Three Women were Diagnosed with HIV after a Vampire Facial : సెల్ఫ్​ లవ్​లో భాగంగా అందంగా ఉండాలని.. నలుగురిలో మంచిగా ఉండాలనే స్పృహ ఈ మధ్యకాలంలో పెరుగుతుంది. అయితే సెల్ఫ్​ లవ్​ అనేది తప్పుకాదు. కానీ తెలియకుండా చేసే కొన్ని మిస్టేక్స్ మిమ్మల్ని లైఫ్​లాంగ్ రిగ్రేట్ అయ్యేలా చేస్తాయి. తాజాగా ఓ మహిళకు ఇదే అనుభవం అయింది. వాంపైర్ ఫేషియల్ అనేది వరల్డ్​ వైడ్​ ప్రాచూర్యం పొందిన బ్యూటీ ట్రీట్​మెంట్లలో ఒకటి. ఆ చికిత్సతోనే.. ఓ మహిళకు HIV వచ్చినట్లు వైద్యులు గుర్తించారు. అసలు వాంపైర్ ఫేషియల్ అంటే ఏమిటి? దానిని ఎలా చేస్తారు? దానితో HIV ఎలా వచ్చింది వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


ఒకరు అనుకుంటే ముగ్గరుయ్యారు..


ఫెడరల్ హెల్త్ అధికారుల ప్రకారం.. లైసెన్స్ లేని న్యూ మెక్సికో మెడికల్ స్పాలో ఓ మహిళ వాంపైర్ ఫేషియల్ చేయించుకుంది. అనంతరం ఆమె HIV బారిన పడింది. ఆమె కంప్లైంట్ రైజ్ చేసిన తర్వాత మరో ఇద్దరు మహిళలు కూడా ఇక్కడ వాంపైర్ ఫేషియల్ చేయుంచుకున్నందుకు తమకు కూడా HIV వైరస్ సోకినట్లు తెలిపారు. వైరస్ ఉన్నవారికి వినియోగించిన సూదులనే ఇతరులకు కూడా వాడడంతో ఈ వైరస్ సోకినట్లు గుర్తించామని యూఎస్ నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ హెల్త్​ తెలిపింది. లైసెన్స్ లేని న్యూ మెక్సికో మెడికల్ స్పాలో చేయించుకోవడం వల్లే ఇది జరిగిందని నివేదికలో వెల్లడించింది. 


ఎప్పుడైనా బ్యూటీకి సంబంధించి ఏదైనా చేయించుకోవాలంటే.. లైసెన్స్ ఉన్న ప్రాంతాల్లో చేయించుకుంటే మంచిదని వారు సూచిస్తున్నారు. బ్యూటీ ట్రీట్​మెంట్​ చేయించుకోవడం తప్పు కాదని.. కానీ ఎక్కడ చేయించుకుంటున్నాము.. ఎలాంటి వాతావరణంలో కాస్మోటిక్ ట్రీట్​మెంట్ చేయించుకుంటున్నామనేది కచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి అంటున్నారు. మరి ఇంతకీ వాంపైర్ ఫేషియల్​ ఎలా చేస్తారు? 


వాంపైర్ ఫేషియల్ అంటే ఏమిటి?


వాంపైర్ ఫేషియల్స్ అనేవి అధికారికంగా చేసే ఓ బ్యూటీ కాస్మోటిక్ ట్రీట్​మెంట్. దీనినే ప్లేట్​లెట్ రిచ్ ప్లాస్మా మైక్రోనెడ్లింగ్ ఫేషియల్స్ అని కూడా అంటారు. ఈ ట్రీట్​మెంట్ చర్మాన్ని మరింత యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. మొటిమలు, మచ్చలు, ముడతలు వంటి వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తుంది. ఎవరైతే.. ఈ ఫేషియల్ చేయించుకోవాలనుకుంటున్నారో.. వారి బ్లడ్​ని తీస్తారు. అనంతరం దానిలో నుంచి ప్లేట్​లెట్​లను వేరు చేస్తారు. అప్పుడు ప్లాస్మాను.. క్లయింట్ ముఖంలోకి సింగిల్ యూజ్ డిస్పోజబుల్ లేదా మల్టీ యూజ్ స్టెరైల్​ సూదుల ద్వారా ఇంజెక్ట్ చేస్తారు. 



వాంపైర్ ఫేషియల్ సురక్షితమేనా?


ఎందరో మహిళలు ఈ కాస్మోటిక్​ ట్రీట్​మెంట్​తో ప్రయోజనం పొందారు. ప్రముఖులు సైతం వీటిని చేయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఫేషియల్ బాగా ఫేమస్ అయింది. అయితే నిపుణులు, అధికారికంగ సర్టిఫై అయినవారి దగ్గర చేయించుకుంటే ఇది కచ్చితంగా సురక్షితమేనని చెప్తున్నారు. ఉపయోగించిన డిస్పోజబుల్ పరికరాలను తిరిగి ఉపయోగిస్తే ఇలాంటి దారుణాలే జరుగుతాయని హెచ్చరిస్తున్నారు. కాస్మోటిక్ ఇంజెక్షన్​ సేవలను అందించే ప్రాంతాల్లో వచ్చే క్లయింట్ హెల్త్ రికార్డ్ కచ్చితంగా తీసుకోవాలని ఆరోగ్య అధికారులు సూచిస్తున్నారు. ఇవి హెచ్​ఐవి వంటి వాటిని అరికట్టడంలో హెల్ప్ చేస్తాయి. 


Also Read : కేకులు, కూల్ డ్రింక్స్, గమ్​లతో జాగ్రత్త.. వాటిలోని స్వీటెనర్ ప్రాణాలకే ప్రమాదమంటున్న కొత్త అధ్యయనం