, యూరప్‌లో 10 నిమిషాలు, జర్మనీలో 7 నిమిషాలపాటు శృంగారంలో పాల్గొంటారట. 


ఇటీవల కొత్తగా పెళ్లి చేసుకున్న ఓ యువకుడు పోర్న్ సినిమాల్లో స్టార్స్‌లా రెచ్చిపోదాం అనుకున్నాడు. స్నేహితుల సలహాతో వయగ్రాను వాడాడు. అతడు అత్యాశతో ఎక్కువ డోసులు తీసుకోవడం మొదలుపెట్టాడు. దీంతో వయాగ్రా వల్ల స్తంభించిన అంగం.. అలాగే ఉండిపోయింది. ఫలితంగా అతడు ఫ్యాంట్ ధరించడానికి కూడా సిగ్గుపడుతున్నాడు. అయితే, మీరు మాత్రం అతడిలా చేయకండి. ఎందుకంటే.. పోర్న్‌లో చూపించినట్లు ఎక్కువ సమయం ఆ పనిలో పాల్గోవలసిన అవసరం లేదు. పైగా సెక్స్ అంటే కేవలం అంగ ప్రవేశం మాత్రమే కాదు. ఫోర్ ప్లే కూడా అందులో భాగమే. దానితో మొదలుపెడితేనే.. శృంగారాన్ని ఎంజాయ్ చేయగలరు. అలాగే, త్వరగా స్కలనం కాకుండా కొన్ని కిటుకులు కూడా తెలుసుకోవాలి. 


Also Read: ఎక్కువ సేపు శృంగారం చేయాలని ఉందా? ఇలా చేస్తే మీరే ఛాంపియన్!


అమెరికా పురుషులతో పోల్చితే.. భారతీయుల సగటు స్కలన రేటు సమయం చాలా తక్కువ. ఆరోగ్యంగా ఉండే ఒక భారతీయుడి సగటు స్కలన సమయం 7 నిమిషాలు కంటే తక్కువే. అంటే, భారతీయులు కనీసం 5 నుంచి 6 నిమిషాల వరకు సెక్స్ చేయగలరని అర్థం. ఇది మంచి సమయమే. ఐదు నిమిషాల కంటే ఎక్కువసేపు శృంగారంలో పాల్గొన్నా.. పడక గదిలో కింగ్సే. కాబట్టి, ఇది శీఘ్రస్కలనం కిందకు రాదు. ఒక నిమిషం కంటే తక్కువ సమయంలో స్కలనం జరిగితేనే శీఘ్ర స్కలనం అని అంటారు. బాల్యం నుంచి పోర్న్ చిత్రాలు చూసేవారికి ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. శృంగారం మీ మానసిక స్థితిపై కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి, ఈ విషయంలో మీ పార్టనర్‌ను నిందించకూడదు. కాబట్టి, ఈ సారి శృంగారంలో పాల్గొన్నప్పుడు యావరేజ్ సమయాన్ని లెక్క వేసుకోండి. ఒక నిమిషం కాకుండానే స్కలనం జరిగితే వైద్యుడిని సంప్రదించండి. వయాగ్రాలను అతిగా ఉపయోగించి కొత్త సమస్యలను కొని తెచ్చుకోవద్దు.


Also Read: వీర్య దానంతో డబ్బే డబ్బు, ఇలా చేస్తే మీరూ సంపాదించవచ్చు!