Gruhalakshmi Serial Today Episode:  అనసూయ హాల్లో ఒక్కతే కూర్చుని లాస్య మాటలు గుర్తు చేసుకుంటూ బాధపడుతుంది. ఇంతలో నంద, తులసి వస్తారు. తులసి హ్యాపీగా అనసూయ దగ్గరుక వెళ్లి కూర్చుని అత్తయ్య చాలా రోజుల తర్వాత  ఇవాళ కొంచెం సంతోషంగా ఉన్నాను అంటుంది. లాస్య మాటలు నీకు చెప్పి నీ సంతోషం పాడు చేయలేనమ్మ అని మనసులో అనుకుంటుంది అనసూయ.


తులసి: చాలా రోజులుగా ప్రతి విషయంలోనూ ఓటమి ఎదురవుతుంది. నిరాశ మిగులుతుంది. నా మీద నేను నమ్మకం కోల్పోయాను. ఇక ఈ జీవితం ఇంతే అని ఫిక్సయిపోయాను. అలాంటిది ఇవాళ నేను గెలిచాను అత్తయ్య. దివ్య సమస్యను పరిష్కరించాను. దాని జీవితంలో ఎటువంటి సమస్య రాదు.


అనసూయ: సమస్యలు అనేవి కనపడని శత్రువులమ్మా.. ఎప్పుడు ఏ మూల నుంచి వచ్చి మీద పడతాయో తెలియదు. ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిందే. మన టైం బాగాలేనప్పుడు కోరలు లేని పాము కూడా మనల్ని కాటేసి చంపుతుంది.


  అంటూ అనసూయ బాధగా మాట్లాడగానే దివ్య గురించి చెప్పగానే ఎగిరి గంతేస్తారనుకుంటే ఎందుకు ఇంత డల్‌గా ఉన్నారు అంటూ తులసి అడుగుతుంది. చెప్పు అమ్మా... నాన్నా ఏమైనా అన్నారా? అంటూ నంద ప్రశ్నింస్తాడు. ఇంతలో అక్కడకు లాస్య వచ్చి నిజం చెప్పండత్తయ్యా ఏం జరిగిందో అంటుంది. దీంతో నంద అమ్మ చెప్పడం లేదు నువ్వైనా చెప్పు లాస్య అనగానే ఏంలేదు నందు మామయ్య గారి ఆరోగ్యం గురించే ఆలోచిస్తుంది అని లాస్య చెప్తుంది. మరోవైపు రాజ్యలక్ష్మీ, బసవయ్య హాల్లో కూర్చుని సీరియస్‌గా ఆలోచిస్తుంటారు. బసవయ్య వెటకారంగా రాజ్యలక్ష్మీని తిడుతుంటాడు. రాజ్యలక్ష్మీ ఆఖరి నిమిషంలో నా ప్లాన్‌ తిరగబడింది అంటుంది. ఇంతలో దివ్య వస్తుంది. బసవయ్య చూసి అక్కాయ్‌ గుంటూరు మిరపకాయ మన వైపే వస్తుంది అంటాడు.


దివ్య: ఏం జరుగుతుంది బాబాయ్‌..


బసవయ్య: జరిగిన దాని గురించి నేను మీ అత్తయ్య చెప్పుకుని మురిసిపోతున్నాం.


దివ్య: అత్తయ్య ముఖం చూస్తే మురిసిపోతున్నట్లు కనిపించడం లేదే? సమస్య నుంచి నేను బయటపడ్డందుకు రగిలిపోతున్నట్లుందే?


