హేమ కమిటీ రిపోర్టు సీనియర్‌ నటి రాధిక శరత్‌ కుమార్‌ స్పందించారు. మలయాళ ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులపై జస్టిస్‌ హేమ కమిటీ ఇచ్చిన నివేదికను ఇటీవల కేరళ ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో ఎన్నో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. ప్రస్తుతం హేమ కమిటీ రిపోర్టు సినీ ఇండస్ట్రీని కుదిపేస్తుంది. ముఖ్యంగా మాలీవుడ్‌లో ప్రకంపలు సృష్టిస్తుంది. సినీ ప్రముఖులంతా ఈ కమిటీ రిపోర్టుపై స్పందిస్తూ భగ్గమంటున్నారు.


ఎందరో నటీమణలు సైతం భారీ ఎత్తున బయటకు వచ్చి తమకు ఎదురైన చేదు అనుభవాలపై నోరు విప్పుతున్నారు. దీంతో దక్షిణాది ఇండస్ట్రీలో హేమ కమిటీ రిపోర్టు సంచలనంగా మారింది. బాధితులకు మద్దతుగా మాలీవుడ్‌ సినీ ప్రముఖులతో పాటు కోలీవుడ్‌, టాలీవుడ్‌కు చెందిన నటీనటులు ముందుకు వస్తున్నారు. వారందరిని మనం అండగా ఉండాలని, న్యాయం జరిగేలా చూడాలిని పిలుపునిస్తున్నారు. ఇప్పటికే దీనిపై నటి ఖుష్బూ, హీరోయిన్‌ సమంతతో పాటు మరికొందరు స్పందించారు.


మలయాళం ఇండస్ట్రీలోనే కాదు అన్నిచోట్లా ఉంది


తాజాగా నటి రాధిక తన గళం విప్పారు. మాలయాళ పరిశ్రమలోనే కాదు అన్ని చోట్ల ఇలా పరిస్థితులే ఉన్నాయన్నారు. అయితే సినీ పరిశ్రమలో ఇవి కాస్తా ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇండస్ట్రీలో ఎలా ఉందంటే నటీమణుల క్యారవాన్‌లో సీక్రెట్‌ కెమెరాలు పెట్టి.. ప్రైవేటు వీడియో చిత్రీకరించి సందర్భాలు చూశానంటూ సంచలన కామెంట్స్‌ చేశారు."46 ఏళ్ల నుంచి నేను ఈ పరిశ్రమలో ఉన్నా. అన్ని చోట్లా మహిళలు వేధింపులు ఎదురవుతున్నాయనేది నా అభిప్రాయం.


క్యారవాన్ లో సీక్రెట్ కెమెరాలు


ఇక చిత్ర పరిశ్రమలో మహిళలకు ఇలాంటి పరిస్థితులు రావడం నిజంగా దురదృష్టకరం. అయితే గతంలో ఆమె నటించి ఓ మలయాళ మూవీ సెట్లో జరిగిన ఓ సంఘటనను నేను ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నా. ఓ రోజును నేను షాట్‌ ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్తున్న. అక్కడే కొందరు బాయ్స్‌ గుంపు కూర్చోని ఫోన్‌లో ఎదో చూస్తూ నవ్వుకుంటూ కనిపించారు. ఏదో వీడియో చూస్తున్నారని నాకు అనిపించింది. అయితే నేను మా మూవీ టీం సంబంధించిన ఓ వ్యక్తిని పిలిచి అక్కడ ఏం జరుగుతుందని అడిగాను. దానికి అతడు చెప్పింది విని షాక్‌ అయ్యా. క్యారవాన్‌లో సీక్రెట్‌ కెమెరాలు పెట్టి.. మహిళల ప్రైవేటు వీడియో చిత్రీకరించిన వాటిని ఫోన్‌లో చూస్తున్నారని చెప్పారు.



అది తెలిసి నేను ఒక్కసారిగా షాక్‌ అయ్యాను. దీనిపై వెంటనే నేను మూవీ యూనిట్‌కి ఫిర్యాదు చేశా. క్యారవాన్‌లో మరోసారి సీసీ కెమెరాలు పెడితే బాగుండదని, వారికి తగి బుద్ది చెబుతానని వార్నింగ్‌ ఇచ్చాను. కానీ, ఆ తర్వాత నాకు క్యారవాన్‌కు వెళ్లాలన్నా, దానికి ఉపయోగించాలంటనే భయం వేసింది. ఎక్కడికైన బయట షూటింగ్‌కి వెళ్లినప్పుడు ఆడవాళ్లు బట్టలు మార్చుకోవాలన్నా, విశ్రాంతి తీసుకోవడానికి, భోజనం చేయడానికి  అదే మా ప్రైవేట్‌ ప్లేస్‌. దానిలోనూ ఇలా సీసీ కెమెరాలు పెట్టి సెక్యూరిటీ లేకుండా చేస్తున్నారు" అని షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. 



Also Read: టాలీవుడ్‌లోనూ హేమ కమిటీలాంటిది ఏర్పాటు చేయండి- సీఎం రేవంత్ రెడ్డికి సంచలన లేఖ రాసిన సమంత