లతా మంగేష్కర్ భౌతికంగా దూరమయి రెండు వారాలవుతోంది. కానీ ఆమె కనిపించని .. వినిపించని ప్రాంతం లేదు. ఎక్కడ మంద్రమైన సంగీతం వినిపిస్తున్నా అందులో అమె వినిపిస్తోంది. కనిపిస్తోంది కూడా. లతా మంగేష్కర్ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన గాయని అనే విషయంలో మరో అభిప్రాయం ఎవరికీ లేదు. దేశ ప్రజలకు అత్యంత ఇష్టమైన గాయనిగా ఆమె ఎలా ఎదిగారు ?. మహిళా గాయనీల్లో ఆమెకు సరిసాటి కాదు కదా దగ్గరగా ఉన్న వారు కూడా లేరు. ఆమె సోదరి అశాభోంస్లే కొంత కాలం పాటు ఆమెకు పోటీ ఇచ్చారు. ఆమె ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కానీ లతాజీ అంత కాదు. మగ  మగ ప్లేబ్యాక్ సింగర్లలో ముహమ్మద్ రఫీ మాత్రమే ప్రజాదరణలో ఆమెకు పోటీగా చెప్పుకోవచ్చు. లత "మెలోడీ క్వీన్" అయితే మహ్మద్ రఫీ "మెలోడీ కింగ్". కానీ రఫీ సాహిబ్ మరణించే సమయానికి ఆయన  వయసు కేవలం 55 సంవత్సరాలు మాత్రమే. ఆయన బతికి ఉంటే ఇంకా అందనంత ఎత్తుకు ెదిగి ఉండేవారేమో..! ఆశా భోంస్లేకు పెద్ద సంఖ్యలో ఫాలోయింగ్ ఉంది. కొంత మంది లతా మంగేష్కర్ కంటే ఆమె  బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెబుతూ ఉంటారు. కానీ కాస్త తరచి చూస్తే మనకు ఎక్కడైనా లతాజీ గొంతే గుర్తొస్తూ ఉంటుంది. 


లతా మంగేష్కర్ దేశ ప్రజల అభిమానాన్ని ఎంతగా పొందారనేదానికి ఉదాహరణ.. ఆమె చనిపోయి రెండు వారాలయినప్పటికీ దేశంలో ఇప్పటికీ అనేక చోట్ల ఆమె పేరుతో సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండటమే. లతా ముప్పై ఆరు భాషల్లో పాడారు. అయితే ఆమె కెరీర్ ప్రారంభించి ఉన్నత స్థాయికి వెళ్లే వరకూ కూడా ఏ భాషలో.. ఎన్నెన్ని పాడారో అన్నది నమోదు చేసుకోవడం జరగలేదు. అది వేరే విషయం. అయితే చాలా మంది గాయకులు ఒక్క భాషలోనే గొప్పగా పాడగలరని అనుకుంటారు. కానీ లతాజీ ఎన్ని భాషల్లో పాడినే అదే మాధుర్యాన్ని శ్రోతలకుపంచారు. ఆమె చనిపోయిన తర్వాత వివిధ భాషల్లో వచ్చిన నివాళి కార్యక్రమాలు, సోషల్ మీడియా పోస్టులే దీనికి ఉదాహరణ. 2004లో లతా మంగేష్కర్  75వ పుట్టినరోజు సందర్భంగా యష్ చోప్రా రాసిన కథనాన్ని బీబీసీ ప్రచురించింది. అందులో 50,000 పాటలు' పాడారని ప్రచురించారు. కానీ లెక్కలేదు కానీ ఆమె 1974లో 'సంగీత చరిత్రలో అత్యంత ఎక్కువ పాటలు రికార్డ్ చేయబడిన కళాకారిణి'గా గుర్తింపు పొందారు. అయినప్పటికీ అది వివాదాస్పదమైంది. ఈ వివాదాన్ని ఎలా పరిష్కరించారనేది పెద్ద కథ, కానీ 2011లో గిన్నిస్ బుక్ ఆశా భోంస్లే అత్యధిక సంఖ్యలో "సింగిల్ స్టూడియో రికార్డింగ్‌లు" కలిగిన సింగర్‌గా ప్రపంచ రికార్డును ప్రకటించింది. తమిళంతో సహా ఇతర భాషల్లో కూడా పాడి...  తెలుగు చిత్రాలలో ప్రముఖ నేపథ్య గాయని అయిన పులపాక సుశీల మోహన్‌కి 2016లో ఆ గౌరవం దక్కింది.


