Navel Oiling Benefits : బొడ్డుపై నూనె రాస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెప్తోంది ఆయుర్వేదం. దీనివల్ల శరీరానికి, అందానికి, ఆరోగ్యానికి ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయని చెప్తుంది. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్? ఎలాంటి ఆయిల్​ని ఎంచుకుంటే మంచిది? ఏ సమయంలో ఈ మసాజ్ చేస్తే మంచి ప్రయోజనాలు అందుతాయి? నెలరోజులు ఈ ప్రక్రియ ఫాలో అయితే కలిగే బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 

నాభికి నూనె రాస్తే కలిగే లాభాలివే.. 

టాక్సిన్లను బయటకు పంపి జీర్ణక్రియ మెరుగుచేస్తుంది. కడుపు ఉబ్బరం తగ్గుతుంది. మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడేవారు ఈ టెక్నిక్ ఫాలో అవ్వడం వల్ల సమస్యను దూరం చేసుకోగలుగుతారు. అంతేకాకుండా పూర్తి గట్ హెల్త్​ మెరుగవుతుంది. స్కిన్ హెల్త్​ని ప్రమోట్ చేస్తుంది. స్కిన్​ని మాయిశ్చరైజ్ చేస్తుంది. రాత్రుళ్లు ఈ మసాజ్ చేసుకుంటాము కాబట్టి విశ్రాంతిని అందించి నిద్రను మెరుగుపరుస్తుంది. 

నెల రోజులు అప్లై చేస్తే కలిగే ప్రయోజనాలివే

నాభికి నెలరోజులు నూనెను అప్లై చేస్తే మీరు ఎన్నో మార్పులు చూడవచ్చు. జీర్ణక్రియ గణనీయంగా మెరుగవుతుంది. కడుపు ఉబ్బరం తగ్గుతుంది. మలబద్ధకం దూరమవుతుంది. పోషకాల శోషణ జరిగి గట్ హెల్త్ మెరుగవుతుంది. కీళ్ల నొప్పులు కంట్రోల్ అవుతాయి. రక్త ప్రసరణ మెరుగై చర్మానికి మేలు చేస్తుంది. స్కిన్​ పొడిబారడం తగ్గి మాయిశ్చరైజ్ అవుతుంది. మొటిమలు కంట్రోల్ అవుతాయి. పిగ్మెంటేషన్​ని దూరం చేసుకోవచ్చు. రిప్రొడెక్షన్​కి మద్ధతునిస్తుంది. పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పులు దూరమవుతాయి. పీసీఓఎస్ సమస్యలతో ఇబ్బంది పడేవారికి ఇది మంచి ఫలితాలు ఇస్తుందని చెప్తున్నారు. 

ఎలా అప్లై చేయాలంటే.. 

ముందుగా నాభికి ఎలాంటి నూనెను అప్లై చేస్తే తెలుసుకోవాలి. కొబ్బరి నూనె, నువ్వుల నూనె, ఆముదం మంచి ఆప్షన్. ఆయుర్వేదంలో ఆముదంతో మంచి ప్రయోజనాలు అందుతాయని చెప్తారు. మీరు ఆయిల్​ని ఎంచుకున్న తర్వాత దానిని కాస్త గోరువెచ్చగా చేసుకోవాలి. ఇలా వేడి చేసుకున్న నూనెను కొన్ని చుక్కలు బొడ్డుపై వేసుకోవాలి. ఇప్పుడు మీ చేతులతో దానిని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. వృత్తాకార దిశలో రౌండ్​గా మసాజ్ చేసుకుంటే మంచిది. ఇలా చేయడం వల్ల ఆయిల్ చర్మంలోపలికి వెళ్లి మంచి ప్రయోజనాలు అందిస్తుంది. 

ఫాలో అవ్వాల్సిన టిప్స్ 

నూనెను అప్లై చేసే ముందు నాభిని శుభ్రంగా ఉంచుకోవాలి. తర్వాత ఆయిల్​ని అప్లై చేయాలి. రాత్రుళ్లు అప్లై చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. మసాజ్​ని ఫోర్స్​గా కాకుండా ఇరిటేషన్ లేకుండా సున్నితంగా చేయాలి. మెరుగైన ఫలితాల కోసం రోజూ.. నిద్రపోయే ముందు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు 

నాభికి నూనెను అప్లై చేయడం మంచిదే అయినా.. మీకు స్కిన్ ఇరిటేషన్, సెన్సిటివిటీ, ఇతర సమస్యలు ఉంటే అప్లై చేయకపోవడమే మంచిది. అలెర్జీలు వంటివి ఉంటే వైద్యుల సలహాతో దీనిని ఫాలో అవ్వొచ్చు. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.