Politics On Gudlavalleru Engineering College Issue : గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్న విద్యార్థినుల వీడియోలు తీశారని వాటిని అమ్మారని రకరకాల ప్రచారాలు  చేస్తున్నారు. పోలీసులు ఒక్కటంటే ఒక్క వీడియో లేదని..కెమెరాలు కూడా కనపించలేదని స్పష్టం చేశారు. కానీ ఏపీలోని కొన్ని సోషల్ మీడియా విభాగాలు, కార్యకర్తలు మాత్రం.. మూడు వందల మంది వద్యార్థినుల బాత్ రూమ్ దృశ్యాలు ఉన్నాయని ప్రచారం చేసేస్తున్నారు. దీంతో ఆ కాలేజీ విద్యార్థులు మానసిక క్షోభకు గురవుతున్నారు.  విద్యార్థి సంఘాల పేరుతో కొంత మంది .. మరింత రగడ సృష్టిస్తున్నారు. అందరూ ఎవరికి వారు రాజకీయం చేసుకంటున్నారు కానీ.. ఆ విద్యార్థినుల భవిష్యత్ గురించి ఆలోచించడం లేదు. 


ఆ విద్యార్థినుల భవిష్యత్ పణంగా పెట్టి రాజకీయం


ఏపీలో ఏం జరిగినా రాజకీయమే. గుడ్లవల్లేరు ఇంజినరింగ్ కాలేజీ. ప్రైవేటు విద్యాసంస్థ. ప్రభుత్వానిది కాదు. అక్కడ అంతర్గతం ఏం జరిగినా యాజమాన్యమే బాధ్యత వహంచాలి. ప్రైవేటు కాలేజీ హాస్టల్లో బాత్ రూమ్‌లో కెమెరాలు పెట్టారని ఓ పుకారును  రేపారు. అదే నిజం అనుకుని స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు. ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయం వచ్చి చేరిపోయింది. పోలీసులు వచ్చి మొత్తం సెర్చ్ చేశారు. ఎక్కడా కెమెరాలు కనపించలేదు. చివరికి బాత్ రూమ్ లైట్లు సహా మొత్తం ఓపెన్ చేశారు. అయితే.. ఏమీ లేకపోయినా ఆ చెక్ చేసిన దృశ్యాలే చూపి కెమెరాలు అని ప్రచారం చేస్తున్నారు. అదే విద్యార్తల ఫోన్లు, ల్యాప్ ట్యాప్‌లు అన్నీ  స్వాధీనం చేసుకుని విద్యార్థుల సమక్షంలోనే ఓపెన్ చేసి చూపించారు. ఒక్క ఫోన్ కూడా  దృశ్యాలు కనిపించలేదు. దీంతో  పోలీసులు అధికారిక స్టేట్‌మెంట్ ఇచ్చారు. అసలు కెమెరాలు లేవని  రికార్డు చేయలేదని స్పష్టం చేశారు. 


దొరికేసిన దువ్వాడ- రోడ్డు ప్రమాదాన్ని ఆత్మహత్యగా చెప్పాలంటూ మాధురికి బ్రీఫింగ్‌


వీడియోలంటూ అదే పనిగా తప్పుడు ప్రచారం


నిజానికి ఏదైనా  ఓ కాలేజీలో ఎవరైనా ఓ విద్యార్థి అసభ్యకరమైన వీడియో బయటకు వచ్చిందంటే.. అది ఎంత వైరల్ అవుతుందో చెప్పాల్సిన పని లేదు. అలాంటిది మూడు వందల వీడియోలు  అని లెక్క తేల్చినట్లుగా చెబుతున్నారు.  కానీ ఎవరి దగ్గర ఒక్క వీడియో లేదు. మామూలగా అయితే వీడియోలు వైరల్ అయ్యేవి. కానీ అలాంటివేీ లేకపోవడం.. విద్యార్థుల ఫోన్లు, ల్యాప్ ట్యాపుల్లోనూ లేకపోవడంతో.. విద్యార్థినులకు ధైర్యం వచ్చింది. అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మత్రం వారిని.. వారి కుటుంబసభ్యులను ఆందోళనకు గురి చేస్తోంది. వారిని బద్నాం చేయడం వల్ల ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరగుతుందని అనుకుంటున్నారు. కానీ... మూడు వందల మంది ఆడపిల్లల భవిష్యత్ గురించి ఈ సాషల్ మీడియా రాజకీయ పార్టీల కార్యకర్తలు ఆలోచించడం లేదు. లేని విషయాన్ని అదే పనిగా ప్రచారం చేసేందుకు వెనుకాడటం లేదు. 


జెత్వానీపై పెట్టింది తప్పుడు కేసేనా - భూమి అమ్మకం అగ్రిమెంట్ చేసుకోలేదన్న నాగేశ్వరరరాజు - ఏం జరగబోతోంది ?


అరెస్టులు చేస్తున్న పోలీసులు  


గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థినుల విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై పోలీసులు కేసులు పెడుతున్నారు. అరెస్టు చేస్తున్నారు. కానీ జరిగిపోయిన నష్టంపై వారేమ చేయలేరు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఉండేవారికి కనీస   బాధ్యత లేకుండా ఏదైనా ప్రచారం చేసే స్వేచ్చ ఉంది. పోలీసులు అధికారికంగా చెప్పిన దాన్ని కూడా వక్రీకరించి.. వారి పైనే నిందలు వేసి ప్రచారం చేస్తున్నారు. పోలీసులు చెప్పిన దానికి భిన్నంగా సాక్ష్యాలు ఉంటే చెప్పడం ఓ ఎత్తు అయితే వీడియోలు ..వీడియోలు అండూ బద్నాం చేయడం మరో ఎత్తు. మొత్తంగా ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితులు.. గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్న ఆడపిల్లల భవిష్యత్ కు పెను ప్రమాదం మాత్రం కనిపిస్తోంది.