అమెరికాలో పెళ్లంటే పందిళ్లు, అరిటాకులు కనిపించవు, కానీ మిగతా సందడంతా సేమ్ టు సేమ్. అతిధుల డ్యాన్సులు, విందులు వినోదాలు అక్కడ కూడా వివాహం అదిరిపోతుంది. ఓ పెళ్లి కూతురు తన పెళ్లి మరింత కోలాహలంగా, సందడిగా జరగాలని కోరుకుంది. వచ్చే అతిధులు ఒళ్లు మరిచి డ్యాన్సు చేసేలా చేయాలనుకుంది. అందుకోసం ఆమె ఎంచుకున్న మార్గం చివరికి ఆమెను జైలుపాలయ్యేలా చేసింది. పాపం ఆ పెళ్లికి అతిధులు కక్కలేక మింగలేక తెగ ఇబ్బంది పడ్డారు. అసలేం జరిగిందంటే..


ఫ్లోరిడాలో 42 ఏళ్ల డాన్యా పెళ్లికి సిద్ధమైంది. అతిధులను భారీగా పిలిచింది. విందు వినోదాలు ఏర్పాటు చేసింది. తమకు ఆహారాన్ని కేటిరింగ్ చేసిన వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకుని, వండిన వంటల్లో మారిజునా అనే డ్రగ్ కలిపేలా చేసింది. పెళ్లి తంతు ముగిశాక. అతిధులంతా భోజనాలు కానిచ్చారు. తిన్నప్పట్నించి వారిలో ఎన్నో మార్పులు. ఒక అతిధికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించాడు. తాము తిన్న ఆహారంలో డ్రగ్స్ కలిసినట్టు అనుమానాన్ని వ్యక్తం చేశాడు. పోలీసులు రంగ ప్రవేశం చేసి, ఆహారంలో డ్రగ్స్ కలిసినట్టు గుర్తించారు. కొంత ఆహారాన్ని టెస్టుల కోసం తీసుకెళ్లారు. ఇక సూత్రధారి అయిన పెళ్లి కూతురని, పాత్రధారి అయిన కేటరర్‌ను అరెస్టు చేసి తీసుకెళ్లారు. మరిచిపోని గుర్తుగా మిగలాల్సిన పెళ్లిరోజు అతి చేష్టల వల్ల పెళ్లికూతురికి కాళరాత్రిగా మిగిలిపోయింది. 


పాపం అతిధులు...
అతిధుల్లో చాలా మంది అస్వస్థత పాలయ్యారు. కొంతమంది మత్తులో తూగిపడిపోతే, మరికొందరిని స్ట్రెచర్స్ మీద పడుకోబెట్టి తీసుకెళ్లారు. పెళ్లి కూతురు కూడా ఒంటి మీద తెలివి లేకుండా మత్తులో తూగుతూ పోలీసుల కళ్లపడింది. అతిధుల యూరిన్ టెస్టు చేశాక అందులో డ్రగ్స్ ఆనవాళ్లు బయటపడినట్టు గుర్తించారు. డ్రగ్స్ పడని 18 మంది అతిధులను ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది. పెళ్లికి పిలిచి మమ్మల్ని మోసం చేసిందంటూ కొందరు ఆమెపై కేసులు వేసేందుకు సిద్ధపడుతున్నారు.  ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయంటూ ఆమెపై మండిపడుతున్నారు. ఫ్లోరిడాలో ఇప్పుడు ఈ విషయమే టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. పెళ్లి కొడుకు గురించి మాత్రం ఎలాంటి సమాచారం బయటికి రాలేదు. పెళ్లి కూతురు మాత్రం డ్రగ్స్ కేసులో బాగా ఇరుక్కున్నట్టేనని తెలుస్తోంది. 



Also read: అసురక్షిత సెక్స్ వల్ల 17 లక్షల మందికి హెచ్ఐవీ, కలవరపెడుతున్న ఆర్టీఐ నివేదిక


Also read: ఎలన్ మస్క్‌ను వేధిస్తున్న ఆరోగ్య సమస్య ఇదే, అందుకేనేమో ఆయన ఆలోచనలు అంత స్పెషల్