Jr NTR Devara Movie Pre Sale Business Details: మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ ఎన్టీఆర్‌ మోస్ట్‌ అవైయిటెడ్‌ మూవీ 'దేవర'. ఆచార్య ఫ్లాప్‌ తర్వాత దర్శకుడు కొరటాల శివ అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్‌ ఇండియాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జనతా గ్యారేజ్‌ వంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ తర్వాత వీరద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా నుంచి వస్తున్న అప్‌డేట్స్‌, సాంగ్స్ మూవీపై మరింత బజ్‌ క్రియేట్‌ చేశాయి.


ఇప్పటి వరకు విడుదలైన రెండు పాటలకు భారీ రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచాయి. రీసెంట్‌గా ఇందులో ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు మూవీ టీం అధికారికంగా ప్రకటించింది. ఇలా వరుసగా క్రేజీ అప్‌డేట్స్‌ ఇస్తూ మూవీ రోజురోజుకు బజ్‌ పెంచుతుంది మూవీ టీం. ఇక సినిమా సెప్టెంబర్‌ 27న వరల్డ్‌ వైడ్‌గా గ్రాండ్‌గా విడుదల కానున్న సంగతి తెలిసిందే.  ఇక సినిమా విడుదలకు ఇంకా 27 రోజులు మాత్రమే ఉంది. దీంతో ఓవర్సిస్‌లో అప్పుడే అడ్వాన్స్‌ బుక్కింగ్స్‌ కూడా ఒపెన్‌ చేశారు. ఇలా ఓపెన్‌ అయిన కొన్ని గంటల్లోనే టికెట్స్‌ భారీగా అమ్ముడుపోయాయి.


Also Read: క్యారవాన్‌లో సీక్రెట్‌ కెమెరాలు పెట్టి, ప్రైవేట్‌ వీడియోలు చిత్రీకరించారు - నటి రాధిక సంచలన కామెంట్స్‌


కొన్ని థియేటర్లో అయితే గంటల్లోనే హౌజ్‌ఫుల్‌ బోర్డు కూడా పెట్టాశారట. అడ్వాన్స్‌ బుక్కింగ్స్‌లో దేవరకు వస్తున్న రెస్పాన్స్‌ చూసి ట్రేడ్‌ వర్గాలు సైతం సర్‌ప్రైజ్‌ అవుతున్నాయి. నెల రోజుల ముందే ప్రీ సేల్స్‌లో ఈ రేంజ్‌లో బిజినెస్‌ జరగడం చూస్తుంటే యూఎస్‌లో దేవర క్రేజ్‌ ఏ రేంజ్‌లో ఉందో అర్థమైపోతుంది. ఈ క్రేజ్‌ ఇలాగే కొనసాగితే ప్రీ సేల్‌ బిజినెస్‌లో దేవర సరికొత్త రికార్డు నెలకొల్పడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు. అయితే, డల్లాస్ లోని XD బుకింగ్స్ ఇలా ఓపెన్ చేస్తే అలా ఫస్ట్ టికెట్స్‌ అని అమ్ముడుపోయాయట.  యూఎస్‌లో దేవర ప్రీ సేల్స్‌ బిజినెస్‌ చూస్తే ఇలా ఉంది.







19లొకేషన్స్‌లో 52 షోలకు 2407 టిక్కెట్లు బుక్ అయ్యాయట. అలా మొత్తంగా అక్కడ 75,727 డాలర్స్‌ బిజినెస్‌ జరిగింది. దీంతో దేవర అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో ప్రీ సేల్ బిజినెస్ 100K డాలర్ల గ్రాస్ జరిగినట్టు సమాచారం.  అడ్వాన్స్ బుకింగ్స్ లో సినీమార్క్ సినిమాస్ మొదట స్థానంలో ఉండగా.. ఆపిల్ సినిమాస్ తర్వాతి స్థానంలో ఉందని సమాచారం. ఇక ప్రీమియర్స్ కు 27 రోజుల ముందు ఈ స్థాయి బుకింగ్స్ అంటే రిలీజ్ నాటికి దేవర బాహుబలి, కేజీయఫ్‌, కల్కి వంటి చిత్రాల రికార్డు బ్రేక్‌ చేయడం పక్కా అంటున్నాయి ట్రేడ్ వర్గాలు అంచనావేస్తున్నాయి. 


Also Read: టాలీవుడ్‌లోనూ హేమ కమిటీలాంటిది ఏర్పాటు చేయండి - సీఎం రేవంత్ రెడ్డికి సంచలన లేఖ రాసిన సమంత