భారతదేశం ఎన్నో ప్రపంచ రికార్డులకు నిలయం. రికార్డుల పవర్‌హౌస్‌గా కూడా పేరు పొందింది. సినిమా సంగీత అభిమానులు మిలియన్ల సంఖ్యలో ఉన్నారు. అయినా లతా మంగేష్కర్ ఎన్ని పాటలు పాడారో ఎవరికీ తెలియకపోవడం ఆశ్చర్యం కలిగించవచ్చు. అయితే  ఇతర అంశాలలో కూడా ఆమెను 'నైటింగేల్ ఆఫ్ ఇండియా'గా విస్తృతంగా గుర్తిస్తారు. ఇది అద్భుతమే. 1960ల చివరలో భారతదేశంలోలో స్కూళ్లలో పాఠ్య పుస్తకాల్లో  'పంజాబ్ సింహం' లజపత్ రాయ్ అని, 'ఫ్రాంటియర్ గాంధీ'గా ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్  , సీఆర్ దాస్ 'దేశబంధు అని చదువుకున్నాం. అదే సమయంలో 'నైటింగేల్ ఆఫ్ ఇండియా' అంటే సరోజినీ నాయుడు అని మాత్రమే తెలుసు.  లతా మంగేష్కర్ కాదు. సరోజినీ నాయుడు ఒక స్వాతంత్ర్య సమర యోధురాలు, గాంధీకి అత్యంత సన్నిహితురాలు స్వాతంత్ర్యం తర్వాత యునైటెడ్ ప్రావిన్స్‌ల గవర్నర్‌. ఆమె ఒక గొప్ప కవయిత్రి కూడా. ఇంగ్లిష్‌లో భారతదేశపు ఉత్తమ కవయిత్రిగా పేరు తెచ్చుకున్నారు.  కానీ  సరోజినీ నాయుడు గాయని కాదు, కానీ ఆమె కవిత్వంలోని భావవ్యక్తీకరణ, సాహిత్యం, భావోద్రేక గుణాల వల్ల మహాత్ముడి నుంచి ఆమెకు 'భారత్ కోకిల' అనే బిరుదు సంపాదించి పెట్టింది. 


మహాత్మగాంధీకి ఇంగ్లిష్ సాహిత్యం, కవిత్వంతో చాలా అనుబంధం ఉంది. ఆయన సున్నితమైన సాహిత్యాన్ని ఎక్కువ ఇష్టపడతారు. ప్రత్యేకంగా జాన్ కీట్స్ 'ఓడ్ టు ఎ నైటింగేల్' ఆంగ్ల కవితా సంపుటం ఆయనకు బాగా నచ్చుతుంది. అయితే అదే స్థాయిలో లతా మంగేష్కర్ గొంతు భారతీయల హృదయాలను తాకింది. లతాజీ గొప్పదనాన్ని ఓ కవిత ద్వారా మనం మననం చేసుకోవచ్చు. 


నువ్వు మరణం కోసం పుట్టలేదు, అమర పక్షి!
ఆకలితో ఉన్న తరాలు నిన్ను మర్చిపోలేవు !
ఈ గడచిన రాత్రి నేను విన్న స్వరం వినిపించింది !
పురాతన రోజుల్లో రాజు, బంటు ఒకరే !