బసవయ్య: అబ్బే అలాంటిదేం లేదమ్మా.. మా అక్కాయ్‌ ముఖమే అంత


  అనగానే దివ్య పాత విషయాలు మొత్తం గుచ్చి గుచ్చి అడుగుతుంది. ఎండిపోయిన తులసి మొక్క నుంచి చందనకు ఇస్తానన్న నెక్లెస్‌ వరకు అడగ్గానే రాజ్యలక్ష్మీ, బసవయ్య షాక్‌ అవుతారు. నాకు అన్నీ తెలుసు అందరి ముందు మన ఇంటి విషయాలు బయట పెట్టకూడదని ఊరుకున్నానని లేదంటే మీ కొడుకు కాని కొడుకు మిమ్మల్ని ఇంట్లోంచి బయటకు గెంటేశేవాడు అని వార్నింగ్‌ ఇస్తుంది. ఎందుకు ఇదంతా చేశావని అడుగుతుంది. విక్రమ్‌ తన ఆస్థినే కాదు.. ప్రాణాన్ని కూడా నీకోసం ఇస్తాడు. ఇప్పటికైనా మారు అంటూ ఏడుస్తూ చెప్పి వెళ్లిపోతుంది. అక్కాయ్‌ మారమని అడుగుతుంది నిజంగానే మారిపోతావా అని బసవయ్య అడుగుతే అవును మారిపోతాను ఇప్పటికంటే ఎక్కువ రాక్షసంగా మారిపోతాను. ఆ విక్రమ్‌ గాన్ని చంపి అది దివ్యపై వేస్తాను అంటూ చాలెంజ్‌ చేస్తుంది రాజ్యలక్ష్మీ.


మరోవైపు అనసూయ ఎలాగైతే ఆలా కానీ తులసికి మాత్రం లాస్య గురించి నిజం చెప్పాలనుకుని లాస్య లేదని కన్‌ఫం చేసుకుని తులసి దగ్గరకు వెళ్లి..


అనసూయ: తులసి నీకో విషయం చెప్పాలమ్మా.. నా వైపు తిరగక్కుండా అలాగే ఉండి విని. మనం ఏదైతే భయపడ్డామో అదే జరుగుతుందమ్మా! లాస్య మీ మామయ్య మీద ప్రేమతోనో, జాలితోనో ఈ ఇంటికి రాలేదు. ఆయన జబ్బును అడ్డం పెట్టుకుని శాశ్వతంగా మళ్లీ ఈ ఇంటి కోడలు అవుదామని వచ్చింది. ఇదంతా దాని నోటితో అదే చెప్పిందమ్మా.. పైగా ఇదంతా ఎవరితోనైనా చెబితే మీ మామయ్య ప్రాణాలు తీస్తానని బెదిరించింది. ఏ నిమిషంలో ఏం జరుగుతుందోనని భయంగా ఉందమ్మా.. నువ్వే ఏదో ఒకటి చేయాలమ్మా ఆ లాస్యని వెంటనే ఇంట్లోంచి తరిమేయాలి.


  అంటూ చెప్తుంటే.. కింద నుంచి పైకి వస్తూ లాస్య వింటుంది. ఈ ముసల్దానికి నా డోస్‌ సరిపోనట్లుంది అని మనసులో అనుకుంటుంది. తులసికి మొత్తం చెప్తున్నట్లుంది అనుకుంటూ పైకి పరుగెత్తుకొస్తుంది. ఇంతలో తులసి హియర్‌ బర్డ్స్‌ పెట్టుకుని ఎవరితోనో ఫోన్‌ మాట్లాడుతుంది. అనసూయ మాటలు వినదు. ఫోన్‌ కట్‌ చేసి   ఎందుకు అత్తయ్య అక్కడే నిలబడ్డారు ఏమైనా చెప్పాలా? అని అడుగుతుండగానే లాస్య వస్తుంది.


లాస్య: ఊరికే చూసిపోదామని వచ్చాను. అక్కకు ఏదో చెప్పాలని చూస్తున్నారు. చెప్పండి అత్తయ్య నేను వింటాను.


తులసి: అత్తయ్య నేను ఆఫీసు మీటింగ్‌లో ఉన్నాను. ఇవి చెవిలో ఉన్నాయి. అందుకే మీరు చెప్పింది వినబడలేదు. మీరు వచ్చింది కూడా నేను గమనించలేదు. ఆ వంట సంగతి నేను చూస్తానులే


అంటూ తులసి వెళ్లిపోతుంది. మరోసారి లాస్య, అనసూయకు వార్నింగ్‌ ఇస్తుంది. మరోవైపు దివ్య ఆలోచిస్తూ కూర్చుంటే విక్రమ్‌ వాళ్ల నాన్న, ప్రియ వచ్చి రాజ్యలక్ష్మీని వదిలిపెట్టొద్దని అందరి ముందు దోషిగా నిలబెట్టాలని చెప్తారు. దీంతో విక్రమ్‌కు రాజ్యలక్ష్మీని దూరం చేయాలని అందుకు మీ సాయం కావాలని అడుగుతుంది. సరే అని వాళ్లు మాటిస్తారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


Also Read: ముందే ఫిక్స్ అయ్యా, చివరి సినిమా ఇదే కావచ్చు - మహేశ్ బాబు