Monkeypox symptoms: దేశంలో మంకీపాక్స్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇండియాలో ఇప్పటి వరకు నాలుగు కొత్త మంకీ ఫాక్స్ కేసులు నమోదయ్యాయి. మంకీ ఫీవర్‌గా పిలిచే క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ (KFD) కారణంగా జనవరి నుంచి కర్ణాటకలోని నలుగురు వ్యక్తులు మరణించినట్లు మీడియా నివేదికలు సూచించాయి. తాజాగా ఓ చిన్నారి సైతం ఈ వ్యాధితో కన్నుమూయడం ఆందోళన కలిగిస్తోంది. 


ఈ మేరకు సిద్ధాపురా తాలూకాలోని అరేందూర్ గ్రామంలో శుక్రవారం రాత్రి ఐదు సంవత్సరాల బాలిక మంకీఫాక్స్ వల్ల ప్రాణాలు కోల్పోయింది. మంగళూరులోని కేఎంసీ ఆస్పత్రిలో వైద్యసేవలు అందిస్తున్నప్పటికీ చిన్నారి ఆరోగ్యం క్షీణించడంతో చివరకు అనారోగ్యంతో మృతి చెందిందని వైద్యులు వెల్లడించారు. కోతులపై నివసించే పేలు ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుందని వైద్యాధికారులు తెలిపారు. వైద్యాధికారులు గుర్తించారు. వెంటనే ఈ వ్యాధి నివారణ చర్యల గురించి స్థానిక ప్రజలకు అవగాహన కల్పించడానికి ఇంటింటికీ అవగాహన ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ వ్యాధి కారణంగా జనవరి 8న శివమొగ్గ జిల్లాలోని హోసానగర్ తాలూకాలో 18 ఏళ్ల యువతి చనిపోయినట్లు అధికారులు పెరిగారు.


మంకీ ఫాక్స్ ఎలా సంక్రమిస్తుంది?


మంకీఫాక్స్ అనేది మానవులకే కాదు ఇతర ప్రాణులకు సైతం తీవ్రమైన ముప్పును కలిగిస్తుంది. కోతులపై నివసించే పేలు ఇతర పశువులపైకి పాకి కాటు వేయడంతో అవి అనారోగ్యం బారినపడటంతోపాటు మానవులకు సైతం ఈ వ్యాధి సులభంగా వ్యాపిస్తుంది. 


మంకీ ఫాక్స్ లక్షణాలు:


మంకీ ఫీవర్ లక్షణాలు తరచుగా జలుబు, తీవ్రమైన తలనొప్పితో మొదలవుతాయి. ఈ వ్యాధి సోకిన వారికి మొదట్లో ఆకస్మికంగా చలి, అధిక జ్వరం బారినపడతారు. ఈ లక్షణాలు 2 నుంచి 7 రోజులకు కనిపిస్తాయి. జ్వరం12 రోజులు లేదా అంతకంటే ఎక్కువ రోజులు కూడా ఉంటుంది. ముక్కు, గొంతు, చిగుళ్ళు నుంచి రక్తస్రావం అవుతుంది. వ్యాధి తీవ్రత పెరిగినపుడు ఊపిరితిత్తులలో రక్తస్రావం లేదా పెద్ద పేగు నుంచి రక్తం కోల్పోవడానికి కారణమవుతుంది. ఇది మరణానికి దారితీయవచ్చు.


మంకీ ఫీవర్ ఎప్పుడు మెదలైంది:


1957లో కర్ణాటకలోని క్యాసనూర్ ఫారెస్ట్‌లో మొదలైన ఈ వ్యాధి 2012 నుంచి క్రమంగా భారతదేశం అంతటా విస్తరించింది. ఏటా సగటున 500 కేసులు నమోదవుతున్నట్లు వైద్యులు వెల్లడించారు. గత ఐదేళ్లలో మంకీ ఫాక్స్ కారణంగా 340 మరణాలు సంభవించినట్లు తెలిపారు. వాటిలో 5-10% మంది రక్తస్రావ లక్షణాలతో ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. 


మంకీ ఫాక్స్ నివారణ:


టీకాల ద్వారా ఈ వ్యాధిని అదుపు తేవచ్చని అధికారులు చెబుతున్నారు. అలాగే దీనిపై ప్రజల్లో కూడా అవగాహన చాలా ముఖ్యమని తెలుపుతున్నారు. కాబట్టి, జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం.


Also Read : బరువును తగ్గించే టేస్టీ, హెల్తీ బ్రేక్​ఫాస్ట్.. స్ప్రౌట్స్ పోహా రెసిపీని ఇలా సింపుల్​గా చేసేయండి



గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.