చంద్రుడి మీద ఇల్లు కట్టాలని ఎవరికి ఉండదు చెప్పండి. అక్కడ మనిషి జీవించేందుకు తగిన వాతావరణం ఉండి ఉంటే.. ఇప్పటికే జాబిలిపై జాగా మొత్తం కబ్జా అయిపోయేది. అయితే, మన కంటే ముందే.. చంద్రుడిని ఎవరో కబ్జా చేశారనే సమాచారం అందింది. చైనాకు చెందిన ‘Yutu-2’ రోవర్.. క్లిక్ చేసిన ఫొటోలు చూసిన పరిశోధకులు అక్కడ చతురస్ర ఆకారం(క్యూబ్ షేప్)లో ఓ మిస్టరీ హౌస్ కనిపించింది. దీంతో దాన్ని ఛేదించే పనిలో పడింది. ఆ రోవర్ నుంచి వచ్చిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతున్నాయి. 


Yutu రోవర్ గత 2019 నుంచి చంద్రుడి మీద చక్కర్లు కొడుతోంది. అయితే, మనకు కనిపించే చంద్రుడి వైపు కాకుండా.. చంద్రుడికి అవతలి వైపు భాగాన్ని పరిశీలిస్తోంది. ఈ సందర్భంగా అది సుదూర ప్రాంతంలో క్యూబ్ షేప్‌లో ఓ ఆకారం కనిపించింది. చైనీస్ స్పేస్ ప్రోగ్రామ్‌ సంబంధిత కథనాలు రాస్తున్న అండ్రూ జోన్స్ అనే జర్నలిస్ట్ ఓ రోవర్ తీసిన ఆ చిత్రాలను ట్వీట్ చేశాడు. ఉత్తర దిక్కున వాన్ కార్మన్ క్రేటర్‌కు 80 మీటర్ల దూరంలో అది కనిపించిందని తెలిపాడు. 






సుదూర ప్రాంతంలో కనిపిస్తున్న ఆ క్యూబ్ స్థూపం కాదు. అలాగని గ్రహాంతరవాసులు కూడా కాదు. కానీ, అదేంటో కచ్చితంగా తెలుసుకోవలసి ఉందంటూ మరో ట్వీట్‌లో పేర్కొన్నాడు. చైనా ఎనిమిదేళ్ల కిందట పంపిన ఛేంజ్-3 రోవర్ చిత్రాల్లో ఈ రాయిని కనిపెట్టవచ్చు. అయితే, అదేంటో పూర్తిగా తెలుసుకోవాలంటే.. Yutu రోవర్ అక్కడికి చేరుకోవల్సిందే. అయితే, ఇందుకు కొన్ని రోజుల సమయం పడుతుంది. ఎందుకంటే.. ఆ రోవర్ అనేక రాళ్లు, రప్పలను దాటుకుంటూ దాని వద్దకు చేరుకోవాలి. వేగంగా వెళ్తే బోల్తా కొట్టి ఏటు కదల్లేని పరిస్థితి నెలకోవచ్చు. కాబట్టి.. అది నెమ్మదిగా ప్రయాణిస్తూ దాన్ని సమీస్తుంది. కాబట్టి.. అదేంటో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.






Read Also: గుడ్డుతో పాటూ వీటిని తినకూడదు, తింటే ఈ సమస్యలు తప్పవు
Read Also:  ఇలాంటి పేపర్ ప్లేట్లలో రోజూ భోజనాలు లాగిస్తున్నారా? అయితే ఈ రోగాలు రాక తప్పవు
Read Also:  ఈ మూడు వంటలు ప్రెషర్ కుక్కర్లో వండకూడదు... అయినా వండేస్తున్నాం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి