ఉప్పు ఆహారానికి రుచిని ఇచ్చే పదార్థం. ఎంతటి అద్భుతమైన వంటకమైనా సరే ఉప్పు లేకపోతే అది రుచి పచీ లేకుండా పోతుంది. అందుకే ఉప్పులేని పప్పు అనే సామెత కూడా ఉంది. ఉప్పు కేవలం రుచిని పెంచేందుకు మాత్రమే కాదు ఇది జ్యోతిషం, వాస్తు శాస్త్రాల్లోనూ ప్రత్యేక స్థానం కలిగి ఉంది. ఇంట్లో కొన్ని ప్రత్యేక పద్ధతుల్లో ఉప్పును ఉపయోగించి వాస్తు దోషాలను, నెగెటివిటీని తొలగించడం సాధ్యమవుతుందని శాస్త్రంలో కూడా చెప్పారట. ఉప్పును నెగెటివిటిని తొలగించేందుకు ఏ విధంగా ఉపయోగించవచ్చో ఇక్కడ తెలుసుకుందాం.
ఉప్పుతో అనుబంధాలు బలోపేతం
కుటుంబ సభ్యుల మధ్య, లేదా స్నేహితులు, బంధువులతో తరచుగా వాదోపవాదాలు జరుగుతుంటే రాక్ సాల్ట్ దీనినే సైంధవ లవణం అని కూడా అంటారు. దాన్ని ప్రధాన ద్వారం రెండు వైపుల చిన్న చిన్న గిన్నెల్లో వేసి పెట్టాలి. అందంగా కనిపించేందుకు రంగులు కూడా కలిపి వాడవచ్చు. ఇది అనుబంధాలను పెంపొందిస్తుంది. ప్రేమాభిమానాలను పెంపొందిస్తుంది. ఈ చిన్న పరిహారం జీవితంలో పెద్ద మార్పు తెస్తుందని శాస్త్రం చెబుతోంది.
చెడు దృష్టి నుంచి కాపాడుతుంది
చెడు దృష్టి వల్ల అనుబంధాలు చెడిపోవడం, ఆనారోగ్యాలు కలగడం వంటి దుష్ప్రభావాలు ఉంటాయి. ముఖ్యంగా పసి పిల్లలు ఇలా చెడు దృష్టి వల్ల చాలా ఇబ్బంది పడుతుంటారు. దిష్టి తీసేందుకు ఉఫ్పును అనాదిగా వాడుతుంటారు. పిడికెడు ఉప్పు తీసుకుని తిప్పి పడేస్తుండడం మనం చాలా చోట్ల చూస్తూనే ఉంటాము. ఉప్పు చెడు దృష్టిని తొలగిస్తుంది.
వాస్తు దోషాలకు
ఇంట్లో ఏర్పడిన నెగెటివిటిని ఉప్పు తొలగిస్తుంది. ఉత్తరం లేదా ఈశాన్యం వైపున బాత్రూమ్ లు ఉండకూడదు. ఇలాంటి సందర్భాల్లో గిన్నెలో ఉప్పు తీసుకుని దిక్కులను సంతులన పరిచేందుకు ఆయా దిక్కుల్లో ఉంచడం అవసరం.
ఆరోగ్యం కాపాడుతుంది
కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నా లేదంటే డిప్రెషన్ వంటి మానసిక సమస్యలతో బాధపడుతున్నట్టయితే ఒక గిన్నెలో ఉప్పు నింపి అనారోగ్యంతో ఉన్నవారికి దగ్గరగా పెడితే వారిలోని నెగెటివిటిని తొలగించి వారు త్వరగా కోలుకునేందుకు దోహదం చేస్తుంది.
నెగెటివ్ ఆలోచనలు తొలగిస్తుంది
నెగెటివ్ ఆలోచనలు అదేపనిగా వేధిస్తుంటే ఒక చిటికెడు సైంథవ లవణం స్నానం చేసే నీటిలో కలుపుకుని స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. క్రమంగా ఇలాంటి ఆలోచనలు తగ్గి సంతోషకరమైన జీవితం లభిస్తుంది.
పరిసరాల్లో నెగెటివిటి తగ్గిస్తుంది
ఇంట్లో ప్రశాంతత లోపించి ఇంట్లో ఎప్పుడూ కుటుంబ సభ్యుల మధ్య చిన్నచిన్న విషయాలకు వాదనలు జరుగుతుంటే, ఇంట్లో ఆర్థికి ఇబ్బందులు వేధిస్తుంటే, అకారణ ఖర్చులు ఎదురవుతున్నాయంటే ఇంట్లో ఏదో నెగెటివిటి ప్రభావం ఉందని అర్థం. ఇల్లు తుడిచే నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి ఇల్లు శుభ్రం చేస్తే ఇంట్లో నుంచి నెగెటివిటి దూరం అవుతుంది. ఉప్పుతో ఇంట్లో పాజిటివిటి ఆవరించడం మాత్రమే కాదు నెగెటివిటీ దూరం అవుతుంది కూడా.
ఇలా పిడికెడు ఉప్పును విరివిగా ఉపయోగించి ఇంట్లో చేరిన నెగెటివిటిని దూరం చెయ్యడం చిటికెలో పని అని జ్యోతిషం, వాస్తు చెబుతున్నాయి. చిన్నచిన్న చిట్కాలే కనుక పాటించడం కూడా చాలా సులభం.
Also Read: సముద్ర నురుగుతో గణేషుడు.. దర్శించుకున్నారా ఎప్పుడైనా!