 పెర్సీ బైషే షెల్లీ అనే ప్రసిద్ధ రచయిత 'డిఫెన్స్ ఆఫ్ పొయెట్రీ'లో 'ఒక కవి ఒక నైటింగేల్" అనే కవితోల ఒకతను చీకటిలో కూర్చుని తన స్వంత ఆనందాన్ని పొందేందుకు పాడుకుంటాడు.  తీపి ధ్వనులతో ఒంటరితనం.. కనిపించని సంగీత విద్వాంసుని శ్రావ్యతతో ఉండే ఆ పాటను విని ఇతరులు ముగ్దులవుతారు. అతను ఎవరు.. ఎలా పాడారు..  ఎక్కడి నుంతి పాడారన్నది ఎవరికీ తెలియదు. అలా నైటింగేల్ అనేది ప్రాచుర్యంలోకి వచ్చిందనుకోవచ్చు. కానీ ఇక్కడ సరోజినీ నాయుడుకు 'నైటింగేల్ ఆఫ్ ఇండియా' అని సంబోధించడం కరెక్ట్ కాదని మహాత్ముడికి కూడా అర్థం అయింది. ఆందుకే ఆయన భారత్ కోకిల అని కూడా అభివర్ణించారు. కోకిల నైటింగేల్‌ను చాలా దగ్గరగా అంచనా వేసే పక్షి. ఇంకా చెప్పాలంటే, భారతదేశంలో బహుశా చాలా తక్కువ మంది మాత్రమే ఇలాంటి విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. కానీ నైటింగేల్ అనే పక్షుల్లో మగవి మాత్రమే పాడుతాయి. ఆడ పక్షులు అసలు పాడవు. మగ నైటింగేల్ పక్షి 1000కి పైగా విభిన్న ధ్వనులతో కూడిన విస్తారమైన మరియు ఆశ్చర్యపరిచే ధ్వనులను చేయగలదు. 


లతా మంగేష్కర్ నిస్సందేహం దేశం మెచ్చిన గాయని. దశాబ్దాలుగా ఆమె అగ్రస్థానంలో  ఉంది. ఆమె వాయిస్ ప్రపంచం ఎదుట దేశానికి ఓ  బ్రాండ్‌లా ఉంది. దశాబ్దాలుగా ఆమె ఎలా అగ్రస్థానంలో నిలిచిందో అందికీ తెలుసు. ఆమెకు 'బంగారు స్వరం' ఉంది. ఆమె పాట పాడితే ఆ పాటలో నటించే వారిలోనూ జీవం వస్తుందంటే అతిశయోక్తి కాదు. లతాజీ పాటలు పాడే సమయంలోనే పదాల అర్థాన్ని సంగ్రహించే బహుమతి లతాకు ఉందని  ఆమె జీవితచరిత్ర రచయిత నస్రీన్ మున్నీ కబీర్ చెప్పారు. లతా మంగేష్కర్‌కు  పట్టుదల, సంకల్పం, క్రమశిక్షణ ఉన్నాయి. 1940ల చివరలో మరియు 1960లలో సినిమాల్లో పాడాలంటే ఉర్దూ తెలుసుకోవాలి, లతా అది కూడా నేర్చుకున్నారు.   జావేద్ అక్తర్ ఇటీవలి ఇంటర్వ్యూలో ఉర్దూ పదాన్ని తప్పుగా ఉచ్చరించడాన్ని ఒక్కసారి కూడా వినలేదని లతా మంగేష్కర్ చెప్పారు. ఓ సారి సాహిత్యాన్ని చదవుకున్న పదిహేను నిమిషాల్లోనే, సంగీతం కూడా వినకుండా ఆమె పాటను పాడగలదని సంగీత దర్శకులకు తెలుసు.  లతకి ప్రత్యేకంగా స్వంతమైన ప్రావీణ్యం అది. జావెద్ అక్తర్ గొప్ప రచయిత ఆ పాటను లతాజీ పాడితే మరింత అర్థం వస్తుందంటే అతిశయోక్తి కాదు. 


