Krishna Mukunda Murari Today Episode: ఉదయాన్నే బయట ముగ్గు వేద్దామని కృష్ణ వెళ్లగా అప్పటికే అక్కడ ముగ్గు వేసి ఉంటుంది. అది చూసి కృష్ణ ఇంట్లో అందరిని అడుగుతుంది. అందరూ మేం కాదు మేం కాదు అని చెప్తారు. ఇంతలో ముకుంద పూజ పూర్తి చేసుకొని అందరికీ హారతి ఇస్తుంది.
మధు: అసలు నా వల్ల కానే కావడం లేదు ఇదంతా నాటకమా.. లేక నిజమా..
నందూ: హే కాదు మధు.. అసలు ఇంత ఉదయం లేవాల్సిన అవసరం తనకు ఏముంది చెప్పు.
సుమలత: ఒకవేళ ముకుంద ముగ్గు వేసిందేమో.
కృష్ణ: ముకుంద ముగ్గు నువ్వు వేశావా..
ముకుంద: అవును కృష్ణ. ఉదయమే 4.30కి లేచి ముగ్గు వేసి పూజ చేసే సరికి ఇదిగో ఇంత టైం పట్టింది.
కృష్ణ: నువ్వు ఎందుకు వేశావ్ ముకుంద అది నా డ్యూటీ కదా.
ముకుంద: నీ డ్యూటీనే కావొచ్చు కానీ ఈరోజు నువ్వు ఏ పని చేయకూడదు. అయ్యో కృష్ణ ఎప్పుడు ఎదుటి వాళ్ల మంచి కోసం ఆలోచించడం కాదు. కొంచెం నీ గురించి కూడా ఆలోచించు.
రేవతి: దానికి ఆ బుద్ధే ఉంటుంటే ఎప్పుడో బాగు పడేది.
ముకుంద: బాగా చెప్పారు అత్తయ్య. నాకు కూడా కృష్ణ అంటే ఏంటో పూర్తిగా అర్థమైంది. ఈరోజు మా కృష్ణ శోభనం కదా తను ఏ పని చేయకూడదు అని నేను అలారం పెట్టి అన్ని పనులు చేశాను. అత్తయ్య కృష్ణ నన్ను క్షమించింది కృష్ణ రుణం తీర్చుకోవడానికి ఎన్ని జన్మలెత్తినా నాకు సరిపోదు.
మురారి: కొత్తగా ముకుంద ముగ్గు వేసింది ఏంటి.. అసలు ఎందుకు వేసింది. ఏమైంది.. ఎందుకు బాధ పడుతున్నావ్.
కృష్ణ: ఏబీసీడీల అబ్బాయ్ నేను బాధ పడట్లేదు అండి సిగ్గు పడుతున్నాను.
మురారి: ఓహో సిగ్గు పడుతున్నావా.. అలా అస్సలు లేదు.. అయినా ఎందుకు సిగ్గు పడుతున్నావు. అసలు ఏమైంది.
కృష్ణ: ఎందుకు ముకుంద నువ్వు ముగ్గు వేశావు అంటే ఈరోజు నీకు ఏ పని చెప్పను నువ్వు హ్యాపీగా రెస్ట్ తీసుకో ఆ పనులు నేనే చేస్తాను అంది.
మురారి: చాలా మంచి పని చేసిందిగా.. సో నువ్వు ఇప్పుడు ఏ పని చేయకుండా ఎనర్జీ అంతా నైట్‌కి దాచిపెట్టుకో.
కృష్ణ: చాలు.. వెళ్లండి..
మరోవైపు ముహూర్తం పెట్టడానికి పంతులు వస్తారు. కార్యానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తానని ముకుంద సందడి పండితే.. భవాని అడ్డుకొని ఆ పనులను నందూ, గౌతమ్‌లకు అప్పగిస్తుంది. దాంతో ముకుంద ఫీలవుతుంది.
