Is False case has been filed against heroine jetwani :  హీరోయిన్ నత్వానపై తప్పుడు కేసు పెట్టారన్న ఆరోపణలకు బలం చేకూర్చే ఘటనలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయ. ఆమెపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో ప్రధాన సాక్షిగా నాగేశ్వరరాజు అనే వ్యక్తి ఉన్నారు. ఆయనకు నత్వానీ కుక్కల విద్యాసాగర్ కు చెందిన భూమిని అమ్మకానికి పెట్టిందని ఆరోపణ. ఈ ఆరోపణ పేరుతోనే వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందుకే ఆ నాగేశ్వరరాజును ప్రధాన సాక్షిగా చేశారు. కానీ ఆయన అసలు తనకు ఆ ఫిర్యాదు సంగతి తెలియదని.. నత్వానీ తనకు  భూమి అమ్మజూపలేదని.. ఆమెకు తాను రూ. ఐదు లక్షలు ఇవ్వలేదని చెబుతున్నారు. దీంతో కేసు కొత్త మలుపు తిరిగినట్లయింది. 


ముంబై నటితో ఎలాంటి లావాదేవీలు నిర్వహించలేదన్న ప్రధాన సాక్షి          


హీరోయిన్ నత్వానీ  తమకు భూమి అమ్మజూపలేదని తాము ఎటువంటి నగదు ఆ నటికి ఇవ్వలేదని కూచిపూడికి చెందిన నాగేశ్వరరారాజు పోలీస్ కమిషనర్ కు  తెలిపారు.  టీటీడీ దర్శనం టిక్కెట్లు ఇప్పిస్తామంటే కుక్ల  విద్యాసాగర్ కు ఆధార్ కార్డులు ఇచ్చామని అంతే తప్ప . హీరోయిన్ నత్వానీ ఎవరో.. ఆమె తమకు భూమి అమ్మేందుకు ఒప్పందం చేయడం ఏమిటో అసలు తెలియదని స్పష్టం చేశారు.  ముంబయి నటి జెత్వానీ తమ భూమిని అక్రమంగా నాగేశ్వరరాజుకు అమ్మాలని ప్రయత్నించిందని ఫోర్జరీ చేసిందని  ఇబ్రహీంపట్నం పోలీసులకు కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు మేరకే.. ఆమెను ముంబైకి వెళ్లి  పోలీసులు అరెస్టు చేసి తీసుకు వచ్చారు. 


హీరోయిన్ జత్వానీ కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి - ఆయన పాత్ర ఉందా ? ఇరికిస్తున్నారా ?


తమ పేర్లతో  కుక్కల విద్యాసాగర్ తప్పుడు కేసులు పెట్టారని పోలీసులకు ఫిర్యాదు            
 
తన భూమికి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారని నటి జెత్వానీపై విద్యాసాగర్ ఆరోపణలు చేశారు. నాగేశ్వరరాజుకు భూమి అమ్మేందుకు నటి యత్నించారని...నాగేశ్వరరాజు, ఆయన అల్లుడు భరత్ కుమార్ వద్ద ఐదులక్షలు తీసకున్నరాని కేసులు పెట్టారు. అందుకే వీరిద్దరినీ కీలక  సాక్షులుగా చేర్చారు. తాజాగా  తాజాగా నటి తమకు భూమి అమ్మలేదని నాగేశ్వరరాజు స్పష్టం చేశారు. విద్యాసాగర్ పై ఫిర్యాదు చేశారు. తప్పుడు కేసు తమ  పైకి వస్తుందని తేలడంతో వీరిద్దరూ ఇలా పోలీసుల్ని ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది. 


వేధింపులపై విజయవాడ సీపీకి ఫిర్యాదు చేసిన ముంబై నటి కాదంబరి జెత్వానీ


కీలక మలుపులు తిరుగుతున్న ముంబై నటిపై వేధింపుల కేసు        


ముంబైలో ఉండే సినీ నటి నత్వానీపై గత ఫిబ్రవరిలో కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదుపై .. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ముంబైకి వెళ్లి అరెస్టు చేసి తీసుకు వచ్చారు. అయితే మొత్తం కుటుంబాన్ని అరె్స్ట్ చేసి తీసుకు రావడం ..నలభై రోజుల పాటు నిర్బంధించడం.. అసలు ఈ విషయాన్ని బయటకు తెలియకుండా చేశారు. ఇటీవల ఈ విషయం  బయటపడటంతో పోలీసు అధికారుల తీరుపై విమర్శలు వచ్చాయి. ఓ పారిశ్రామిక వేత్తపై నత్వానీ పెట్టిన అత్యాచారం కేసు సెటిల్ చేసేందుకే నటిపై తప్పుడు కేసు పెట్టి తీసుకొచ్చి వేధించారన్న ఆరోపణలు వస్తున్నాయి.