డేర్ డెవిల్ స్టంట్ ఇది. రెండు విమానాలు గాల్లో ఉండగానే పైలెట్లు తమ స్థానాలను స్వాప్ చేసుకోవాలనుకున్నారు. అంటే మొదటి విమానంలోకి రెండో పైలెట్, రెండో విమానంలోకి మొదటి పైలెట్ వెళ్లాలన్నది ప్లాన్. ఈ డేంజరస్ స్టంట్‌కు రెడ్ బుల్ సంస్థ స్పాన్సర్ చేసింది. రెండు విమానాల్లో అరిజోనాకు చెందిన కజిన్స్ ఆండీ, ల్యూక్‌లు స్టంట్ ప్రారంభించారు. ఇద్దరు గాల్లో ఎగురుతున్నప్పుడే విమానం ఇంజిన్లను ఆపి ‘నోస్ డైవ్‌’లో వదిలేశారు. ఇద్దరూ ఒకేసారి విమానం నుంచి దూకేశారు.  దాదాపు 12,100 అడుగుల నుంచి పారాచూట్ ల సాయంతో దూకారు. వారు వేసుకున్న ప్లాన్ ప్రకారం పారాచూట్ తో విమానాల్లోకి మళ్లీ ప్రవేశించాలి. కానీ వారు అనుకున్నట్టు అంతా జరుగలేదు. ఊహించనిదే జరగడమే కదా జీవితం.  అరిజోనా దగ్గరి ఎడారుల్లో ఈ స్టంట్ నిర్వహించారు. 


ల్యూక్ పారాచూట్ సాయంతో దూకి కిందపడుతున్న ఆండీకి చెందిన విమానంలోకి చేరుకున్నాడు. దాని ఇంజిన్ ఆన్ చేసి తిరిగి ఆధీనంలోకి తెచ్చుకున్నారు. కానీ ఆండీ మాత్రం పట్టు కోల్పోయాడు. అతను ల్యూక్ విమానాన్ని చేరుకోలేకపోయాడు. దీంతో ఆ విమానం కిందపడి పేలిపోయింది. ఆండీ పారాచూట్ సాయంతో ప్రాణం కాపాడుకుని కిందకి దిగాడు. ల్యూక్ మాట్లాడుతూ ‘నేను ఆండీకి చక్కటి విమానాన్ని వదిలేశానని అనుకున్నాను. కానీ ఇలా జరిగింది. ఈ పరిస్థితిని ఉత్తమంగా మార్చేందుకు నేను చేయగలిగింది చేస్తాను’ అని అన్నాడు. 


ఈ డేర్ డెవిల్ స్టంట్‌ను హులు టీవీ లైవ్ స్ట్రీమ్ కూడా చేశారు.నిజానికి ఈ స్టంట్ చేసేందుకు వారికి అనుమతులు కూడా రాలేదు. అయినా నిర్వహించారు. కాకపోతే ప్రాణహాని జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఈ ఘటనపై ఇన్వెస్టిగేషన్ ప్రారంభించింది.  నిర్వహించిన వారికి, పైలెట్లకు శిక్ష తప్పకపోవచ్చు.








Also read: మీకు ఈ బొమ్మలో ఏ జంతువు కనిపిస్తోంది? దాన్ని బట్టి మీ మెదడులో ఏ వైపు బాగా పనిచేస్తుందో చెప్పొచ్చు


Also read: పెళ్లికి వెళుతున్నారా? ఇలాంటి పెళ్లికూతుళ్లు చేసే పనికి మీరు బలైపోగలరు జాగ్రత్త