Mumps Signs and Causes in Kids : ఈ మధ్య గవదబిళ్లలు అనే పదం ఎక్కువగా వినిపిస్తుంది. ఢిల్లీలో ఈ గవదబిళ్లల కేసులు పెరగడంతో దీని గురించిన చర్చ ఎక్కువైంది. పిల్లలను ప్రభావితం చేసే ఈ అంటువ్యాధికి నిర్దిష్ట చికిత్స లేదు. ఈ సమయంలో పిల్లలను గవదబిళ్లలు అనే వైరల్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవేళ సోకితే ఎలాంటి సహాయక చర్యలు తగ్గించాలి? వాటి లక్షణాలను ఎలా గుర్తించాలి? వంటి అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 


ఢిల్లీలో గవదబిళ్లల కేసులు రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. రీసెంట్​గానే కేరళలో కూడా ఈ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. ఈ సమస్యతో ఆస్పత్రుల్లో చేరే వారిలో ఎక్కువగా 6 నుంచి 7 ఏళ్ల మధ్య పిల్లలే ఉన్నారు. కాబట్టి చిన్నపిల్లలను ప్రభావితం చేసే ఈ సమస్యు గురించి పేరెంట్స్ అందరికీ అవగాహన ఉండాలి అంటున్నారు నిపుణులు. రుబులవైరస్​కు చెందిన పారామిక్సో వైరస్​ వల్ల గవదబిళ్లలు వస్తాయి. లాలాజలాన్ని తయారు చేసే పరోటిడ్ గ్రంథులను ప్రభావితం చేస్తాయి. ఇవి నొప్పిని కలిగిస్తాయి. 


గవద బిళ్లల లక్షణాలు ఇవే..


గవద బిళ్లలు సోకిన రెండు వారాల తర్వాత దాని లక్షణాలు కనిపిస్తాయి. ముఖంపై వాపు (ఒకవైపు లేదా రెండువైపులా) అనేది గవద బిళ్లల లక్షణాల్లో ఒకటి. నొప్పి, ముఖం చుట్టూ వాపు, దవడ, చెవులు సున్నితంగా మారడం, జ్వరం, చెవి నొప్పి, బాడీ పెయిన్స్, తలనొప్పి, అలసట, బలహీనంగా మారడం, ఆకలి లేకపోవడం వంటివాటిని గవదబిళ్లల లక్షణాలుగా చెప్తారు. పిల్లల్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వారిని వైద్యుల దగ్గరికి తీసుకువెళ్లాలి.  


గవదబిళ్లలు నయమవుతాయా?


గవదబిళ్లలకు నిర్దిష్టమైన చికిత్స లేదు. కానీ కొన్ని సంరక్షణ చర్యలు పాటించడం వల్ల గవదబిళ్లల లక్షణాలు తగ్గుతాయి. అది రికవరీని తగ్గిస్తుంది. మరి ఈ సమస్యకు చెక్​ పెట్టేందుకు ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి? వైద్యులు ఇచ్చే సలహాలు ఏంటి వంటి విషయాలు చుద్దాం.


సమస్యను తగ్గించే సూచనలు 


పిల్లలకు టీకాలు వేయించాలి. పిల్లలకు సిఫార్స్ చేసిన MMR టీకాను రెండు మోతాదులు వేయించాలి. ఈ టీకా తట్టు, గవదబిళ్లలు, రుబెల్లాను కంట్రోల్ చేస్తుంది. ఈ సమస్య లక్షణాలు గుర్తిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. చికిత్స అందించడం, నివారణ చర్యలు చేయడం వల్ల పిల్లల ఆరోగ్యాన్ని కాపాడవచ్చు. ఈ వ్యాక్సిన్​ పిల్లలను అంటువ్యాధుల రాకుండా రక్షణను ఇస్తుంది. ఎక్స్​పోజర్​ను పరిమితం చేయాలి. 



ముఖంపై వాపు, జ్వరం, బాడీ పెయిన్స్ వంటి లక్షణాలను గుర్తిస్తే.. వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా.. నిరోధించడానికి పాఠశాల, సామాజిక సమావేశాలకు దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు. తద్వార ఇతరులకు ఈ ఇన్ఫెక్షన్ చేరకుండా ఉంటుంది. భోజనం చేసే ముందు, బయట తిరిగి ఇంటికి వచ్చినప్పుడు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ఇది పిల్లలకు కచ్చితంగా నేర్పించాలి. ఇలా చేయడం వల్ల గవదబిళ్లలు వ్యాప్తి గణనీయంగా తగ్గుతుంది. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు పిల్లలు తమ మోచేతిని అడ్డుపెట్టుకోవాలనే అలవాటును నేర్పించాలి. 


Also Read : వామ్మో.. ఫేషియల్​తో HIV వచ్చిందా? జాగ్రత్తగా లేకుంటే మీ పరిస్థితి కూడా అంతే