Monsoon Cleaning Checklist : వర్షాకాలం ప్రారంభమైతే వేసవి నుంచి ఉపశమనం వస్తుంది. కానీ ఈ సమయంలో చల్లని వాతావరణంతో పాటు కొన్ని ఇబ్బందులు కూడా వస్తాయి. ఇంట్లో తేమ పెరగడం, దుమ్ము, ఫంగస్, దోమలు, బ్యాక్టీరియా పెరగడం వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. అందుకే ఈ సీజన్‌లో ఇంటిని శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం. కొన్ని ప్రదేశాలను నిర్లక్ష్యం చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు నిపుణులు. మరి వర్షాకాలంలో ఇంట్లో ఏ ఏ ప్రాంతాలను తప్పనిసరిగా శుభ్రం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Continues below advertisement

కిటికీలు, వెంటిలేటర్లు

వర్షాకాలంలో కిటికీలు, వెంటిలేటర్లపై దుమ్ము, తేమ పేరుకుపోతాయి. దీంతో ఫంగస్, బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని తరచూ శుభ్రం చేయాలి.

బాత్‌రూమ్

బాత్‌రూమ్‌లో తేమ ఎక్కువగా ఉండటంతో జారిపోయే ప్రమాదంతో పాటు ఫంగస్ కూడా పెరుగుతుంది. కాబట్టి గోడలు, టైల్స్, డ్రెయిన్లను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి.

Continues below advertisement

కిచెన్ సింక్, డ్రెయినేజ్

వర్షాకాలంలో సింక్, డ్రెయినేజ్ ప్రాంతాల్లో దుర్వాసన, క్రిములు పెరిగే అవకాశం ఎక్కువ. అందుకే వేడి నీరు, క్లీనింగ్ సొల్యూషన్‌తో వీటిని తరచూ శుభ్రం చేయాలి.

నీరు పేరుకునే ప్రాంతాలు

ఇంటి చుట్టుపక్కల లేదా బాల్కనీలో నీరు నిల్వ ఉండకుండా చూడాలి. లేదంటే నిల్వ నీటిలో దోమలు వేగంగా పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. 

కార్పెట్లు, డోర్ మ్యాట్లు

తేమ కారణంగా కార్పెట్లు, మ్యాట్లలో ఫంగస్, దుర్వాసన ఏర్పడవచ్చు. వీటిని ఎండలో ఆరబెట్టి శుభ్రం చేయడం మంచిది. కాబట్టి కాస్త ఎండ వచ్చినా.. వాటిని గాలిలో వేసి ఆరబెట్టుకోవాలి. 

అల్మారాలు, స్టోరేజ్ క్యాబినెట్లు

వర్షాకాలంలో చాలా రోజులుగా తెరవని అల్మారాల్లో తేమ చేరి బట్టలు, పుస్తకాలు పాడయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే వాటిని తరచూ తెరిచి గాలి తగిలేలా చేయాలి.

ఫ్రిజ్ వెనుక భాగం

ఫ్రిజ్ వెనుక భాగంలో దుమ్ము, తేమ పేరుకుపోతుంది. దీన్ని శుభ్రం చేయకపోతే క్రిములు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దానిని ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకోవాలి. 

సోఫాలు, కర్టెన్లు

సోఫాలు, కర్టెన్లు దుమ్ము, తేమను సులభంగా ఆకర్షిస్తాయి. వీటిని తరచూ వాక్యూమ్ చేయడం లేదా ఉతకడం మంచిది.

ఇవి కూడా..

గోడలు, సీలింగ్ మూలల్లో సాలీడు గూళ్లు, ఫంగస్ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇవి ఇంటి పరిశుభ్రతను దెబ్బతీయడంతో పాటు అలర్జీలకు కారణమవుతాయి. ఏసీ ఫిల్టర్లు, ఫ్యాన్లపై దుమ్ము పేరుకుపోతే గాలి నాణ్యత తగ్గుతుంది. వర్షాకాలంలో వీటిని శుభ్రం చేయడం ద్వారా ఇంట్లోని గాలి పరిశుభ్రంగా ఉంటుంది. ఈ టిప్స్ ఫాలో అవుతూ ఇంటిని మెయింటైన్ చేస్తే.. అనేక ఆరోగ్య సమస్యలను దూరం పెట్టగలుగుతారు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ హెల్త్ ఆర్టికల్స్, ఇంటి చిట్కాల కోసం దీనిని క్లిక్ చేయండి.