స్వాతంత్ర్యం తర్వాత బాలీవుడ్ సినీ పరిశ్రమ విస్తరించడానికి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు కారణం అయ్యాయి.  మహల్; బర్సాత్; అందాజ్; బజార్; దులారి; పతంగా  వంటి సినిమాల్లో ఆమె పాటలు జన  బాహుళ్యంలోకి వెళ్లాయి. ఆమె ఫేవరేట్ సింగర్ అయ్యారు. ఓ రకంగా ఆ సమయంలో మహిళా ఉద్దరణ కూడా లతా మంగేష్కర్ ద్వారా జరిగిందని అనుకోవచ్చు.  భారతదేశం 1947లో స్వాతంత్ర్యం పొందింది.  1920-22లో గాంధీ యొక్క సహాయ నిరాకరణ ఉద్యమం మొదటిసారిగా మహిళలను వీధుల్లోకి తీసుకువచ్చింది. ఉప్పు మార్చ్,  సత్యాగ్రహాల్లో మహిళలు పాల్గొన్నారు. కానీ ఆ రోజుల్లోచాలా ఇతర అంశాలలో వెనుకనే ఉన్నారు. రాజ్యాంగం భారతీయ సమాజంలో మహిళలకు సమాన స్థానాన్ని కల్పించినప్పటికీ .. అప్పటికి ప్రజల్లో మహిళలంటే వంటింటి కుందేళ్లు అనే భావన బలపడిపోయింది. 1946-51 కమ్యూనిస్ట్ నేతృత్వంలోని తెలంగాణ తిరుగుబాటును ఉదాహరణకు తీసుకుంటే మహిళలు ముఖ్యమైన పాత్ర పోషించినప్పటికీ.. తిరుగుబాటు ముగిసిన తర్వాత మహిళా విప్లవకారులు తమ ఆయధాలు వదిలేసి వంటగదికి తిరిగి రావాలని వారి మగవారు కూడా ఆశించారని అధ్యయనాలు చెబుతున్నాయి. 


అలాంటి సమయంలో లతా మంగేష్కర్ కెరీర్ ప్రారంభించారు.  మొదటి చిత్రం మహల్ (1949)లో ఆమె వాయిస్ లో చాలా తేడా ఉంటుంది. లత పాడిన 'ఆయేగా ఆయేగా ఆనేవాలా', ఇది అందరినీ ఉర్రూతలూగించింది, హిందీ చలనచిత్ర పాట చరిత్రకారులు వాదించినట్లుగా  లతా మరియు ఆశా భోంస్లేల గురించి కొంత సమయం వరకు విన్న ప్రతి శ్రోతకి తెలిసినట్లుగా ఒక ప్రాథమిక విషయంలో సోదరీమణుల కళాత్మక పథాలలో గణనీయమైన వ్యత్యాసం ఉంది. లత గానం మరింత ఆత్మీయంగా ఉంటుంది. అశాభోంస్లే రొమాంటిక్ పాటలను ఎక్కువగా పాడారు. లత వ్యాంప్ పాటలు పాడదని అందరికీ తెలిసిందే, కానీ ఆశా కేవలం వ్యాంప్‌గా లేదా ముజ్రా పాటలు బాగా పాడగలవారిగా గుర్తింపు పొందారు. 


లత గొప్పదనం కేవలం ఆమె పాడిన పాటల వల్ల మాత్రమే రాలేదు. ఆమె పరిపూర్ణమైన స్వరం..  దోషరహిత ఉచ్ఛారణ, భావ వ్యక్తీకరణ, మనోహరమైన గానం ప్రతి పాట సోల్‌ని  అర్థం చేసుకోవడంలో మేధావి తనం ఇలా అన్నీ కలసి రావడం వల్ల ఆమెకు ఈ ఖ్యాతి దక్కింది. ఆశా దీదీని అర్థం చేసుకోవడానికి ఇంకా ఎంతో పరిశోధన చేయాల్సి ఉంటుంది.ఎందుకంటే అమె అసాధారణమైన ప్రతిభా మూర్తి.



( రచయిత : వినయ్ లాల్ , రైటర్,  బ్లాగర్, యూసీఎల్‌లో హిస్టరీ ప్రోపెసర్ )


[ డిస్‌క్లెయిమర్: ఈ వెబ్‌సైట్‌లో వివిధ రచయితలు మరియు ఫోరమ్ భాగస్వాములు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, నమ్మకాలు మరియు అభిప్రాయాలు వ్యక్తిగతమైనవి. ABP న్యూస్ నెట్‌వర్క్ Pvt Ltd యొక్క అభిప్రాయాలు, నమ్మకాలు మరియు అభిప్రాయాలను ప్రతిబింబించవు. ]