గుండె జబ్బులతో బాధపడేవారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒత్తిడి ఉండకూడదు, ధూమపానం, ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి. ఆహారం విషయానికి వస్తే ఉప్పు, నూనె, మసాలాలు తగ్గించాలి. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దదే ఉంటుంది. కొలెస్ట్రాల్ లేదా అధిక రక్తపోటు సమస్యలు ఉన్నవారు కూడా గుండె విషయంలో చాలా శ్రద్ధ వహించాలి. హృద్రోగులకు నూనె, వెన్న లేదా నెయ్యి ఎక్కువ ప్రమాదం. అందుకే వాటిని వీలైనంత వరకు దూరం ఉంచాలి.
ఆహార మార్పులు జీవనశైలి కారణంగా వయసు భేదం లేకుండా చిన్న వయసు వాళ్ళు కూడా గుండె జబ్బులు, హార్ట్ స్ట్రోక్స్‌తో ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే గుండెకి సంబంధించి ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కూరల్లో అధికంగా నూనె వేసుకుని వంటలు చేయడం వల్ల అది గుండెకి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది.
గుండె చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వలన స్ట్రోక్ వచ్చే సూచనలు ఉంటున్నాయి. అందుకే మనం తీసుకునే ఆహారం విషయంలో మార్పులు చేసుకుని జీవించాలి. అప్పుడే గుండె పదిలంగా మనం కూడా ఆరోగ్యంగా ఉంటాము. గుండె జబ్బుల వాళ్ళకి నూనె లేదా వెన్న రెండింటిలో ఏది ఉత్తమం అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది. గుండె పరిస్థితుల ప్రమాదాన్ని ఓడించటానికి ప్రజలు వినియోగించే కొవ్వుల నాణ్యత, పరిమాణాన్ని పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది.
గుండెకి ఎటువంటి కొవ్వు అవసరం
- ఒమేగా 3 ఆమ్లాలు
- మొక్కల ఆధారిత మోనోశాచురేటెడ్ కొవ్వులు
- మొక్కల ఆధారిత పాలిఅన్ శాచురేటెడ్ కొవ్వులు
- ఈ మూడు గుండెకి ఆరోగ్యాన్ని కలిగించే కొవ్వులు.
గుండెకి చెడు చేసే కొవ్వులు
- వనస్పతి
- వెన్న
- తవుడు నూనె
- కొబ్బరి నూనె
ఇవే కాదు ఎక్కువగా ఉప్పు తీసుకోవడం వల్ల రక్తపోటు స్థాయిలు పెరుగుతాయి. వీటి వల్ల గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సంతృప్త కొవ్వులు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. వెన్న కంటే నూనె గుండె రోగులకు మంచిదని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. మొక్కల ఆధారిత నూనె ఎంచుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. వెన్నకి బదులుగా ఆలివ్ ఆయిల్ తీసుకోవచ్చని అమెరికాకు చెందిన పరిశోధకులు ఓ అధ్యయనంలో వెల్లడించారు.
వెన్నకి ప్రత్యామ్నాయంగా ఆరోగ్యకరమైన నూనె
- ఆలివ్ నూనె
- పొద్దుతిరుగుడు నూనె
- ఆవనూనె
- అవోకాడో ఆయిల్
- వాల్ నట్ నూనె
- బాదం ఆయిల్
ఈ నూనెలను కూడా సరైన పద్ధతిలో మాత్రమే వినియోగించాలి. లేదంటే హాని కలిగించే ప్రమాదం ఉంది. ఆలివ్ ఆయిల్ ఒకసారి మాత్రమే ఉపయోగించాలి. వాడేసిన నూనెతో వంటకాలు చేయకూడదు. ఆలివ్ ఆయిల్ తో వండిన వంటకాలు చల్లారిపోతే.. వాటిని మళ్లీ వేడి చేసి తినకూడదు. నూనెని కూడా పొడి, చల్లని ప్రదేశాల్లో నిల్వ చేసుకోవాలి. సూర్యకాంతి తగల కుండా దూరంగా ఉంచాలి. ఎక్కువగా స్టాక్ పెట్టుకోకూడదు. ఎక్స్ పైరి డేట్ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే కొనుగోలు చేసుకోవాలి. 12 నెలలకు పైగా నిల్వ ఉన్న ఆయిల్ ని అసలు కొనుగోలు చెయ్యొద్దు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: రాగి పాత్రల్లో నీరు ఆరోగ్యానికి మంచిదే - కానీ, ఈ సమస్యలు ఉంటే మాత్రం వద్దు!
Also read: నువ్వుల సద్ది, సద్దుల బతుకమ్మ స్పెషల్ నైవేద్యం, ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది