Vinayaka Chavithi Recipes 2024 : వినాయక చవితి వచ్చేస్తుంది. అయితే ఇప్పటినుంచే కొన్ని ప్రసాదాలు నేర్చుకుంటే.. పండుగ సమయానికి చక్కని నైవేద్యాలు చేయొచ్చు. అయితే రోటీన్​గా, ప్రసాదంగా ఇంట్లో చేసుకోగలిగే రెసిపీలు కొన్ని ఉన్నాయి. అలాంటి వాటిలో గారెలు ఒకటి. అయితే గారెలు కోసం చేసే ప్రిపరేషన్​తో రెండు రకాల ప్రసాదాలు చేయొచ్చు. అవే గారెలు, పెరుగు గారెలు. ఈ రెండింటీని చాలా మంది రెగ్యూలర్​గా చేసుకుంటారు కానీ.. ప్రసాదం కోసం వీటిని ఎలా తయారు చేయాలి? ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటి? కావాల్సిన పదార్థాలు? తయారీ విధానం వంటి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 


కావాల్సిన పదార్థాలు 


మినపప్పు - 1 కప్పు 


బియ్యం పిండి - 2 టేబుల్ స్పూన్స్


ఉప్పు - రుచికి తగినంత 


నూనె - డీప్ ఫ్రైకి సరిపడా


పెరుగు - అర కప్పు


నీళ్లు - ఒకటిన్నర కప్పు


ఉప్పు - రుచికి తగినంత 


పెరుగు - మూడు కప్పులు


కరివేపాకు - 1 రెబ్బ


ఆవాలు - పావు టీస్పూన్


జీలకర్ర - అర టీస్పూన్


ఎండు మిర్చి - 1


పచ్చిమిర్చి - 1


అల్లం తురుము - 1 టీస్పూన్


ఇంగువ - చిటికెడు


ఉప్పు - రుచికి తగినంత 


నూనె - 1 టేబుల్ స్పూన్


పసుపు - పావు టీస్పూన్


తయారీ విధానం


ముందుగా మినపప్పును బాగా కడగాలి. దానిలో నీళ్లు వేసి నాలుగు నుంచి 5 గంటలు నానబెట్టాలి. లేదంటే రాత్రి నానబెట్టుకోవాలి. ఉదయాన్నే పప్పును మరోసారి కడిగి.. నీటిని వంపేయాలి. ఈ పప్పును మిక్సీజార్​లోకి తీసుకుని గ్రైండ్ చేయాలి. దానిలో కాస్త నీరు వేసుకుంటూ పిండిని మిక్సీ చేసుకోవాలి. నీరు మరీ ఎక్కువ వేయకూడదు. పిండి మరీ ఎక్కువ లూజ్​గా కాకుండా మంచిగా గ్రైండ్ చేసుకోండి. దానిలోనే కాస్త ఉప్పు వేసి గ్రైండ్ చేసుకుంటే మరీ మంచిది. 


ఇలా మిక్సీ చేసుకున్న పిండిని ఓ మిక్సింగ్ బౌల్​లోకి తీసుకోవాలి. దానిలో బియ్యం పిండి వేసి.. ఉండలు లేకుండా చేతితో ఓ నిమిషం పాటు బాగా కలపాలి. ఇలా చేయడం వల్ల పిండి బాగా కలిగి గారెలు మంచిగా వస్తాయి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై కడాయి పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేగిన తర్వాత.. పిండిని గారెలుగా ఒత్తుకుని.. నూనెలో వేయాలి. రెండు వైపులా వేయించుకుని.. క్రిస్పీగా, గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చిన తర్వాత వాటిని నూనె నుంచి తీసేయాలి. అంతే టేస్టీ గారెలు రెడీ.. 
పెరుగు వడ కోసం.. 


ఓ మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. దానిలో పెరుగు, రుచికి తగినంత ఉప్పు వేసుకుని బాగా కలపాలి. ఇప్పుడు దానిలో నీళ్లు వేసి.. బటర్ మిల్క్​లా చేసుకుని పక్కన పెట్టాలి. ఇప్పుడు వేయించుకున్న గారెలను ఆ బటర్​ మిల్క్​లో వేయాలి. ఈ బటర్​ మిల్క్​లో వాటిని మూడు నిమిషాలు నానబెట్టాలి. అనంతరం వాటిని పైకి తీసి.. సుతిమెత్తగా ఒత్తుతూ.. దానిలోని బటర్​మిల్క్​ని పిండాలి. 


ఇప్పుడు స్టౌవ్ వెలిగించి చిన్న కడాయి పెట్టాలి. దానిలో నూనె వేసి.. ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. అవి కాస్త వేగిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేయాలి. దానిలో పచ్చిమిర్చి. అల్లం తురుము, ఇంగువ, పసుపు వేసి తాళింపు వేసుకోవాలి. చివరిగా పసుపు వేసి స్టౌవ్ ఆపేయాలి. దానిలో గడ్డ పెరుగు లేదా యోగర్ట్ వేయాలి. తాళింపు బాగా కలిసేలా పెరుగును కలపాలి.


ఇలా తయారు చేసుకున్న పెరుగు తాళింపులో.. బటర్​ మిల్క్​లోనుంచి తీసిన వడలు వేయాలి. వాటిపై పెరుగు వేస్తూ కవర్ చేయాలి. అంతే టేస్టీ టేస్టీ పెరుగు వడలు రెడీ. వీటిని నైవేద్యంగా పెట్టొచ్చు. ఫ్రిడ్జిలో కూడా వీటిని స్టోర్ చేయొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ వినాయక చవితికి మీరు కూడా ఈ టేస్టీ రెసిపీలు చేసే.. నైవేద్యంగా పెట్టేయండి. 


Also Read : కృష్ణాష్టమి స్పెషల్ డ్రై ఫ్రూట్స్ కొబ్బరి లడ్డూ.. పంచదార లేకుండా హెల్తీగా చేసేయండిలా