మాన్ సూన్ సీజన్లో జుట్టు పొడి బారడం, రాలిపోవడం, నిర్జీవంగా అయిపోతుంది. ప్రతి ఒక్కరూ ఈ సమస్యను ఎదుర్కొనే వాళ్ళే.  అందుకే ఈ సీజన్లో జుట్టు సంరక్షణ కోసం మార్కెట్లో దొరికే ఆయిల్స్ కాకుండా వంటింట్లో అందుబాటులో ఉండే వాటితోనే నూనె తయారు చేసుకోవచ్చు. ఇలా చేసిన నూనె రాసుకుంటే జుట్టు రాలడం ఆగిపోవడంతో పాటు కొత్త జుట్టు వస్తుంది. మీ శిరోజాల రక్షణ కోసం ఈ చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. 


జుట్టు రాలకుండా ఉండేందుకు మార్కెట్లో ఖరీదైన ఆయిల్స్ అందుబాటులో ఉన్నాయి. కాని అవి రాసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గడమేమో కానీ ఉన్న జుట్టు కూడా ఊడిపోతుంది. దాంతో పాటు స్కిన్ ఎలర్జీ, తలనొప్పి వంటివి కాకుండా ఇతర చర్మ సంబంధమైన రోగాల బారిన పడే అవకాశం కూడా ఉంది. అందుకే పెద్ద వాళ్ళు చెప్పినట్టుగా మనం ఇంట్లో తయారు చేసుకున్న నూనె తలకి రాసుకుంటే చక్కని ఫలితాలనిస్తుంది. 


Also read: పిల్లలు బరువు తక్కువగా ఉన్నారా? అయితే ఈ ఆహారాలు తరచూ తినిపించండి


కాచి చల్లార్చిన నూనె అనే పద్ధతి పాత కాలం నాటిది. ఇలా చెయ్యడం వల్ల జుట్టు రాలడం ఆగిపోతుందని పెద్దలు చెబుతారు. మందార ఆకులు, కరివేపాకు కొబ్బరి నూనెలో వేసి బాగా కాచి చల్లారిన తర్వాత వడకట్టి జుట్టుకు పెట్టుకుంటే మంచిది. అదే విధంగా మస్టర్డ్ ఆయిల్(ఆవ నూనె ) జుట్టు రాలిపోకుండా ఉండేందుకు బాగా పని చేస్తుంది. 


ఆవ నూనెలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. జుట్టు పెరుగుదలకి ఇది ఎంతగానో సహకరిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ ఇ జుట్టు కుదుళ్లు గట్టిపడి జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. ఇవే కాకుండా ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ ఎ, డి, ఇ, కె, జింక్, బీటా కెరొటిన్, సెలోనియం ఉండటం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. 


ఇందులో ఉండే రిచ్ యాంటీఆక్సిడెంట్ గుణాలు ఉండటం వల్ల జుట్టు రాలే సమస్యకి ఇది చాలా మంచిదని నిపుణులు సిఫారసు చేస్తారు. కొత్త జుట్టు రావడానికి కూడా ఇది సహాయపడుతుంది.


Also read: డయాబెటిక్ రోగులు నేరేడు పండ్లు తింటే ఏం జరుగుతుందో తెలుసా? తెలిస్తే వదలకుండా తింటారు


తయారీ విధానం 


ఒక పాన్ లో రెండు టేబుల్ స్పూన్ల ఆవ నూనె తీసుకోవాలి. అందులో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసి సన్న మంట మీద అవి చిటపట అనేదాక ఉంచాలి. స్టవ్ ఆపేసి దాని బాగా చల్లారనివ్వాలి. అందులో రెండు టేబుల్ స్పూన్ల నీటిని వేసుకుని విస్కర్ తో బాగా కలపాలి. క్రీమీగా వచ్చేదాకా బ్లెండ్ చేయాలి. నూనెతో కలిసి నీటిని కలపడం వల్ల అందులో ఉండే వేడి తగ్గుతుంది. రాత్రి పడుకునే ముందు ఆ నూనెని మాడుకు రాసుకుని మసాజ్ చేసుకోవాలి. కెమికల్ లేని షాంపూతో తల స్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చెయ్యడం వల్ల చక్కటి ఫలితం కనిపిస్తుంది.