Fennel Seed Benefits and Precautions : అద్భుతమైన భోజనం చేసిన తర్వాత.. దానిని సులభంగా అరింగించుకునేందుకు చాలామంది సోంపును తీసుకుంటారు. ఎందుకంటే ఇవి తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో హెల్ప్ చేస్తాయి. అయితే సోంపు గింజలతో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సోంపు గింజలు విటమిన్ సి, మినరల్స్​తో నిండి ఉంటాయి. కాబట్టి వాటిని వివిధ ఆరోగ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తూ ఉంటారు. 


ఫెన్నెల్ సీడ్స్ జీర్ణ సమస్యలను దూరం చేయడంలో, బరువును అదుపులో ఉంచడంలో, మూత్రాశయ వ్యాధుల నిర్వహణలో హెల్ప్ చేస్తాయి. వికారం, వాంతులు వంటి వాటి నుంచి ఉపశమనం అందిస్తాయి. ఇవి మహిళల్లో తల్లిపాల స్రావాన్ని పెంచడానికి హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా కళ్లు మంటపెడుతున్నప్పుడు మీరు సోంపు నీటిలో కాటన్ ముంచి కళ్లపై పెట్టుకుంటే మంచి ఉపశమనం ఉంటుంది. ఇవే కాకుండా వివిధ ఆరోగ్య ప్రయోజనాల కోసం దీనిని ఉపయోగించవ్చచు. వీటిని తీసుకోవడంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది అంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 


కడుపు ఉబ్బరం తగ్గించడానికి


ఫెన్నెల్ సీడ్స్ కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలను దూరం చేస్తాయి. పలు అధ్యయనాలు కూడా ఇది నిజమని నిరూపించాయి. సోంపు గింజల్లో కార్మినేటివ్ పుష్కలంగా ఉంటాయి. ఇవి పేగు కదలికలను నియత్రిస్తుంది. శరీరంలో చిక్కుకున్న వాయువును బయటకు పంపి కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల అజీర్ణం, ఉబ్బరం వంటి సమస్యలు ఉండవు. 


మలబద్ధకానికై.. 


సోంపు గింజల్లోని డైటరీ ఫైబర్ మలబద్ధకాన్ని తగ్గించడంలో గొప్పగా పనిచేస్తుంది. మలబద్ధకం సమస్య ఉన్నవారు సరిగ్గా తినలేరు. తిన్న ఆహారాన్ని బయటకు పంపండంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాంటివారు సోంపు గింజలు తీసుకుంటే చాలా మంచిది. దీనిలోని డైటరీ ఫైబర్ మలాన్ని సులువుగా బయటకు నెట్టివేస్తుంది. దీనివల్ల మీరు మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం పొందుతారు. 


కోలిక్ నొప్పి


కోలిక్ నొప్పి అనేది పేగులలో గ్యాస్ చేరడం వల్ల వస్తుంది. ముఖ్యంగా తల్లిపాలు తాగే పిల్లల్లో కడుపులో గ్యాస్​ వల్ల కలిగే తీవ్రమైన నొప్పినే కోలిక్ పెయిన్ అంటారు. అలాంటి సమయంలో సోంపు గింజలను డ్రై రోస్ట్ చేసి పొడి చేసి.. దానితో చేసిన నీటిని వారికి పట్టిస్తే ఉపశమనం కలుగుతుంది. పేగుల్లో చిక్కుకున్న వాయువు బయటకు వచ్చేందుకు ఇది హెల్ప్ చేస్తుంది. అయితే పిల్లలకు దీనిని ఇచ్చే ముందు వైద్యుని కచ్చితంగా సంప్రదించాలి. 


పీరియడ్స్ సమయంలో 


పీరియడ్స్ వచ్చినప్పుడు చాలామంది మహిళలు, అమ్మాయిలు కడుపు నొప్పితో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి సమయంలో సోంపు గింజలు నొప్పి నుంచి మీకు ఉపశమనం ఇస్తాయి. ఈ గింజల్లో ఈస్ట్రోజెనిక్ లక్షణాలు ఉన్నాయని ఓ అధ్యయనం తేల్చింది. దీనివల్ల అమ్మాయిల్లో హార్మోన్స్ కంట్రోల్​ అవుతాయని.. గర్భాశయ సంకోచాల ఫ్రీక్వెన్సీ తగ్గి.. పీరియడ్ నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. పీరియడ్స్ సమయంలో రోజుకు ఒకసారి మూడు నాలుగు రోజులు దీనిని తాగవచ్చు. 


వారు దూరంగా ఉంటే మంచిది


సోంపు తీసుకుంటున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంది. కాబట్టి వైద్యుని సలహా కచ్చితంగా తీసుకోవాలి. మూర్ఛ సమస్య ఉన్నవారు దీనికి దూరంగా ఉండడమే మంచిది. గర్భనిరోధక మాత్రలు తీసుకునేవారు కూడా సోంపు తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే సోంపులోని ఈస్ట్రోజెనిక్ లక్షణాలు గర్భనిరోధక మాత్రల ప్రభావాన్ని తగ్గిస్తాయి. 


Also Read : మామిడి ఆకులను ఇలా తీసుకుంటే మధుమేహం కంట్రోల్.. బరువు కూడా తగ్గొచ్చట