రేవతి: అక్కా. అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. అందరం సంతోషంగా ఉన్నాం. వీటన్నింటి కంటే ఆనందించాల్సిన విషయం ఏంటంటే.. ముకుంద కూడా మారడం. నాకు తను మారింది అంటే నిన్నటి వరకు చాలా అనుమానంగా ఉండేది. కానీ తను ఈ రోజు ఉదయం లేచి ముగ్గులు పెట్టి కృష్ణని ఏ పని చేయొద్దని చెప్పి రెడీ చేస్తాను అని చెప్పి బయటకు కూడా తీసుకెళ్లింది. ఇవన్నీ చూస్తుంటే మారింది అని నమ్మకం కలిగింది అక్క. మురారికి ఉద్యోగంలో రూపం మారడం వల్ల ఇబ్బంది అయింది కదా. మళ్లీ వాడు జాబుకి వెళ్తే కృష్ణ కూడా హాస్పిటల్‌కి వెళ్తుంది. మీరు ఏదైనా ఇన్ఫులియన్స్ చేసి వాడికి మళ్లీ తొందరగా జాబ్‌లో పెట్టిస్తే.. బాగుంటుంది.
భవాని: చేద్దాంలే రేవతి ముందు వాళ్లని ఎంజాయ్ చేయనివ్వు. కృష్ణ కోసం హాస్పిటల్ కట్టిద్దామని అన్నాను కదా దాని కోసం పర్మినెంట్ కాంపౌండ్ వాల్ కట్టించమని చెప్పాను. ఇక కన్‌స్ట్రక్షన్ పనులను మన పెద్దపల్లి ప్రభాకర్ జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత తనకి అప్పగిద్దాం అనుకుంటున్నా. ఇక మనకు అన్నీ మంచి శకునాలే.. అన్ని మంచి రోజులే రాబోతున్నాయి.
రేవతి: అక్కా కృష్ణ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఆల్ రౌండ్ టూర్ వేద్దామనుకుంటుంది పంపిద్దామా..
భవాని: వెళ్లమను కావాలి అంటే అమెరికా వరకు వెళ్లమను.
ముకుంద: (కృష్ణ, ముకుంద రెస్టారెంట్‌కి వస్తారు.) కృష్ణ నిన్న పతంగులు కట్ అయినప్పుడు, నిన్న హారతి ఆరిపోయినప్పుడు నువ్వు ఫీల్ అయ్యావు. అవన్నీ యాథృశ్చికమే. నేను ఏం చేయలేదు. ఇంట్లో నుంచి అందరూ నన్ను నిర్దాయగా వెళ్లగొడుతుంటే నువ్వు ఒక్కదానివే అడ్డుకున్నావు. ఏం జరిగినా నాదే బాధ్యత అని నువ్వు నిలబడ్డావు.
కృష్ణ: అప్పుడు ఏదో అలా ఎమోషనల్‌గా ఫీలయ్యాను. కానీ ఇప్పుడు అలా ఏం లేదు. అయినా ముకుంద నువ్వు కూడా పాత విషయాలు అన్నీ మర్చిపో.
మరోవైపు మధు కార్యానికి సంబంధించిన అన్ని తీసుకొని వస్తాడు. ఇక మురారి వచ్చి కృష్ణ ఏది అని అడిగితే సుమలత ముకుంద బయటకు తీసుకెళ్లింది అని చెప్తాడు. దాంతో మురారి షాక్ అవుతాడు. ఇంతలో ముకుంద, కృష్ణ వస్తారు. కృష్ణని ముకుంద పార్లర్‌కి తీసుకెళ్లి అందంగా రెడీ చేసి తీసుకొస్తుంది. దీంతో అందరూ ముకుందని పొగుడుతారు. కృష్ణని చాలా అందంగా ఉందని అంటారు. మురారి కూడా అలా చూస్తూ ఉండిపోతాడు. ఇక కృష్ణ ముకుందకి థ్యాంక్స్ చెప్పి హగ్ చేసుకుంటుంది. ఇక రాత్రి ముకుంద, నందూ కృష్ణను అందంగా రెడీ చేస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.