Black Rice Health Benefits: తాజాగా ఢిల్లీలో జరిగిన వ్యవసాయ ఆర్థికవేత్తల అంతర్జాతీయ సదస్సు(ఐసీఏఈ)ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా తక్కువ నీటిలో ఎక్కువ దిగుబడి సాధించే పంటలపై దృష్టి పెట్టాలని ఆయన దేశ రైతాంగాన్ని కోరారు. బ్లాక్ రైస్, తృణధాన్యాల సాగుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ‘బ్లాక్ రైస్’ను సూపర్ ఫుడ్ గా అభివర్ణించారు. మణిపూర్, అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లో పండించే బ్లాక్ రైస్ లో బోలెడు ఔషధ విలువలు ఉన్నాయన్నారు. బ్లాక్ రైస్ తో ఆరోగ్యంతో పాటు రైతులకు ఆర్థిక పరిపుష్టి కలుగుతుందన్నారు. ఇంతకీ ఈ బ్లాక్ రైస్ ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
బ్లాక్ రైస్ లో బోలెడు పోషక విలువలు
బ్లాక్ రైస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. జపాన్, థాయ్‌లాండ్, చైనా, ఇండోనేషియా లాంటి దేశాలలో పండిస్తారు. భారత్ లోనూ ఈశాన్య రాష్ట్రాల్లో బ్లాక్ రైస్ ను సాగు చేస్తున్నారు. బ్లాక్ రైస్ లో ఆంథోసైనిన్ అధికంగా ఉంటుంది. ఆరోగ్యానికి తోడ్పడే కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్ లాంటి పోషకాలను కూడా కలిగి ఉంటుంది. ఇతర బియ్యంతో పోల్చితే బ్లాక్ రైస్ ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగిస్తుంది. వంద గ్రాముల బ్లాక్ రైస్ లో 79.1 గ్రాముల కార్బోహైడ్రేట్‌లు, 4.7 గ్రాముల ఫైబర్, 11.6 గ్రాముల ప్రోటీన్, .67 mg ఐరన్ లభిస్తుంది.
బ్లాక్ రైస్ తో ఆరోగ్య ప్రయోజనాలు
1. బ్లాక్ రైస్ లోని ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ప్రేగు కదలికలను ప్రోత్సహించి.. మలబద్ధకాన్ని నివారించడంలో సాయపడుతుంది. గట్ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.
2. బ్లాక్ రైస్ యాంటీ డయాబెటిక్ లక్షణాలను కలిగి ఉంది. బ్లాక్ రైస్‌లోని ఆంథోసైనిన్స్ లో బోలెడు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. బ్లాక్ రైస్ తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ స్థాయిలను తగ్గించి, మధుమేహ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
3. బ్లాక్ రైస్‌లోని యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. హృదయనాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అంతేకాదు, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో బ్లాక్ రైస్ సాయపడుతుంది.
4. బ్లాక్ రైస్ లోని యాంటీ ఆక్సిడెంట్లు నిర్విషీకరణను పెంచుతాయి. కాలేయ పనితీరును మెరుగు పరుస్తాయి. బాడీలోని విషాన్ని పదార్థాలను బయటకు పంపుతుంది.
5. బ్లాక్ రైస్ లోని యాంటీఆక్సిడెంట్లు మెదడు కణాలను ఆక్సీకరణ ఒత్తిడి, వాపు నుంచి కాపాడుతాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని పెంచడంతో పాటు న్యూరోడెజెనరేటివ్ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. బ్లాక్ రైస్ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
6. బ్లాక్ రైస్‌లో లుటిన్, జియాక్సంతిన్, లైకోపీన్, బీటా-కెరోటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి. లుటీన్, జియాక్సంతిన్ కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. హానికరమైన అతినీలలోహిత కిరణాల నుంచి కళ్ళను రక్షిస్తాయి.
7. బ్లాక్ రైస్ లోని ప్రొటీన్ కండరాల మరమ్మత్తు, పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. బ్లాక్ రైస్ లో పెద్దమొత్తంలో ఉన్న అమైనో ఆమ్లాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
8. బ్లాక్ రైస్ ఆక్సీకరణ ఒత్తిడి నుంచి కాపాడుతుంది. క్యాన్సర్ తో పోరాడే శక్తి బ్లాక్ రైస్‌కు ఉంది. ఇది ఆక్సీకరణ ఒత్తిడి నుండి కణాలను రక్షిస్తుంది. క్యాన్సర్‌తో సహా దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ ను అదుపు చేస్తుంది.
9. బ్లాక్ రైస్‌లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తాయి. దీనిలోని ఆంథోసైనిన్లు UV కిరణాలు, కాలుష్యం నుంచి చర్మాన్ని రక్షించడంలో సహాయపడతాయి. ముడతలు, వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది.
10. బ్లాక్ రైస్ లోని ఫైబర్ బరువు తగ్గడంలో సహాయపడుతుంది. శరీరంలో క్యాలరీలను తగ్గించడంలో సాయపడుతుంది. బరువు అదుపు చేయడంలో ఉపయోగపడుతుంది.
బ్లాక్ రైస్ తో సైడ్ ఎఫెక్ట్స్
బ్లాక్ రైస్ తో లాభాలతో పాటు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి.
1. బ్లాక్ రైస్ లోని పైబర్ ఎక్కువగా ఉంటుంది. అధికంగా బ్లాక్ రైస్ తీసుకోవడం వల్ల గ్యాస్, ఉబ్బరం, మలబద్ధకం లాంటి సమస్యలను కలిగిస్తుంది.
2. కొంతమందిలో బ్లాక్ రైస్‌కు అలెర్జీని కలిగిస్తుంది. దురద, వాపును కలిగిస్తుంది.
3. బ్లాక్ రైస్ లోని అధిక కేలరీలు బరువు పెరిగేందుకు కారణం అవుతాయి.
Read Also: యువతలో పెరుగుతున్న గుండెపోటు మరణాలు - ఈ లక్షణాలు కనిపిస్తే అప్రమత్తం కావాల్సిందే!